Vegetable zone
-
భవిష్యత్ బంగారమే
గజ్వేల్: ఆరుగాలం కష్టపడే కూరగాయల రైతులకు ఇక మంచిరోజులు రాబోతున్నాయి. జిల్లాను ‘వెజిటబుల్ జోన్’గా మార్చాలని ప్రభుత్వం మూడేళ్ల కిందట నిర్ణయించినా, అమలులో నిర్లక్ష్యం అలుముకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. నాబార్డ్ అధ్వర్యంలో చేపట్టనున్న ఈ పథకానికి ఈనెల 11న జరిగిన జిల్లా కన్సల్టెంట్ కమిటీ (డీసీసీ) సమావేశంలో కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణలోనే పెలైట్ ప్రాజెక్ట్‌గా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు సుమారు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నారు. కార్పొరేట్ కంపెనీల రాకతో పెరిగిన సాగు ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్తే కనీసం రవాణా చార్జీలు సైతం గిట్టుబాటుకాని దుస్థితి. దీంతో కూరగాయల సాగు తగ్గింది. అయితేఆరేళ్లలో పరిస్థితులు కాస్త మారాయి. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకుని ఇక్కడ రిలయన్స్ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో కూరగాయల సాగు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 15ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సొరకాయ, దొండతోపాటు సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలను జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. విన్నవించినా.. పట్టించుకోలేదు గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటం ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. అందువల్లే మూడేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ వెజిటబుల్ జోన్‌గా మార్చి మరింత చేయూతనివ్వాలని, దీని ద్వారా కూరగాయల సాగు అభివృద్ధి చెందుతుందని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డితో పాటు మరో నాలుగు మండలాలను వెజిటబుల్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. కొత్తసర్కార్..సరికొత్త పథకం కూరగాయల రైతుల ఇబ్బందులపై దృష్టిసారించిన టీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘నాబార్డ్’ అధ్వర్యంలో ఈ పథకానికి రూప కల్పన చేస్తోంది. ఈ నెల 11న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ కమిటీ(డీసీసీ) సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు. తొలిదశలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. నియోజకవర్గంలోని సుమారు నాలుగు గ్రామాల్లో ప్రప్రథమంగా 200 మంది వరకు కూరగాయల రైతులను ఎంపిక చేసి వారికి ‘పందిరి’ విధానంలో కూరగాయల సాగుకు ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షల బ్యాంకు రుణం అందిస్తారు. సుమారు 50 శాతం వరకు సబ్సీడీ రైతుకు వర్తించేలా చేస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం కల్పించనున్నారు. గజ్వేల్‌లో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన తర్వాత జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు వర్తింపజేయనున్నారు. -
నిధుల కొరత.. సబ్సిడీకి కోత
చేవెళ్ల: జిల్లాను కూరగాయల జోన్‌గా ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. అరకొర నిధులను విడుదల చేస్తూ కూరగాయల రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యాన పంటల సాగుకు జిల్లాలోని భూములు అనువైనవని పేర్కొంటున్న సర్కారు.. కూరగాయల సబ్సిడీ విత్తనాలకు నిధులు విదల్చడంలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సబ్సిడీ కూరగాయల విత్తనాలకు తక్కువ నిధులు కేటాయించింది. దీంతో దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేస్తున్నామంటూ ఉద్యాన శాఖ కార్యాలయం ఎదుట అధికారులు నోటీసు పెట్టారు. దీంతో రైతులు దరఖాస్తులు ఇవ్వడానికి గురువారం ఎగబడ్డారు. గత ఏడాది రూ.30 లక్షలు.. ఈసారి రూ.10 లక్షలే చేవెళ్ల డివిజన్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను పండిస్తారు. రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ఖరీఫ్, రబీలో సీజన్లలో కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల ఉద్యానశాఖ సబ్‌డివిజన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో కూరగాయ విత్తనాల సబ్సిడీకి ప్రభుత్వం 2014-15 ఖరీఫ్ సీజన్‌కు రూ.10 లక్షలు కేటాయించింది. ఉద్యాన శాఖ అధికారులు రైతుల నుంచి 50 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇంకా దరఖాస్తులను ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సబ్సిడీ కూరగాయల విత్తనాల సరఫరాకు కేటాయించిన బడ్జెట్ అయిపోయిందని, మరో 5 లక్షల రూపాయల విలువచేసే విత్తనాలకు అధికంగా దరఖాస్తులు అందాయంటూ శుక్రవారం నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద నోటీసు అంటించారు. దరఖాస్తు చేయడానికి గురువారం ఒక్కరోజే గడువు ఉండడంతో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీ సంఖ్యలో వచ్చారు. కూరగాయ రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా అందుకు అవసరమైన నిధులను కేటాయించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు రూ.30 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఈసారి మాత్రం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇవ్వడం సరికాదని విమర్శిస్తున్నారు. -
ఏదీ చేయూత?
