vehical
-
వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే..
స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్ట్ 15న చాలా మంది తమ వాహనాలపై త్రివర్ణ పతాకం పెట్టుకోవడాన్ని చూసేవుంటాం. అయితే ఇది చట్టవిరుద్ధం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని వివరాల ప్రకారం కొందరు ప్రముఖులకు మాత్రమే తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్న ఉంచే హక్కు ఉంది. వీరుకాకుండా మరెవరైనా తమ కారుపై త్రివర్ణ పతాకాన్ని తగిలించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఇంతకీ తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అర్హత కలిగినవారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002లోని సెక్షన్ IX ప్రకారం కొందరు ప్రముఖులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించే హక్కును కలిగి ఉంటారు. ఈ జాబితాలోని వారు వరుసగా.. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ విదేశాల్లోని భారతీయ మిషన్లు/ప్రతినిధులు, వారు నియమితులైన దేశాల్లో.. ప్రధాన మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప మంత్రులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప మంత్రులు స్పీకర్, లోక్‌సభ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ రాష్ట్రాలలోని శాసన మండలి స్పీకర్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల స్పీకర్లు రాష్ట్రాలలోని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్లు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుల న్యాయమూర్తులు ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
బండి బదిలీ.. భలే బురిడీ
సాక్షి, హైదరాబాద్: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా కొందరు ఆర్టీఏ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొందరు వాహనదారులు ఎన్ఓసీ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై ఎన్ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది. కొంతమంది వాహనదారులు ఎన్ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడే కొందరు ఆర్టీఏ సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్ఓసీ తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. (చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’) -
అనంతగిరిలో కారు బీభత్సం
-
కారు బీభత్సం, ఎస్ఐకి తీవ్ర గాయాలు
సాక్షి, వికారాబాద్ : అనంతగిరిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్ఐపైకి కారు దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎస్ఐ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నూతన సంవత్సర వేడుక బందోబస్త్ లో యాక్సిడెంట్ కు గురి అయిన వికారాబాద్ S.I. శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని వేడుకొంటున్నాను. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా మొక్కవోని ధైర్యం విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను pic.twitter.com/qTTjk58R1V — DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 2, 2020 -
లైట్ తీస్కో.. బాబూ లైట్ తీస్కో!
పై ఫోటోలో ఉన్న సీన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం చాలాసార్లు చూసుంటాం.. లగేజీ స్కానర్ అక్కడే ఉంటుంది.. మనం మాత్రం లగేజీ స్కాన్ చేయించుకోకుండానే వెళ్లిపోతుంటాం. ఈ ఫొటోలోని వాళ్లలాగే.. అక్కడ ఉండే పోలీసులు కూడా స్కాన్ చేయించుకోవాలని ప్రయాణికులకు చెప్పరు..వాళ్ల ఫోన్లలో వారు బిజీ.. అండర్ వెహికిల్ స్కానర్.. మీకు తెలుసా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇది కూడా ఉంది.. పార్కింగ్‌కు వచ్చే వాహనాలు అండర్ వెహికిల్ స్కానర్ల మీదుగా వచ్చే ఏర్పాటు చేశారు. కానీ స్కానర్లను పర్యవేక్షించేందుకు సిబ్బంది.. ఏర్పాటు చేయనే లేదు.. స్కానర్లు పనిచేస్తున్నా, వాహనాల దిగువన అనుమానిత వస్తువులు ఉన్నాయా లేదా అని పట్టించుకునేవాడే లేడు.. ఇంతేనా.. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లతో సిబ్బంది.. ఇలా చాలా ఉన్నాయి.. రోజూ 1.60 లక్షల మంది ప్రయాణికులు వచ్చే సికింద్రాబాద్ స్టేషన్లో కనిపిస్తున్న భద్రత ఏర్పాట్లివీ.. అన్నీ ఆన్‌లోనే ఉంటాయి.. కానీ ఇవన్నీ చూడ్డానికే.. వాడ్డానికి కానట్లు తయారయ్యాయి. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో, ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా టెర్రర్ అటాక్ అలర్ట్‌ను కేంద్రం ప్రకటించింది.. అటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద హై అలర్టు అమలులో ఉంది. ఇలాంటి కీలక తరుణంలో భద్రత విషయంలో రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించటం విశేషం. సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశించేందుకు మొత్తం ఆరు మార్గాలున్నాయి. కానీ 2 మార్గాల్లో మాత్రమే లగేజీ స్కానర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆ రెండు మార్గాల్లోనే లోనికి వెళ్లేలా చేస్తే రద్దీ ఏర్పడి కీలక వేళల్లో తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో మరో రెండు చోట్ల లగేజీ స్కానర్లు ఏర్పాటు చేసి మిగతా మార్గాలను మూసేయాల్సి ఉంది. . కానీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. -
రంగు మారిన కేసీఆర్ కాన్వాయ్
-
రంగు మారిన కేసీఆర్ కాన్వాయ్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది. ప్రస్తుతం ఉన్ననలుపురంగు కాన్వాయ్....తెలుపు రంగులోకి మారింది. మూడు వాహనాలను అధికారులు శుక్రవారం సీఎం కాన్వాయ్‌లోకి తెచ్చారు. భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణిని సాధారణంగా నలుపు రంగులోనే వినియోగిస్తుంటారు. అయితే నలుపు రంగు వాహనాలు తనకు అచ్చిరావడం లేదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. దాంతో కాన్వాయ్‌ని తెలుపు రంగులోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న మూడు బ్లాక్ ఫార్చున్ కార్ల రంగును మార్చారు. కాగా తెలంగాణ రాష్ట్రం శాంతిగా ఉండాలని కేసీఆర్ నిర్ణయంతో పోలీసుల వాహనాలను కూడా తెలుపు రంగులోకి మార్చారు.