- ముస్త్యాల, సుందిళ్ల రైతుల నిరసన
నీటివాటా తేల్చాకే బ్యారేజీ నిర్మించాలి
Published Sat, Sep 3 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
ౖయెటింక్లయిన్‌కాలనీ : తమ పొలాలకు సాగునీటి వాటా తేల్చిన తర్వాతనే సుందిళ్ల బ్యారేజీ పనులు చేపట్టాలని కమాన్‌పూర్ మండలం ముస్త్యాల, సుందిళ్ల గ్రామ రైతులు స్పష్టం చేశారు. బ్యారేజీ సర్వే కోసం శనివారం గ్రామానికి వచ్చిన తహసీల్దార్, సర్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరినదిపై బ్యారేజీ నిర్మించి ఇక్కడి నీటి ఎక్కడికో తరలిస్తూ మాకు నీరు లేకుండా చేస్తున్నారన్నారు. గోదావరివైపు కట్ట పోయడం వలన గోదావరినదిలో మోటార్లద్వారా నీరు రాకుండా పోతుందని, పొలాలన్నీ బీడుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయంలో తమకు అన్యాయం జరగకుండా చూడాలని, రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యారేజీ కోసం ముస్త్యాల గ్రామంలో 80 ఎకరాలు, సుందిళ్లలో 60 ఎకరాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement