వీర్దాస్ అన్బిలీవబులిష్!
వీర్దాస్ రచించి, పెర్ఫామ్ చేసే స్టాండప్ షో ఇది. ప్రతి స్టోరీ ఎండింగ్ మరో స్టోరీలోకి లీడ్ చేస్తుంది. తన అనుభవాల నుంచి అల్లిన కథలివని వీర్దాస్ చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలియదు గానీ... జీవితంలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో చెబుతూ ఈ లైవ్ షో ముగిస్తాడు వీర్దాస్. మండుటెండల్లో కాస్తంత రిలీఫ్నిచ్చే ఓ ఆహ్లాదకర షో మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ నెల 16 రాత్రి 8 గంటలకు. ఎంట్రీ ఒకరికి రూ.500 నుంచి రూ.2,500.