చందనకు జగపతి బాబు తల్లి సహాయం
హైదరాబాద్: తల్లిదండ్రులిద్దరూ వదిలేసి వెళ్లిపోవడంతో నాయనమ్మ వద్ద పెరుగుతూ చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న చిన్నారికి హీరో జగపతిబాబు తల్లి వసుంధరాదేవి స్పందించి రూ. 20 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. గురువారం ఈ మొత్తాన్ని హీరో జగపతిబాబు ఆ బాలికకు అందజేశారు. మణికొండకు చెందిన చందన అనే బాలిక నాలుగో తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చదువుకోవడం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఓ చానెల్లో బాలిక వేదనను చూసిన... వసుంధరాదేవి ఆమె చదువుల కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది.