హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది. ప్రస్తుతం ఉన్ననలుపురంగు కాన్వాయ్....తెలుపు రంగులోకి మారింది. మూడు వాహనాలను అధికారులు శుక్రవారం సీఎం కాన్వాయ్లోకి తెచ్చారు. భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణిని సాధారణంగా నలుపు రంగులోనే వినియోగిస్తుంటారు.
అయితే నలుపు రంగు వాహనాలు తనకు అచ్చిరావడం లేదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. దాంతో కాన్వాయ్‌ని తెలుపు రంగులోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న మూడు బ్లాక్ ఫార్చున్ కార్ల రంగును మార్చారు. కాగా తెలంగాణ రాష్ట్రం శాంతిగా ఉండాలని కేసీఆర్ నిర్ణయంతో పోలీసుల వాహనాలను కూడా తెలుపు రంగులోకి మార్చారు.