vatican
-
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూత
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏళ్ల బెనెడిక్ట్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు ప్రకటించారు. ‘పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ 16 ఈ రోజు వాటికన్లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని బాధతో మీకు తెలియజేస్తున్నాను’అని ఓ ప్రకటన విడుదల చేశారు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ. 2013లో పోప్ బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్యర్చానికి గురిచేశారు బెనెడిక్ట్16. అప్పటి నుంచి వాటికన్ గ్రౌండ్స్‌లోని కాన్వెంట్లో నివసిస్తున్నారు. ఆయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. మాజీ పోప్‌లకు రూల్‌బుక్ లేనప్పటికీ, బెనెడిక్ట్ అంత్యక్రియలు ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్లో జరగాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా? -
సుబ్బరామయ్య
‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖరశాస్త్రి. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్‌లో చేర్పించు’ అంటాడు. ‘‘నిరుత్సాహపరచడం కాదు కానండీ.. మీ అబ్బాయికి సీటు వస్తుందని ఖాయంగా చెప్పలేను’’ అని అప్లికేషన్ పెట్టిన రోజే సోమశేఖర శాస్త్రికి చెప్పాడు ఆఫీస్ క్లర్క్! అది క్రిస్టియన్ కాలేజ్. ఆ కాలేజ్‌లో కొడుక్కి సీటు సంపాదించడం కోసం.. అవసరమైతే వాటికన్ సిటీ నుంచైనా రికమండేషన్ లెటర్ తెచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నాడు సోమశేఖర్. క్రిస్టియన్ కాలేజ్ అంటే అంత గురి సోమశేఖర్‌కి. పద్ధతులు నేర్పిస్తారు. జీవితాన్ని ఒక గాడిలో పడేస్తారు. అందుకే ఎవరైనా.. ‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖర్. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్‌లో చేర్పించు’ అంటాడు. అడ్మిషన్స్ క్లోజ్ చేస్తుండగా చివరి వడపోతలో అవంత్కి సీటొచ్చింది! ‘‘అదృష్టం. మీ వాడికి ముందున్న అప్లికెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రయారిటీ లిస్ట్‌లో మీ వాడికొచ్చింది’’ చెప్పాడు క్లర్క్. ‘‘సంతోషం’’ అన్నాడు సోమశేఖర్. అయితే అవంత్ సంతోషంగా లేడు. అతడి ఫ్రెండ్స్ వేరే కాలేజ్‌లో చేరారు. ‘అందరం ఒకే కాలేజ్‌లో చేరదాం’ అని ఇంటర్లో ఫైనల్ ఎగ్జామ్ రాసిన రోజే అనుకున్నారు ఫ్రెండ్సంతా. అదొక బాధ ఉండిపోయింది అవంత్లో. మామూలు బాధ కాదు. మనోవేదన. మొదటిరోజు కాలేజ్ అంతా తిప్పిచూపించారు కొత్త విద్యార్థులకు. విద్యార్థులు కొత్తే కానీ, కాలేజీ కొత్తదేం కాదు. ఓ డెబ్భై ఏళ్ల నుంచి ఉంది. కాలేజీ అనే కానీ, యూనివర్శిటీ క్యాంపస్‌లా ఉంటుంది. బయటి ప్రపంచానికి కనిపించదు. అడవి మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. క్యాంపస్‌లోనే కాలేజ్ బిల్డింగ్‌లకు కొద్ది దూరంలో హాస్టల్స్. వాటిల్లో అరల్లాంటి గదులు. ఆ గదుల్లో ఒక గది అవంత్ది. గదికి ఒక్కరే ఉంటారు. కాలేజ్‌లో చేర్పించి, బస్సెక్కి వెళ్లేటప్పుడు కొడుక్కి చెప్పాడు సోమశేఖర్.. ‘‘ఇప్పుడు లోపలికి వెళ్తున్నావ్. డిగ్రీ సర్టిఫికెట్‌తోనే మళ్లీ నువ్వు బయటికి రావడం’’ అని. ఆయన ఉద్దేశం ‘అంత గొప్ప కాలేజ్ ఇది’ అని చెప్పడం. రెండో రోజు కూడా అవీ ఇవీ చూపించి, కొత్త విద్యార్థులందర్నీ.. వేరుగా ఉన్న ఒక క్లాస్రూమ్ దగ్గరకి తీసుకెళ్లారు. ఆ రూమ్‌కి తాళం వేసి ఉంది. మిగతా క్లాస్రూమ్లన్నీ రిన్నొవేషన్తో నిన్న మొన్న కట్టినట్లు కొత్తవిగా ఉంటే, అదొక్కటీ పాతదిగా ఉంది. గోడమీద ‘సుబ్బరామయ్య క్లాస్ రూమ్’ అని రాసి ఉన్న చిన్న బోర్డు ఉంది. ‘‘ముప్ఫై ఏళ్ల క్రితం ఈ క్లాస్‌రూమ్‌లోనే సుబ్బరామయ్య మాస్టారు పాఠాలు చెప్పేవారు. ఈ కాలేజీకి మాస్టారిగా రాక ముందు సుబ్బరామయ్య గారు ఈ కాలేజీలోనే విద్యార్థి. లెక్చరర్ అయ్యాక.. విద్యార్థులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు. అందుకే సుబ్బరామయ్యగారు చనిపోయాక, ఆయన క్లాస్‌రూమ్‌ని ఆయనకే ఉంచేసింది కాలేజ్ యాజమాన్యం. ఇందులో తరగతులు జరగవు. ఏ విద్యార్థికైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం క్లాస్రూమ్ తాళాలిచ్చి కాసేపు లోపల కూర్చొని రమ్మని పంపుతారు. అదొక సంప్రదాయంగా వస్తోంది. సుబ్బరామయ్యగారే ఇప్పటికీ లోపల ఉండి, కష్టం చెప్పుకోడానికి వచ్చిన విద్యార్థి కన్నీళ్లు తుడిచి పంపిస్తాడని ఒక నమ్మకం’’ అని చెప్పాడు గుంపును తీసుకొచ్చిన లెక్చరర్. ‘‘అంటే సార్.. సుబ్బరామయ్య మాస్టారి ఆత్మ లోపల తిరుగుతోందా?’’ అని అడిగాడో విద్యార్థి. ఆ గది వైపు పరిశీలనగా చూశాడు అవంత్. మూడో రోజు నుంచి రెగ్యులర్ క్లాసులు. ఈసురోమంటూ బుక్స్ పట్టుకుని కాంపౌండ్‌లో తన హాస్టల్ రూమ్ నుంచి కాలేజ్ బిల్డింగ్ వైపు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అవంత్. అతడి మనసంతా.. ఊరికి దగ్గర్లో తన ఫ్రెండ్స్ చేరిన కాలేజ్‌లోనే ఉంది. ‘‘బాబూ.. ఇలారా..’’ కాంపౌండ్‌లో చెట్టుకింద అరుగు మీద కూర్చొని ఉన్న ఓ ముసలాయన.. అవంత్ని పిలిచాడు. తలంతా నెరిసి, మనిషి వంగిపోయి ఉన్నాడు.అవంత్ ఆయన దగ్గరకు వెళ్లాడు. ‘‘కూర్చో’’ అన్నాడు ఆ మనిషి. కూర్చున్నాడు. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగాడు. ‘‘మీరెవరు?’’ అడిగాడు అవంత్. నవ్వాడాయన. ‘‘నేనెవర్నీ కాదు.ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిపోతుంటాను’’ అన్నాడు. ‘‘మీరెందుకు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు?’’ అడిగాడు అవంత్. ‘‘నలభై ఏళ్ల క్రితం నేనూ ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పాఠాలు చెప్పాను. అందుకే అప్పుడప్పుడూ వచ్చి, కాసేపు కూర్చొని వెళుతుంటాను. మనసులో నీకేదైనా కష్టం ఉంటే అలా దిగాలుగా ఉండకు. ఎవరికైనా చెప్పుకో’’ అన్నాడు. మౌనంగా ఉన్నాడు అవంత్. ‘‘పోనీ.. నాకు చెప్పు’’ అన్నాడు. అవంత్ చెప్పలేదు. క్లాస్‌రూమ్‌కి వెళ్లిపోయాడు. క్లాస్‌లన్నీ అయ్యేసరికి సాయంత్రం అయింది. అవంత్కి మాత్రం ఒక ఏడాది అయినట్లుగా ఉంది. అంత భారంగా కూర్చున్నాడు. అక్కడి నుంచి అతడు నేరుగా హాస్టల్‌కి వెళ్లలేదు. లెక్చరర్స్ క్వార్టర్స్‌కి వెళ్లాడు. అక్కడి నుంచి ‘సుబ్బరామయ్య క్లాస్రూమ్’ తాళాలు అడిగి తెచ్చుకున్నాడు. తాళాలు తీసి ‘సుబ్బరామయ్య క్లాస్రూమ్’లోకి వెళ్లి కూర్చున్నాడు అవంత్. క్లాస్‌రూమ్‌లో ఉన్నట్లే మూడు వరుసల్లో బెంచీలు ఉన్నాయి. మధ్య వరుసలో ముందు బెంచీలో కూర్చున్నాడు. ఎదురుగా డయాస్ మీద లెక్చరర్ కూర్చునే కుర్చీ ఉంది. వెనుక పెద్ద బ్లాక్ బోర్డు. కాసేపలా కూర్చున్నాడు. తర్వాత బెంచీకి తల ఆన్చి కళ్లు మూసుకున్నాడు. ‘ఎందుకు నాన్నా.. నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్‌లో నన్ను చేరనివ్వలేదు?’ అని బాధగా అనుకున్నాడు. డయాస్ మీద కుర్చీ కదిలిన చప్పుడైంది. కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు. ఎ.. దు..రు.. గా.. కుర్చీలో..!! దఢేల్మని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు అవంత్. క్లాస్‌రూమ్‌కి తాళం వేశాడు. పరుగు పరుగున నడుస్తూ ఓ చోట ఆగాడు. పూర్తిగా చీకటి పడకుండానే కాంపౌండ్‌లో లైట్లు వెలిగాయి. ఇంటికి ఫోన్ చేశాడు అవంత్. అవంత్ తల్లి లిఫ్ట్ చేసింది. ‘‘అమ్మా.. నాన్నకెలా ఉంది?’’ అని అడిగాడు. ‘‘ఏంట్రా ఆ కంగారు? నాన్నకెలా ఉంటుంది? బాగానే ఉంది. సంతోషంగా ఉన్నారు. కాలేజీలో నీకు సీటొచ్చినట్లు లేదాయనకి. ఆయనకే వచ్చినట్లుంది. ఇదిగో మాట్లాడు’’ అంది ఆవిడ. ‘‘నాన్నా.. ఎలా ఉన్నావ్?’’.. అడిగాడు అవంత్, సోమశేఖర్ లైన్లోకి రాగానే. పెద్దగా నవ్వాడాయన. ‘‘నువ్వెలా ఉన్నావో చెప్పరా. కాలేజ్ ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘బాగుంది నాన్నా.. చాలా బాగుంది. మళ్లీ చేస్తా’’ అని ఫోన్ కట్ చేశాడు అవంత్. మర్నాడు హాస్టల్ నుంచి కాలేజ్‌కి నడుస్తుంటే మళ్లీ ఆ ముసలాయన అక్కడే కూర్చొని కనిపించాడు అవంత్కి. ‘‘ఒక్కరోజులో అలవాటు పడినట్లున్నావ్ కాలేజ్‌కి. ముఖంలో సంతోషం కనిపిస్తోంది. ఏదో జరిగింది కదా’’ అన్నాడు ఆయన. అవంత్ ఆయన వైపే పరిశీలనగా చూసి, ‘ఈయనగానీ సుబ్బరామయ్య మాస్టారు కాదు కదా’ అనుకున్నాడు. అనుకుని...‘‘లేదు, ఏం జరగలేదు’’ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు.వెళుతున్న అవంత్నే సంతృప్తిగా చూస్తూ.. ‘ఎవరికి ఎవరి చేత చెప్పించాలో వారి చేతే చెప్పించాలి’ అనుకున్నాడు ముసలాయన. - మాధవ్ శింగరాజు -
మెలానియా ట్రంప్.. ఎందుకిలా?
-
మెలానియా ట్రంప్.. ఎందుకిలా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలైన మెలానియా ట్రంప్ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం సందర్భంగా తలపై వస్త్రం కప్పుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ అంశం అక్కడ చర్చనీయాంశమైంది. పోప్ ను కలిసే సందర్భంలో నల్లని రంగు దస్తులు ధరించడం ఆనవాయితీ. చేతులు పూర్తిగా కప్పిఉంచేలా డ్రెస్స్ ధరించిన మెలానియా, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ తలపై వస్త్రంతో కనిపించి వాటికన్ సంప్రదాయాన్ని పాటించారు. ఇటీవల ట్రంప్ దంపతులు తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాకు వెళ్లగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా నడుచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీలో ఆమె పర్యటించారు. మెలానియాతో పాటు ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ సైతం తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం తెలిసిందే. ఇస్లామిక్ సంప్రదాయ రాజ్యమైన సౌదీలో మహిళల పట్ల, మహిళల వస్త్రధారణ పట్ల పలు ఆంక్షలు ఉంటాయి. పర్యాటకులు, విదేశీయులకు మాత్రం ఈ ఆంక్షలపై సడలింపు ఉంటుంది. సౌదీలో వారి సంప్రదాయం, పద్ధతులు పాటించని మెలానియా, పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం సందర్భంగా బాధ్యతగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 'వాటికన్ ప్రొటోకాల్ ప్రకారం ప్రథమ మహిళ లాంగ్ స్లీవ్స్ ధరించాలి. నల్లని రంగు దుస్తులు ధరించడంతో పాటు తలపై వస్త్రాన్ని కప్పుకుని హాజరవడం సంప్రదాయం. మరోవైపు సౌదీ పర్యటనలో ఆమె వస్త్రధారణ పలానా ఉండాలంటూ ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. అందుచేత మెలానియా సౌదీ పర్యటనలో మామూలుగానే వ్యవహరించారని' మెలానియా వ్యక్తిగత అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రిషమ్ వివరించారు. 2015 జనవరిలో అప్పటి ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు వెళ్లడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. ఇలా చేయడం సౌదీని అవమానించడమేనని, దీనివల్ల అమెరికాకు శత్రువులు మరింత పెరిగిపోతారని విమర్శిస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. -
సెయింట్ థెరిసా!
కన్నపేగు తల్లడిల్లుతుంటే ఏ అమ్మ మనసైనా చివుక్కుమంటుంది. ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని లాలిస్తుంది...ఊరడిస్తుంది...బుజ్జగిస్తుంది. పేగు బంధం గొప్పతనమది. అలాంటి మాతృత్వపు పరిమాళాన్ని సమాజంలో లక్షలాదిమందికి పంచడం మాత్రమే కాదు...ఆ విషయంలో ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి కనుమరుగైన మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటన వెలువడింది. వాటికన్ మతాచార్యుడు పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ప్రకటన కోసమే దేశదేశాల్లోని కోట్లాదిమంది ఆమె అభిమానులు చిరకాలంగా నిరీక్షిస్తు న్నారు. 2003లో ఆనాటి పోప్ జాన్‌పాల్ 2 మదర్‌కు సెయింట్ హోదా ఇచ్చే ప్రక్రి యను ప్రారంభించామని ప్రకటించినప్పుడు ఈ నిరీక్షణ మొదలైంది. రోగగ్ర స్తులకు సేవలందించడానికి, పేద హృదయాలను ఊరడించడానికి, అనాథలకు నీడై నిలవడానికి సరిహద్దులు అడ్డురావని నిరూపించిన ప్రేమమయి ఆమె. ఈ ప్రస్థానంలో సెయింట్‌హుడ్ అనేది ఒక సంప్రదాయకమైన లాంఛనమే కావొచ్చు. ఒక మతంలో లభించే ఉత్కృష్టమైన గౌరవమే కావొచ్చు. కానీ ఆమె చేసిన సేవలకూ, ఆమె స్థాపించిన విలువలకూ, ఆమె నెలకొల్పిన ఆదర్శాలకూ ఏమి చ్చినా తక్కువే అవుతుంది. ప్రపంచం కూటములుగా మారడం, పరస్పర పోటీ పెరగడం, దేశాలమధ్య విద్వేషాలు రాజుకోవడం, అవి ముదిరి యుద్ధాలుగా రూపాంతరం చెందడంవంటి పరిణామాలవల్ల సమాజాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. మానవ పరిణామ క్రమంలో రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం అసాధారణమైనది. ఆ యుద్ధాల పర్యవసానాలు అతి భయంకరమైనవి. ఎంతో వినాశనాన్ని తీసుకొచ్చిన మొదటి ప్రపంచ యుద్ధమే మదర్ థెరిసా లాంటి గొప్ప మానవతామూర్తిని అందించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యుద్ధం జనజీవితాల్లో కలిగించిన సంక్షోభాన్ని, అందువల్ల చుట్టూ ఉన్నవారు పడుతున్న ఇబ్బందులనూ, క్షతగాత్రుల రోదనలనూ, వేదనలనూ పసి వయసులో అప్పటికి అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా ఉన్న మదర్‌ను తల్లడిల్లజేశాయి. సమాజంలోని అసహాయులకు ఏదో ఒకటి చేయా లని, వారికి అండగా నిలవాలని అప్పుడే ఆమె నిర్ణయించుకున్నారు. వయసు పెరిగేకొద్దీ ఆ భావన మరింతగా బలపడింది. సేవ చేయడానికి నన్‌గా మారడమే మార్గమని పన్నెండేళ్ల ప్రాయంలోనే భావించినా అందుకు వయసు సరిపోదని తెలిసి మరో నాలుగేళ్లు ఆగారామె. పద్దెనిమిదేళ్ల వయసులో ఇల్లు విడిచి ఐర్లండ్ లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటోలో చేరిననాటినుంచి 1997లో కోల్‌కతాలో 87 ఏళ్ల వయ సులో మరణించేవరకూ ఆమె సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఉన్నారు. భార త్ను భయంకరమైన కరువుకాటకాలు పీడిస్తున్న సమయంలో... పేద జనం రోగాలబారినపడి తల్లడిల్లుతున్న సమయంలో...ఎటుచూసినా దారిద్య్రం తాండ విస్తున్న సమయంలో తన సేవలు ఇక్కడ అవసరమని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పంనుంచి ఆమె వెనుదిరగలేదు. మొదట్లో ఉపాధ్యాయినిగా, అనంతరం ప్రిన్సిపాల్‌గా సేవలందించినా ఆ తర్వాత పూర్తిగా వీధి బాలల, నిరుపేదల, రోగగ్రస్తుల సేవలోనే ఆమె గడిపారు. అందుకవసరమని భావించి వైద్యరంగంలో సైతం శిక్షణపొందారు. వారు కుష్టురోగులైనా, మరే ఇతర అంటువ్యాధితో బాధ పడుతున్నా అక్కున చేర్చుకుని ఆదరించారు. గాయాలను శుభ్రపరచడం, కట్టు కట్టడం దగ్గరనుంచి ఎన్నో సేవలందించి అలాంటివారిలో మానసిక స్థైర్యాన్ని నింపారు. అప్పటి కలకత్తా నగర వీధుల్లో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం. ఆరో జుల్లో ఇలాంటి సేవలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఆ తరహా ఆచరణకు ఎందరినో పురిగొల్పేవి. ఈ క్రమంలో ఆమె కొచ్చిన బిరుదులు, పురస్కారాలు ఎన్నెన్నో! 1962లో పద్మశ్రీ పురస్కారం మొదలుకొని జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె అందుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కాదు. 1979లో నోబెల్ శాంతి బహుమతికి థెరిసాను ఎంపిక చేసినప్పుడు తనకా స్థాయి లేదని తిరస్కరించిన వ్యక్తిత్వం ఆమెది. ఆ తర్వాత ఎందరో బతిమాలగా, ఒత్తిడి తీసుకురాగా ఆ పురస్కారాన్ని అందుకోవడానికి అంగీకరించారు. అవార్డుల ద్వారా లభించే నగదును తన సేవా కార్యక్రమాలకే ఆమె వెచ్చించారు. అలాంటి సొమ్ముతోనే మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ నెలకొల్పి దాని ఆధ్వర్యంలో అనాథాశ్రమాలనూ, ఆస్పత్రులనూ, ధర్మశాలలనూ, ఆహారకేంద్రాలనూ ఏర్పాటుచేశారు. వేలాదిమందికి ఆరోగ్యం చేకూర్చడంతోపాటు వారికవసరమైన తిండి, బట్ట సమకూర్చారు. తనకు జీసస్‌పై నమ్మకం ఉన్నా దానికి అతీతంగా కుల మతాల ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరినీ తాను నిర్మించిన నిర్మల్ హృదయ్‌లో చేర్చుకున్న విశాల స్వభావం ఆమెది. నిత్యం ఈసడింపులు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలను చవిచూస్తూ బతుకీడ్చేవారికి ఆపన్నహస్తం అందించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం సామాన్యమైన విషయం కాదు. ఈ గడ్డపై జన్మించకపోయినా, దూరతీరాలనుంచి ఇక్కడికొచ్చినా ఈ దేశ ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని, వారి కన్నీళ్లను తుడవడానికి మదర్ ప్రయత్నించారు. ఆమె సామాజిక సేవలో స్వార్ధమున్నదని, మతాన్ని వ్యాప్తి చేయడానికి దాన్ని సాధనంగా ఉపయోగించుకున్నారని విమర్శించినవారున్నారు. ఇలాంటి సేవా తత్పరత యధాతథ స్థితి కొనసాగటానికి మాత్రమే తోడ్పడుతుందన్నవారున్నారు. కానీ ఎలాంటివారైనా, వారి సిద్ధాంతాలు ఏవైనా... సేవాభావంతోనే జన హృదయాలను గెలవడం సాధ్యమన్న అంశాన్ని గ్రహించగలిగారు. మదర్ థెరిసా ఈ దేశంలో అడుగిడేనాటికి దాదాపుగా ఉనికిలో లేని స్వచ్ఛంద సంస్థలు ఈరోజు లక్షల్లో ఉండటమే దీనికి తార్కాణం. ప్రభుత్వం దృష్టి సోకని మారుమూల ప్రాంతాల్లో సైతం పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, అనాథాశ్రమాల వంటివి అంతో ఇంతో చురుగ్గా పనిచేస్తున్నాయంటే అది మదర్ థెరిసా పెట్టిన ఒరవడే. అంతటి మహనీయురాలికి సెయింట్‌హుడ్ లభించడం హర్షించదగింది. -
పోప్‌పై గూఢచర్యం.. రహస్యాలపై రెండు బుక్స్
వాటికన్‌సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత సంభాషణలు వెలుగుచూడటం.. క్యాథలిక్ చర్చ్ వర్గాలను కుదిపేస్తున్నది. పోప్ ఫ్రాన్సిస్‌పై గూఢచర్యం జరిపిన ఓ స్పానిష్ క్రైస్తవ మతగురువు, మరో వ్యక్తి.. ఆయన వ్యక్తిగత సంభాషణలకు సంబంధించిన వైర్ టేప్‌లను బయటపెట్టారు. ఇప్పటికే వాటికన్ చర్చ్‌కు సంబంధించిన కీలక రహస్య సమాచారం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు చేరడం కలకలం సృష్టిస్తున్నది. ఈ రహస్య సమాచారంలో చర్చ్ నిధులను కొల్లగొట్టడం, వేశ్యలోలత్వం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రచించిన రెండు పుస్తకాలు బుధవారం విడుదల కానున్నాయి. స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు సంబంధించిన నిధులను క్రైస్తవ మతగురువులైన కార్డినల్స్ నివాసాలకు అదనపు హంగులు చేకూర్చేందుకు దుర్వినియోగం చేశారని, అక్రమాలకు నెలవైన వాటికన్ బ్యాంకు నేరగాళ్లకు అడ్డగా మారిందని ఈ పుస్తకాలు ఆరోపిస్తున్నాయి. చర్చ్‌కు సంబంధించిన వర్గీకరించిన పత్రాలను దొంగలించి లీక్ చేశారనే ఆరోపణలపై ప్రజాసంబంధాల నిపుణుడు ఫ్రాన్సెస్కా చావ్కీ, మొన్సీగ్నర్ లుసియో ఎంజెల్ వాలెజో బాల్డా గతవారం అరెస్టయ్యారు. అయితే ఈ ఇద్దరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు గియన్లుయిజి నూజి, ఎమిలియనో ఫిట్టిపాల్దికి రహస్య సమాచారం చేరవేశారా? అన్న విషయాన్ని వాటికన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రాసిన పుస్తకాలను మాత్రం తీవ్రంగా ఖండించింది. -
పోప్ జాన్ పాల్ 2 ఎంపిక
ఆ నేడు 16 అక్టోబర్, 1978 వాటికన్ సిటీలోని రోమన్ కాథలిక్ చర్చ్ పోలాండ్‌కు చెందిన కారొల్ వొజ్టైలాని పోప్ జాన్ పాల్ 2 గా ఎన్నుకుంది. రోమన్ కాథలిక్ చర్చ్ ఇటలీకి చెందని వ్యక్తిని పోప్‌గా ఎన్నుకోవడం గత 455 సంవత్సరాలలో అదే మొదటిసారి కావడం ఒక విశేషమైతే వొజ్టైలా 58 సంవత్సరాల వయసులోనే పోప్ పదవికి ఎన్నికై, అంతవరకూ ఆ పదవికి ఎంపికైన పోప్లలో అతి పిన్న వయస్కుడు కావడం మరొక విశేషం. -
గే జంటలతో కొత్త సవాళ్లు: పోప్
వాటికన్: ప్రస్తుత సమాజంలోని కొన్ని విభిన్నమైన నిజాలు కేథలిక్ సంఘానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయని పోప్ ఫ్రాన్సిస్ భావిస్తున్నారు. ఇలాంటి పలు అభిప్రాయూలతో కూడిన పోప్ సందేశాలను లా సివిలిటా కాటోలికా పత్రిక ప్రచురించింది. ముఖ్యంగా గే జంటలతో పిల్లలు కలిసి నివసించడమనేది కేథలిక్ సంఘానికి విద్యాపరంగా, అన్నిటికీ మించి సువార్త ప్రకటన పరంగా.. కొత్త సవాలులా పరిణమిస్తోందని పోప్ చెప్పారు. ‘నా తల్లి స్నేహితురాలు నన్ను ఇష్టపడదు..’ అంటూ ఓ బాలిక తన టీచర్‌తో చెప్పుకున్న సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు.