
పోప్ జాన్ పాల్ 2 ఎంపిక
ఆ నేడు 16 అక్టోబర్, 1978
వాటికన్ సిటీలోని రోమన్ కాథలిక్ చర్చ్ పోలాండ్‌కు చెందిన కారొల్ వొజ్‌టైలాని పోప్ జాన్ పాల్ 2 గా ఎన్నుకుంది. రోమన్ కాథలిక్ చర్చ్ ఇటలీకి చెందని వ్యక్తిని పోప్‌గా ఎన్నుకోవడం గత 455 సంవత్సరాలలో అదే మొదటిసారి కావడం ఒక విశేషమైతే వొజ్‌టైలా 58 సంవత్సరాల వయసులోనే పోప్ పదవికి ఎన్నికై, అంతవరకూ ఆ పదవికి ఎంపికైన పోప్‌లలో అతి పిన్న వయస్కుడు కావడం మరొక విశేషం.