Vehicle safety
-
టైరే కదా అని నిర్లక్ష్యం వద్దు.. పేలుతుంది.. జాగ్రత్త..!
వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు పైనుంచి ఎండ.. మరోవైపు రోడ్డు వేడి.. బైకో, కారో తీసుకొని రోడ్డుపైకి వెళ్తే టైర్లు ఉన్నట్టుంది పేలిపోయే ప్రమాదం ఈ సమయంలో అధికంగా ఉంటుంది. పాత టైర్లకైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. ప్రతి వేసవిలోనూ టైర్లు పేలి రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్తలు చూస్తూనే ఉంటాం. అందుకే ఈ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాలకు ముందు వాహన టైర్ల పటుత్వం కచ్చితంగా తెలుసుకోవాలి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు టైర్ల లోపల గాలిపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో టైర్లు వేడెక్కి సమస్యలు సృష్టిస్తుంటాయి. వేసవిలోనే ఎందుకంటే.. టైర్ల వయస్సు: అరిగిపోయిన పాత టైర్లు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. అవి పగిలిపోయే అవకాశం అధికం. టైర్ ప్రెజర్: టైర్ పగిలిపోవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ఒత్తిడి. తక్కువగా గాలి ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తుంటే టైర్ పైకి కిందికి బౌన్స్ అవుతుంది. దీంతో అదనపు ఘర్షణ ఏర్పడుతుంది. వేసవి వేడితో ఈ అదనపు ఘర్షణ తోడవడం వల్ల టైర్లు బలహీనపపడి పగిలిపోతాయి. ఈ సమస్య వేసవిలో మరీ ఎక్కువ. అధిక వేగం: టైర్లు పగిలిపోవడానికి మరొక సాధారణ కారణం అధిక వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించటం. దీనివల్ల వేడి జనించి టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనం బరువు, రోడ్డు ఉపరితలం నుంచి వచ్చే వేడితో టైర్లు అధిక ఒత్తిడికి గురై పగిలిపోవచ్చు. లోపభూయిష్ట టైర్లు: టైర్లు అరిగిపోయాయా, దెబ్బతిన్నాయా? అని నిర్ధారించుకోవాలి. ఎల్లప్పుడూ వాటి నాణ్యతను తనిఖీ చేయాలి. కోతలు, పగుళ్లు, ఉబ్బెత్తులు లేదా దెబ్బతిన్న టైర్లు వేసవిలో అధిక ఒత్తిడి కారణంగా పగిలిపోతాయి. వాహన బరువు: వాహనం బరువు ఎక్కువ లేకుండా జాగ్రత్తపడాలి. తద్వారా వేసవిలో టైర్లపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. టైర్ పగిలిపోతే: ప్రశాంతంగా ఉండాలి. వాహనంపై నియంత్రణతో ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడకూడదు. భయాందోళనకు గురైతే వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చు. భారీ బ్రేకింగ్‌ను నివారించాలి: హఠాత్తుగా బ్రేక్ వేయాలనుకున్నప్పటికీ పేలిన టైర్‌పై ఎక్కువగా బ్రేక్ వేస్తే వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చు. మంచు మీద డ్రైవింగ్ చేస్తున్నట్టు ఊహించుకొని సున్నితంగా బ్రేక్స్ వాడాలి. ముందు వైపున్న టైర్లు పగిలిపోతే బ్రేక్ అస్సలు ఉపయోగించవద్దు. వెళ్లాల్సిన దిశలో వాహనాన్ని నెమ్మదిగా నడిపించాలి. ట్రాఫిక్‌లో ఉన్నా, ఇతర వాహనదారులు చుట్టూ ఉన్నా సమస్య ఉందని వారికి తెలిసేలా హజార్డ్ లైట్లను ఆన్ చేయాలి. ఇదీ చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!