
తెలుపే కావాలి:కేసీఆర్
* కాన్వాయ్ రంగుపై కేసీఆర్ సూచన
* నలుపు అచ్చిరావడం లేదని భావిస్తున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నలుపురంగు కాన్వాయ్(వాహన శ్రేణి)ని వినియోగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దాన్ని తెలుపు రంగులోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత కాన్వాయ్‌లో టీఎస్ శ్రేణిలో 6666 నెంబరుతో నలుపు రంగు ఫార్చ్యునర్ కార్లు ఉన్నాయి. భద్రతా కారణాలరీత్యా వీవీఐపీల వాహన శ్రేణిని సాధారణంగా నలుపు రంగులోనే వినియోగిస్తుం టారు.
అయితే నలుపు రంగు వాహనాలు అచ్చిరావడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. కాన్వాయ్‌ని తెలుపు రంగులోకి మార్చాలని అభిలషిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు సూచించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే సీఎం కాన్వాయ్‌లోని వాహనాల రంగును మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్లకే రంగు మార్చుతారా లేక కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారా అన్నది తేల్చాల్సి ఉంది.