vegetable rates hike
-
ధరల మీద మన్నుబొయ్య..ఏలెటోడ్ని కూలదొయ్య!
ఉల్లి దర కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. పచ్చిమిర్చి రుచి చూడకుండానే ఘాటెక్కిస్తోంది. కాకర కొరకకుండానే చేదిక్కిస్తోంది.. ములక్కాడ కొండెక్కింది..టమోటా దడపుట్టిస్తోంది. ప్రస్తుతం కూరగాయల ధరల ధాటికి పేద, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.అన్ని ప్రాంతాల్లోనూ ధరల దరవు మోగుతోంది. కందుకూరు రూరల్: కందుకూరు మార్కెట్లో కూరగాయల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. రోజురోజుకూ ధరలు పెరుడుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ప్రాంతానికి మైదుకూరు, కోడూరు, మద్రాసు, బెంగళూరు, మంగళగిరి తదితర చోట్ల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. నెల క్రితం ఏ కూరగాయల ధరలైన కిలో రూ.25లకు మించి ఉండేది కాదు. ఇప్పుడు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రూ.15 నుంచి రూ.20ల వరకు ఉన్న ఉల్లి ధర రూ.35లకు పెరిగిపోయింది. రూ.20లు ఉన్న టమోట ఒకేసారి రూ.38లకు పెరిగింది. ఆయా పంటలు పండే ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతుండటంతో ధరలు కొండెక్కాయని వ్యాపారులు చెప్తున్నారు. సంచి నిండటం లేదు వేసవిలో పరిస్థితి వర్షాకాలంలో కనిపిస్తోందని వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధరలు చూసినా రూ.30 నుంచి రూ.40లకు పైగా ఉండటంతో రోజు గడిచేదెలా..అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.200 తీసుకెళ్తే చిన్న సంచి కూడా నిండం లేదని వాపోతున్నారు. టమోటా, పచ్చి మిర్చి ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అన్ని రకాల కూరగాయలు సంగతి ఇలా ఉంటే ములక్కాయ తానేం తక్కువ తినలేదన్నట్లు కాయ 10 నుంచి 15 పలుకుతోంది. కష్ట కాలంలో బంగాళాదుంప, దొసకాయలు ఆదుకుంటున్నాయని కొంతమేర ఊరట చెందుతున్నారు. ఇక ఆకు కూరలైతే కట్ట 5 నుంచి 10 వరకు చేరింది. ఇక బండ్లు, వీధిల్లోని దుకాణాల్లో ధరలైతే వారి చెప్పిందే ధరగా చలామణి అవుతోంది. ఇలాగే వర్షాలు కురుస్తుంటే మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. రైతు బజారు వ్యాపారులు చేతివాటం రైతు బజారులోని వ్యాపారులు అధికారులు నిర్ణయించిన ధరలకే కూరగాయలు విక్రయించాల్సి ఉంది. కానీ ఇక్కడ వ్యాపారులు ఎదురుగా బోర్డుపై ధరలు పట్టిక వేసి ఉన్నా వినియోగదారుల కళ్లు కప్పి అధిక ధరలు విక్రయిస్తున్నారు. టమోటా 38 ఉంటే 40 నుంచి 45 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుడిని బట్టి వ్యాపారి తన చేతి వాటం చూపిస్తున్నాడు. బోర్డుపై ప్రకటించిన ధరలకు మించి విక్రయించకూడదని చెప్పిన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ధరలు మండిస్తున్నారు. అసలే ధరలు పెరిగి ప్రజలు ఆందోళన చెందుతుంటే రైతు బజారు వ్యాపారుల ధాటికి మరింత ధరలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
బతుకులపై కూర‘గాయాలు’
కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యుడి జీవితాలపై ‘ధరా’ఘాతంగా మారాయి. ఈ క్రమంలో నిరుపేదలు వాటిని కొనుగోలు చేయాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. శనివారం పాతూరు మార్కెట్ వద్ద కొందరు ఇదిగో ఇలా కుళ్లిపోయి.. పాడైన కూరగాయలను సంచుల్లో తీసుకెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
‘భోజనం’ భారం
- మండుతున్న ధరలతో ఏజెన్సీల నిర్వాహకుల బెంబేలు ధర్మవరం : నలుగురున్న కుటుంబం కూడా కూరగాయలు కొనాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూరలు వండి పెట్టడం మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారుతోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా మొదలైంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశిస్తున్నారు. అయితే మార్కెట్లో ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ.30 నుంచి రూ.50కి తక్కువ కాకుండా ఉన్నాయి. మిర్చి కిలో రూ.70 పలుకుతోంది. సరుకుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతంత ధరలు పెట్టి కొని సగటున 50 నుంచి 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలంటే ఏజెన్సీల నిర్వాహకులకు భారమవుతోంది. అదే ఉన్నత పాఠశాలల్లో అయితే ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. అక్కడ కనీసం 500 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెంచిన ధరలు(1 - 5 వ తరగతి వరకు రూ.6.30 పైసలు, 6 - 10వ తరగతి వరకు రూ.8.13 పైసలు) సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. రూ.లక్షల్లో గతేడాది బకాయిలు గత ఏడాది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించిన వేతనాలు, బిల్లులు ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలేదు. 2017 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులు, వేతనాలు చెల్లించాల్సి ఉంది. సగటున వందమంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.15 వేల దాకా బిల్లులు అందాల్సి ఉంది. మూడు నెలలకు కలిపి రూ.45 వేలు చొప్పున రావాలి. అవి అందకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు భోజనం పెట్టేందుకు డబ్బులు వడ్డీలకు తెస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,043 ప్రాథమిక, 1,003 ప్రాథమికోన్నత, 988 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 5,034 పాఠశాలల్లో 5,61,495 విద్యార్థులు చదువుతున్నారు. 5034 ఏజెన్సీల æద్వారా మొత్తం విద్యార్థులకు రోజూ అన్నం పెడుతున్నారు. ఇందుకుగానూ ఆయా ఏజెన్సీలకు నెలకు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గత ఏడాది బిల్లులే రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకం మెనూ సోమ, గురువారం : అన్నం +కూరగాయలతో కూడిన సాంబారు మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+రసం బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు దీంతోపాటు వారానికి మూడురోజులు(రేట్లు పెంచిన తర్వాత పెంచారు) కోడిగుడ్డు ఇవ్వాలి