vata
-
మా అమ్మ ముందే ఒళ్లంతా వాతలు పెట్టాడు.
హిందూపురం అర్బన్: ‘మా అమ్మ ముందే అతను ఇనుప కడ్డీలతో నాకు ఒళ్లంతా వాతలు పెట్టాడు టీచర్... చాలా నొప్పిగా ఉంది. కూర్చోలేకపోతున్నా...’ అంటూ ఆరేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన మాటలు విని ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు. చిన్నారిని బుజ్జగించి వివరాలు ఆరా తీయగా... ఓ మారుతండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అమృతకు చంద్రిక (6) అనే కుమార్తె ఉంది. కొంతకాలంగా అమృతకు భర్త దూరంగా ఉంటుండగా, ఆమె మణికంఠ అనే ఆటోడ్రైవర్‌తో సహజీవనం చేస్తోంది.బుధవారం రాత్రి చిన్నారి చంద్రిక పరుపుపై మూత్రం పోసిందన్న కారణంతో మారుతండ్రి మణికంఠ ఇనుప చువ్వలు కాల్చి తల్లి అమృత చూస్తుండగానే బాలిక మూతి, తొడ, ఇతర సున్నిత ప్రాంతాల్లో వాతలు పెట్టాడు. బాలిక రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ చిన్నారి గాయాలతోనే గురువారం ఉదయం బసవేశ్వర కాలనీలోని పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న చంద్రికను గుర్తించిన ఉపాధ్యాయురాలు శిల్ప దగ్గరికి తీసుకుని పరిశీలించగా... శరీరమంతా వాతలు కనిపించాయి. టీచర్ వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో హిందూపురం రూరల్ ఏఎస్ఐ జయరామిరెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని చిన్నారి పరిస్థితిని గమనించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వెంటనే హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మణికంఠ తనకు వాతలు పెట్టినట్లు చిన్నారి పోలీసులకు తెలిపింది. దీంతో మణికంఠపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాలికకు వాతలు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. -
నీటివాటా తేల్చాకే బ్యారేజీ నిర్మించాలి
ముస్త్యాల, సుందిళ్ల రైతుల నిరసన ౖయెటింక్లయిన్‌కాలనీ : తమ పొలాలకు సాగునీటి వాటా తేల్చిన తర్వాతనే సుందిళ్ల బ్యారేజీ పనులు చేపట్టాలని కమాన్‌పూర్ మండలం ముస్త్యాల, సుందిళ్ల గ్రామ రైతులు స్పష్టం చేశారు. బ్యారేజీ సర్వే కోసం శనివారం గ్రామానికి వచ్చిన తహసీల్దార్, సర్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరినదిపై బ్యారేజీ నిర్మించి ఇక్కడి నీటి ఎక్కడికో తరలిస్తూ మాకు నీరు లేకుండా చేస్తున్నారన్నారు. గోదావరివైపు కట్ట పోయడం వలన గోదావరినదిలో మోటార్లద్వారా నీరు రాకుండా పోతుందని, పొలాలన్నీ బీడుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయంలో తమకు అన్యాయం జరగకుండా చూడాలని, రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యారేజీ కోసం ముస్త్యాల గ్రామంలో 80 ఎకరాలు, సుందిళ్లలో 60 ఎకరాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వాటా కోసం పాట్లు..!
ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురు చూపు పంచాయతీలకే నేరుగా జమ చేసిన కేంద్రం జెడ్పీ, మండల పరిషత్‌లు నిర్వీర్యం వనరులు లేక రెండంచెలు విలవిల శ్రీకాకుళం టౌన్: స్థానిక సంస్థల మధ్య వాటాల సమస్య రోజురోజుకూ రగులుతోంది. మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలోగ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు పనిచేస్తున్నాయి. మూడుచోట్ల పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ హోదాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న ఆర్థిక సంఘం నిధులే దిక్కు. ఈ నిధును నేరుగా పంచాయతీల ఖాతాలకే కేంద్రం జమచేయడం, జెడ్పీ వాటాను కేటాయించేందుకు కొందరు సర్పంచ్‌లు అలక్ష్యం చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవాటాగా 13వ ఆర్థిక సంఘం నిధులు 2011–12 ఆర్థిక సంవత్సరం నుంచి విడుదల చేసింది. మూడు చోట్లకు వేర్వేరుగా కేటాయించేది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015–16లో 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ మిగిలిన రెండంచెలకు నిధుల విడదలను నిలిపివేసింది. వాటి నుంచి ఒక్కో బోర్ వెల్‌కు రూ.1000 చొప్పున, సీడబ్ల్యూస్కీంల నిర్వహణకు కొంత నిధులు తిరిగి జిల్లాపరిషత్ ఖాతాకు జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు పంచాయతీలు వినియోగించుకునేందుకు వీలు లేదని ఆదేశాలిచ్చింది. అయితే, పంచాయతీల నుంచి తిరిగి జెడ్పీలకు నిధులు జమచేయడంలో కొందరు సర్పంచ్‌లు శ్రద్ధ చూపడం లేదు. ఫలితం.. బోర్ మెకానిక్‌ల జీతాలు, వాటర్ స్కీంల నిర్వహణ మూలకు చేరింది. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఒక్క రూపాయి కూడా జిల్లా పరిషత్‌కు విడుదల చేయక పోవడంతో రూ.రెండున్నర కోట్లతోనే కార్యాలయ అవసరాలు, నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అభివృద్ధి పనులు మంజూరుకు వీలులేకుండా పోయిందని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మండల పరిషత్‌లు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక సంఘం నిధులు ఒక్కో మండలానికి రూ.20 నుంచి 25 లక్షలు విడుదలయ్యేవి. గత రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో కుర్చీలు అలంకారంగా మారుతున్నాయి. జిల్లాలోని 1100 గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గత ఏడాది రూ.97.99 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ61.68 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో 25శాతం తాగునీటి పథకాల నిర్వహణకు తిరిగి జిల్లాపరిషత్‌లకు జమచేయాల్సి ఉన్నా సర్పంచ్‌లు సహకరించడంలేదని జిల్లా పరిషత్ అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంఘం నిధులు నేరుగా జిల్లాపరిషత్, మండల పరిషత్‌లకు కేటాయించాలని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కోరుతున్నారు. కేంద్రం పునరాలోచిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదని వారు వాపోతున్నారు.