యాక్సిలరేటర్‌ని ఉపయోగించాలి: బ్రేక్స్‌కు బదులు యాక్సిలరేటర్‌ను ఉప యోగించాలి. స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవాలి. తద్వారా వాహనాన్ని సరళ రేఖలో నడిపించగలుగుతారు. సురక్షిత ప్రదేశంలో: వాహనాన్ని సురక్షిత ప్రదేశం వైపు తీసుకెళ్లి ఆపాలి. హజార్డ్ లైట్లను ఉంచడం మర్చిపోవద్దు. రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్ పరికరాలు ఉన్నట్టయితే వాహనం ముందు, వెనుక వైపు ఉంచాలి. చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు : ఎవరీ నటుడుతప్పనిసరి జాగ్రత్తలు: అరిగిన, కాలం చెల్లిన టైర్లను తక్షణమే మార్చుకోవాలి. టైర్లు పరీక్షించి ఎక్కడ లోపం ఉన్నా సరిదిద్దుకోవాలి. -సాక్షి, నేషనల్ డెస్క్ -
‘5 స్టార్ రేటింగ్ కావాలి.. రేటు ఎక్కువైనా పర్లేదు’
హైదరాబాద్,బిజినెస్ బ్యూరో: సురక్షితమైన వాహనం అయితే చాలు. ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయడానికి వినియోగదార్లు ఇష్టపడుతున్నారని మొబిలిటీ ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల మంది కార్లు, ద్విచక్ర వాహన యజమానులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ సర్వే వివరాలను వెల్లడిస్తూ.. ‘సెక్యూరిటీ ఫీచర్లను జోడించేందుకు రూ.30 వేలకుపైగా ఖర్చుకు సిద్ధంగా ఉన్నట్టు మూడింట ఒకవంతు మంది తెలిపారు. భవిష్యత్తులో తాము కొనుగోలు చేసే కారుకు 4 లేదా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండాలని భావిస్తున్నట్టు 75 శాతం మంది వెల్లడించారు. 27 శాతం మందికి భద్రతా రేటింగ్‌ల గురించి తెలియకపోవడం ఆందోళ కలిగించే అంశం. చాలా మందికి వాహన భద్రతా ఫీచర్ల గురించి పరిచయం ఉన్నందున.. భద్రతా ఫీచర్లను తప్పనిసరి చేయడం వల్ల ఈ విభాగంలో అవగాహనపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్, రోల్ ఓవర్ మిటిగేషన్ వంటి ఫీచర్ల గురించి వినియోగదార్లలో అవగాహన ఉంది. సేఫ్టీ రేటింగ్‌లతో సంబంధం లేకుండా పాత వాహనాల కంటే కొత్త వెహికిల్స్ సురక్షితమైనవని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు’ అని ఔట్లుక్ వివరించింది. -
స్మార్ట్ కార్డు పథకాన్ని నిలిపేసిన రవాణాశాఖ
- ముగిసిన పాత కాంట్రాక్ట్ గడువు - అయినప్పటికీ టెండర్లు పిలవని ప్రభుత్వం - విధిలేక సీబుక్‌ల జారీ సాక్షి, వాహనాల భద్రత కోసం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు పథకాన్ని రవాణా శాఖ నిలిపివేసింది. పాత కాంట్రాక్ట్ గడువు పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించ లేదు. గతంలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని పుస్తకం రూపంలో జారీ చేసింది. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఓ ద్వారా జారీఅయ్యే పత్రాలు మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వాటి స్థానంలో స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించి అర్హతగల కంపెనీకి 2006లో కాంట్రాక్టునిచ్చింది. దీని గడువు జూన్‌లోనే ముగిసినప్పటికీ నవంబరు వరకు పొడిగించింది. అయితే ఆ గడువు కూడా పూర్తి కావడంతో డిసెంబరు నుంచి నగరంలో ఉన్న మూడు ఆర్టీఓల నుంచి స్మార్ట్ కార్డులు జారీ కావడం లేదు. పాత పద్ధతి ప్రకారం తాత్కాలికంగా పుస్తకం రూపంలోనే ఇస్తున్నారు. ఇందువల్ల వాహనాలు కనుక చోరీకి గురైతే నకిలీ పత్రాల ద్వారా ఇతరులకు విక్రయించడం ఎంతో తేలికవుతుంది. అదే స్మార్ట్ కార్డు ఉంటే పట్టుబడే ప్రమాదం ఉంటుంది. దీంతో అప్పట్లో ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి గడువు ముగియకముందే కొత్తగా టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంవల్ల ఇంతవరకు ఆ ప్రకియకు శ్రీకారం చుట్టలేదు. దీంతో చేసేది లేక ఆర్టీఓ సిబ్బంది వాహన యజమానులకు తాత్కాలికంగా సీ బుక్కులను జారీ చేస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ కనుక తిరిగి ప్రారంభమైతే మళ్లీ ఆర్టీఓకి వెళ్లాల్సిందే. వారు అడిగినంత రుసుం మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. అధికారుల అలసత్వంవల్ల రెండు విధాలా నష్టపోవల్సి వస్తోందని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బండికీ ఆధార్ం
ఆర్టీఏ అనుసంధాన ప్రక్రియ పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపిక సోమవారం నుంచి ఇంటింటి సర్వే డ్వాక్రా మహిళలతో నిర్వహణ గుడివాడ : వాహనాల భద్రత, వ్యక్తిగత భద్రత పేరుతో ఆర్టీఏ చేపట్టిన వాహనాలకు ఆధార్ అనుసంధానం పెలైట్ ప్రాజెక్టుగా గుడివాడ ఎంపికయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండుచోట్ల పెలైట్ ప్రాజెక్టులుగా ఎంచుకోగా రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల పట్టణాన్ని, కోస్తా జిల్లాల్లో గుడివాడ పట్టణాన్ని పెలైట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఇందుకోసం సోమవారం నుంచి డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 36 వార్డుల్లో సర్వే.. గుడివాడ పట్టణాన్ని ఆధార్ అనుసంధానానికి పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆర్టీఏ శాఖ ఉన్నతాధికారులు సైతం కదలి వచ్చి యుద్ధప్రాతిపధికన సర్వే పనులపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర జాయింట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కమిషనర్ ప్రసాదరావు స్వయంగా వచ్చి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చారు. గుడివాడ పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో ఈసర్వే చేయాల్సి ఉంది. ప్రతి వార్డుకు ఇద్దరు చొప్పున డ్వాక్రా మహిళలు ఇంటింటి సర్వేచేసి వాహనం నంబరు, వాహనదారుని పేరు, వాహన దారుడి ఆధార్ నంబరు, ఫోన్ నంబరు సేకరించాల్సి ఉంది. అలాగే లెసైన్సు ఉంటే లెసైన్సు దారుడు పేరు లెసైన్సు నంబరు లేదా రిఫరెన్స్ నంబరు, లెసైన్స్ దారుడి ఫోన్ నంబరు వీరు సేకరించాలి. ఒక్కో వాహనదారుడి వివరాలు సేకరించినందుకు రూ.8 చెల్లిస్తుంది. వివరాలను ఏరోజుకు ఆరోజు కంప్యూటరీకరించాల్సి ఉంది. ఇలా ప్రతి అడ్రస్సు కంప్యూటరీకరించినందుకు మరో రూ.3 చెల్లిస్తారు. ఉపయోగం ఏమిటంటే.. ఆధార్ అనుసంధానం చేయడం వల్ల వాహనం నంబరు ఆన్లైన్లో చూడగానే యజమాని పూర్తి వివరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాహనానికి ఆధార్ అనుసంధానం చేస్తే ఆదాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని వాహన యజమానులు అనుమానిస్తున్నారు. దీంతో డ్వాక్రా సభ్యులకు వాహన యజమానులు ఎంతవరకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే.