నిర్మాతకు దేహశుద్ధి..అరెస్ట్‌ | movie producer Veeresh arrested | Sakshi
Sakshi News home page

నిర్మాతకు దేహశుద్ధి..అరెస్ట్‌

Mar 13 2017 10:02 AM | Updated on Aug 21 2018 6:12 PM

నిర్మాతకు దేహశుద్ధి..అరెస్ట్‌ - Sakshi

నిర్మాతకు దేహశుద్ధి..అరెస్ట్‌

హీరోయిన్‌ అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్న ఓ నిర్మాతకు బాధితురాలి బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

బెంగళూరు(బొమ్మనహళ్లి) :
హీరోయిన్‌ అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్న ఓ నిర్మాతకు బాధితురాలి బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది. వివరాలు..‘ప్రీతి మాయ హుషారు’ సినిమా నిర్మాత వీరేష్‌ తన కార్యాలయంలో పనిచేసే ఓ యువతికి హీరోయిన్‌ అవకాశం కల్పిస్తానని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

ప్రముఖ నిర్మాతలు కూడా తనకు పరిచయమని, తనకు సహకరిస్తే హీరోయిన్‌ అవకాశం కల్పిస్తానని నిత్యం వేధించేవాడు. దీంతో బాధితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఉన్న వీరేష్‌ ఇంటికి వచ్చి అతన్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement