Veeresh
-
కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..
సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసలు, బాధితురాలు తెలిపిన వివరాలు.. హెచ్.మురవణి గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య(24) గత ఏడాది డిసెంబర్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓ(కమ్మునిటీ హెల్త్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేష్(28)ను ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అమ్మా యి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేష్ తన భార్యను రోజూ ఉదయం ద్విచక్ర వాహనంపై హెచ్.మురవణికి వెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకొని వచ్చేవాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం తన భార్యను బైక్‌పై తీసుకొస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ కింద పడిపోవడంతో వీరేష్‌పై విచక్షణ రహితంగా దాడిచేసి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు చెప్పింది. రహదారిలో వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో పాటు చికిత్స నిమిత్తం వీరేష్‌ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిర్మాతకు దేహశుద్ధి..అరెస్ట్
బెంగళూరు(బొమ్మనహళ్లి) : హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్న ఓ నిర్మాతకు బాధితురాలి బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్లో జరిగింది. వివరాలు..‘ప్రీతి మాయ హుషారు’ సినిమా నిర్మాత వీరేష్ తన కార్యాలయంలో పనిచేసే ఓ యువతికి హీరోయిన్ అవకాశం కల్పిస్తానని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ప్రముఖ నిర్మాతలు కూడా తనకు పరిచయమని, తనకు సహకరిస్తే హీరోయిన్ అవకాశం కల్పిస్తానని నిత్యం వేధించేవాడు. దీంతో బాధితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న వీరేష్ ఇంటికి వచ్చి అతన్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బలభద్రాపురంలో దారుణం..
- కొడుకు చేతిలో తండ్రి హత్య బిక్కవోలు(తూర్పుగోదావరి జిల్లా) బిక్కవోలు మండలం బలభద్రాపురంలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన తండ్రినే కాటికి పంపాడో తనయుడు. గ్రామానికి చెందిన కనికెళ్ల వీరేశ్ అనే వ్యక్తి తన తండ్రి కనికెళ్ల చిన చిత్తోడు(60)ను వేటకొడవలితో నరికి చంపాడు. కుటుంబకలహాలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం వీరేశ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీచర్ ను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టేశాడు
రాయచూరు రూరల్ : ఏడు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న పాపానికి ప్రేమకు అధ్యాపకురాలు బలైంది. జిల్లాలోని మాన్వి తాలూకా సిరవారలోని బయలు ప్రదేశంలో ప్రేమికుడు ప్రియురాలిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. 7 సంవత్సరాలు గాఢంగా ప్రేమించిన ప్రేమికుడు వీరేశ అధ్యాపకురాలు ఫర్జాన్‌ను హత్య చేశాడు. గత నెల 21న సిరవారలోని బయలు ప్రదేశంలో ప్లాస్టిక్ సంచిలో శవాన్ని గుర్తించారు. అధ్యాపకురాలు ఫర్జాన్ ఎంఎస్సీ బీఈడీ చదివి లింగసూగూరులోని అంబేడ్కర్ కళాశాలలో విధులు నిర్వహిస్తుండేది. ఏడాది క్రితం జావేద్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న వీరేశ 7 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న ఫలితం లేకపోయిందని, తనకు దక్కని అధ్యాపకురాలు ఫర్జాన్ మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టి పారవేశాడు. వీరేశ్ తెలంగాణలోని గద్వాల వద్ద తన మొత్తం దుస్తులు సాక్ష్యం లేకుండా చేసి సోలాపూర్‌కు బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న సిరవార ఎస్ఐ సణ్ణమని ఆధ్వర్యంలో హంతకుడు వీరేష్‌ను అరెస్ట్ చేశారు. -
టీడీపీ నేతల దాడిపై గళమెత్తిన జర్నలిస్టులు
అనంతపురం జిల్లావ్యాప్తంగా పాత్రికేయుల ర్యాలీలు ఠ వివిధ పార్టీలు, సంఘాల మద్దతు సాక్షి, అనంతపురం: అనంతపురంలో శనివారం సాక్షి ఫొటోగ్రాఫర్ వీరేష్, విలేకరి రమణారెడ్డిలపై టీడీపీ నేతల దాడికి నిరసనగా జర్నలిస్టులు గళమెత్తారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు నిరసన ప్రదర్శనలు చేశారు. వీరికి వివిధ పార్టీలు, సంఘాలు మద్దతు పలికాయి. అనంతపురంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. వైఎస్సార్‌టీఎఫ్, కాంగ్రెస్, సీపీఎం, అనంత అభివృద్ధి సాధన కమిటీ, వైఎస్సార్‌ఎస్‌యూ వీరికి మద్దతు తెలిపాయి. జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు, హిందూపురం, పెనుకొండలలో కూడా పాత్రికేయులు ర్యాలీలు చేశారు. ‘సాక్షి’ సిబ్బందిపై దాడి కేసులో అరెస్టులు అనంతపురం క్రైం: అనంతపురంలో శనివారం ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, విలేకరిపై దాడి చేసిన ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మందిని అనంతపురం రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముంటిమడుగు కేశవరెడ్డి, చితంబరి, వెంకటేశు, అమర్నాథ్రెడ్డి, చిత్రచేడు గోపాల్, నాగరాజు, రామచంద్రారెడ్డి, గోగుల వన్నూరప్ప, ఉప్పర వెంకటరాముడు, శ్రీనివాసులును సీఐ శుభకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరి పాత్రపై విచారిస్తున్నామని సీఐ తెలి పారు. అనంతరం వీరందరినీ స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఏపీ సీఎం ఆంక్షలపై జవదేకర్‌కు ఎన్‌యూజే ఫిర్యాదు సాక్షి, నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌పై ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంట్లో అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్‌తో పాటు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానళ్ల ప్రతిని ధులను అనుమతించక పోవడంపై నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌యూజే- ఇండియా) కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఫిర్యాదు చేసింది. తక్షణమే జోక్యం చేసుకొని, ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉప్పాల లక్ష్మణ్, ప్రసన్న మహంతి కేంద్ర మంత్రిని కోరారు. ఆంక్షలు ఎత్తివేయకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్రజాస్వామిక చర్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
ఇక అమ్మాయిలు ‘జ్ఞానజ్యోతులు’!
పింప్రి, న్యూస్‌లైన్: బాలికల్లో నిరక్షరాస్యత నిర్మూలనకు, వారిని బడిబాట పట్టించడం ప్రధాన లక్ష్యంగా పుణే విభాగ విద్యాబోర్డు ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే బాలికల శిక్షణా పథకం’ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేసింది. ఈ నెల 26 వరకు విభాగ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులోభాగంగా దేహూరోడ్డులోని మహాత్మా గాంధీ కంటోన్మెంట్ తెలుగు పాఠశాల ఆవరణలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రంగులరాట్నం, ఊయల, ఫన్‌ఫెయిర్, గ్యాస్ బెలూన్, మ్యూజికల్ చైర్, మ్యాజిక్ షో, క్యారమ్స్, బాలికలకు గోరింటాకు, బాలురకు టాటూస్లను వేసి పథకంపై అవగాహన కల్పించారు. ఆటపాటల్లో గెలిచిన బాలబాలికలకు బహుమతులను కూడా అందజేశారు. జిల్లాలో ఒక్క బాలిక కూడా నిరక్ష్యరాలుగా ఉండడానికి వీల్లేదని, బాలికలకు ప్రాథమిక, ఉన్నత విద్యతోపాటు సమాజంలో సమానత్వం, ఆర్థిక ఎదుగుదల కలిగించే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకంద్వారా జన జాగృతి కల్పిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేశ్ తెలిపారు. పట్టణంలోని వందలాది మంది పిల్లలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరవ్వడంతో పాఠశాల ఆవరణలో జాతర వాతావరణం నెలకొందన్నారు. పాఠశాలకు వచ్చిన పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారం, స్వీట్లు, పంచిపెట్టినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా విద్యాబోధన చేయించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు కమిటీ సభ్యులు బసన్న, వెంకటేష్ కోలి, శివప్రసాద్, రామాంజనేయులు, లక్ష్మీదేవి, మల్లన్న, సుధీర్ తదితరులు హాజరయ్యారు.