Outlook Survey: Indian Customers Willing To Pay More To Buy Cars With Safety Features - Sakshi
Sakshi News home page

Outlook Survey: ‘5 స్టార్‌ రేటింగ్‌ కావాలి.. రేటు ఎక్కువైనా పర్లేదు’

Published Wed, Dec 15 2021 8:10 AM | Last Updated on Wed, Dec 15 2021 9:31 AM

Out Look Survey Says Vehicle Owners Are Giving Priority to Safety Features - Sakshi

హైదరాబాద్,బిజినెస్‌ బ్యూరో: సురక్షితమైన వాహనం అయితే చాలు. ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయడానికి వినియోగదార్లు ఇష్టపడుతున్నారని మొబిలిటీ ఔట్‌లుక్‌ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల మంది  కార్లు, ద్విచక్ర వాహన యజమానులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు.

ఈ సర్వే వివరాలను వెల్లడిస్తూ.. ‘సెక్యూరిటీ ఫీచర్లను జోడించేందుకు రూ.30 వేలకుపైగా ఖర్చుకు సిద్ధంగా ఉన్నట్టు మూడింట ఒకవంతు మంది తెలిపారు. భవిష్యత్తులో తాము కొనుగోలు చేసే కారుకు 4 లేదా 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ ఉండాలని భావిస్తున్నట్టు 75 శాతం మంది వెల్లడించారు. 27 శాతం మందికి భద్రతా రేటింగ్‌ల గురించి తెలియకపోవడం ఆందోళ కలిగించే అంశం.

చాలా మందికి వాహన భద్రతా ఫీచర్ల గురించి పరిచయం ఉన్నందున.. భద్రతా ఫీచర్లను తప్పనిసరి చేయడం వల్ల ఈ విభాగంలో అవగాహనపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్, రోల్‌ ఓవర్‌ మిటిగేషన్‌ వంటి ఫీచర్ల గురించి వినియోగదార్లలో అవగాహన ఉంది. సేఫ్టీ రేటింగ్‌లతో సంబంధం లేకుండా పాత వాహనాల కంటే కొత్త వెహికిల్స్‌ సురక్షితమైనవని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు’ అని ఔట్‌లుక్‌ వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement