vehicle thieves
-
బైక్ దొంగల అరెస్ట్... 30బైక్‌లు స్వాధీనం
వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను మీర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఆదిబట్ల, ఉప్పల్, మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరు బైక్‌లను చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
వాహన దొంగల అరెస్ట్
అనంతపురం : వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రూరల్ మండలం కత్తులపల్లి వద్ద సోమవారం రాత్రి నర్సింహులు (26), శ్రీశైలం నాగరాజు (34), గంగాథర్(30)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేసినట్టు మంగళవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 6 వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో ఆటోలు ఉండగా కొట్టేసినట్టు తెలిపారు. -
ముగ్గురు వాహన దొంగలు అరెస్ట్
సరూర్‌నగర్ (రంగారెడ్డి) : నగరంలో గత కొంతకాలంగా వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సరూర్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి ఎనిమిది బైక్‌లు, ఒక మారుతి కారు, నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీర్‌పేటకు చెందిన శివ గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా హయత్‌నగర్‌కు చెందిన కావలి కృష్ణ, సరూర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌లు శివతో జతకట్టారు. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి నగరంలోని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
రోజూ ఐదు బైక్‌ల చోరీ
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో ప్రతీరోజు సగటున ఐదు ద్విచక్రవాహనాలు (బైక్‌లు)చోరీకి గురవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ రెండేళ్ల కాలంలో బైక్ చోరీ సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. తూర్పు, పశ్చిమ ఉపనగరాల్లోనే బైక్‌లు అధికంగా చోరీ అవుతున్నట్లు పోలీసు గణాంకాలు తెలుపుతున్నాయి. జుహూ, ఖార్, శాంతాక్రుజ్, బోరివలి, పొవాయి తదితర ధనవంతులుండే ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబంలో కనీసం రెండు లేదా మూడుకుపైనే బైక్లుంటాయి. వారుంటున్న సొసైటీ ఆవరణలో తగినంత స్థలం లేకపోవడంతో అత్యధిక శాతం వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. దీన్ని అలుసుగా తీసుకున్న చిల్లర దొంగలు రాత్రి వేళల్లో వాటిని తస్కరిస్తున్నారు. బైక్‌లతోపాటు అప్పుడప్పుడు కార్లు కూడా చోరీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడ చోరీ చేసిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. వాహనాలు ముఖ్యంగా అర్థరాత్రి 2-5 గంటల మధ్య చోరీకి గురైతున్నాయి. 2013లో ముంబై నుంచి 3,807, 2014లో 3,494 ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇలా ఏడు సంవత్సరాల కాలంలో 19,351 బైక్‌లు, 9,575 ఫోర్ వీలర్స్, 3,757 ఇతర వాహనాలు చోరీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇలా చోరీకి గురైన వాటిలో 2013లో 1,203, 2014లో 1,825 వాహనాలను పోలీసులు కనుగొన గలిగారు. చోరీ ఇలా జరుగుతుంది వాహన దొంగలు ఏదైనా వాహనాన్ని తస్కరించాలనుకుంటే దానిపై రెండు, మూడు రోజులు కన్నేసి ఉంచుతారు. అర్థరాత్రి 2-5 గంటల మధ్య పోలీసుల గస్తీ అంతగా ఉండదు. దీన్ని అదనుగా చేసుకుని దొంగలు అక్కడే నకిలీ తాళాలు తయారుచేసి కారు డోరు తెరుస్తారు. ఈ పనంతా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే జరిగిపోతుంది. తరువాత అదే ఆర్టీఓ నంబరుపై వాహనాన్ని ముంబై దాటిస్తారు. నిర్ధేశించిన స్థలానికి చేరవేసి అక్కడ భద్రపరుస్తారు. అందుకు కారు ఖరీదును బట్టి వీరికి రూ.50 వేల నుంచి రూ.లక్షా వరకు దళారులు ముట్టజెపుతారు. ఆ తరువాత నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తారు. -
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
భద్రాచలం, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ ముఠాను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.70లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం భద్రాచలం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. భద్రాచలం ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీ చేస్తుం డగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొన్ని వాహనాలు పట్టుబడ్డాయి. ఈ వాహనాలు వినియోగిస్తున్న వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. తొలుత తాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దొంగల ముఠా వివరాలు తెలిశాయి. భద్రాచలం మండలంలోని పాలమడుగు గ్రామానికి చెందిన తాటి నాగేశ్వరరావు బోర్వెల్ పనుల కోసం నల్లగొండ జిల్లాకు వెళ్లగా నల్లగొండకు చెందిన రాచూరి సతీష్, అదే జిల్లా మిర్యాలగూడేనికి చెందిన కారు డ్రైవర్ తీగల శ్రీకర్రావుతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి ఏడాది కాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నారు. సతీష్ డూప్లికేట్ తాళలు తయారు చేయగా వారు ద్విచక్ర వాహనాలు చోరీ చేసి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇలా వీరు భద్రాచలం, మణుగూరు, ఎల్బీనగర్, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. ఎల్బీ నగర్, మిర్యాలగూడ వాహనాలను భద్రాచలం ప్రాంతంలో, ఇక్కడి వాహనాలను మిర్యాలగూడెంలో విక్రయించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక దృష్టి సారించిన ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సహకరించిన ఏఎస్సై లక్ష్మణ్, ఐడీ పార్టీ సిబ్బంది డానియేల్, సూర్యం, కామేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనులకు తగిన ప్రోత్సాహకం అం దించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాస రెడ్డి, భోజరాజు, ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సై రామారావు ఉన్నారు.