గజ్వేల్, న్యూస్‌లైన్: సాగునీరు అంతంతమాత్రంగానే ఉన్న మెతుకుసీమలో రైతులంతా ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. సూక్ష్మసేద్యానికి చేయూతనిస్తామని బీరాలు పలుకుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన జిల్లాలో రైతులకు సరైన పోత్సాహం లభించడం లేదు. మెతుకుసీమను ‘వెజిటబుల్ జోన్’గా మార్చాలని రెండున్నరేళ్ల కిందట సర్కార్ నిర్ణయించినా, అమలుకు మాత్రం నోచుకోలేదు. రైతులకు విస్తృత ప్రయోజనం చేకూర్చేందుకు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసినా వాటికీ మోక్షం కలగలేదు. మరోవైపు కూరగాయల రైతులకు సూక్ష్మనీటి సేద్యపు పథకం వర్తింపు కూడా అందని ద్రాక్షగా మారింది. కలగానే ‘వెజిటబుల్ జోన్’ ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకేవారు. జిల్లా అంతటా దాదాపు ఇదే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్తే కనీసం రవాణా ఛార్జీలు సైతం గిట్టుబాటు కాని దుస్థితి ఉండేది. అన్ని చోట్లా దళారులు తిష్ట వేసి కారుచౌకగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి నిలువునా దోపిడీ చేసేవారు. ఫలితంగా కూరగాయల సాగు అతి తక్కువ విస్తీర్ణంలోనే ఉండేది. అయితే గత ఆరేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. కూరగాయల సాగు వాణిజ్య పంటలకు ధీటుగా సాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 15 ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సొరకాయ, దొండ పంటలు సాగవుతుండగా, సాధారణ విధానాల్లో టమాట, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలను జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినన్ని కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకున్న రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడ కొన్న కూరగాయలను హైదరాబాద్ నగరానికే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకు కూడా పంపుతున్నారు. దీంతో కూరగాయల సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ జిల్లాను ‘వెజిటబుల్ జోన్’గా మార్చి చేయూతనివ్వాలని వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డితో పాటు మరో నాలుగు మండలాలను వెజిటబుల్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఆరు కలెక్షన్ సెంటర్లలో రెండింటికే మోక్షం వెజిటబుల్ జోన్ ప్రతిపాదనలో భాగంగా రైతుల ఉత్పత్తులను గిట్టుబాటు ధర అందించి సేకరించడానికి తొలి దశలో జిల్లాలో 6 వెజిటబుల్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కేంద్రాన్ని రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు జిన్నారం మండలం గుమ్మడిదల, ములుగు మండలం వంటిమామిడిలో మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మరో నాలుగు చోట్ల కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉంది. డిప్యూటీ సీఎం ప్యాకేజీపై సన్నగిల్లిన ఆశలు కూరగాయల రైతులకు విస్తృత ప్రయోజనం కలిగించడానికి రూ.40 కోట్లు మంజూరు చేయాలని రెండున్నరేళ్ల కిందట డిప్యూటీ సీఎం వద్దకు మరో ప్రతిపాదన వెళ్లింది. ఈ ప్రతిపాదనలకు కూడా మోక్షం లభిస్తే భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశముండేది. కూరగాయల సాగుచేసే రైతులను 50 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పరంగా 50 శాతం సబ్సిడీపై విత్తనాలు, 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, ఎస్సీ, ఎస్టీలకైతే 100 శాతం, 50 శాతం సబ్సిడీపై ఎరువులు, పురుగు మందుల పంపిణీ, తరుచూ శిక్షణా తరగతులు వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించే అవకాశం కలిగేది. కానీ ఈ ప్యాకేజీ వ్యవహారంపై చడీచప్పుడు లేకుండా తయారు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదిన్నర సంది తిరుగుతున్న నాకున్న ఎకరంన్నర భూమిలో కూరగాయల పండిస్తున్న. బోరు ఉన్నప్పటికీ అది నీరు తక్కువగా పోస్తుంది. అందువల్లే డ్రిప్ పెట్టుకుని కూరగాయలు పండిద్దామనుకున్న. ఏడాదిన్నర సంది డ్రిప్ కావాలని ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరాగిరేలా తిరుగుతుండ. ఎవరూ పట్టించుకుంటలేరు. ఈసారి అద్దెకరా భూమిలో రూ.9 వేలు పెట్టుబడి పెట్టి బీర్నీస్ సాగు చేసిన. నీళ్లు సరిపోక దిగుబడి పడిపోయింది. చేతికందిన కొద్దిపాటి బీర్నీస్ను మార్కెట్‌కు తీసుకెళ్తే కిలోకు రూ.10 ధర లెక్కగట్టారు. దీంతో ఇప్పటివరకు పంటమీద రూ.4 వేలు వచ్చింది. చేలో ఉన్న బీర్నీస్కు మరో రూ.1,000 వచ్చే అవకాశముంది.