vehicles registration
-
నేటి నుంచే టీజీ రిజిస్ట్రేషన్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలోని వాహనాలు శుక్ర వారం(నేటి) నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్డు రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాడాలనే ఆకాంక్షతో పాల్గొన్న ఉద్యమకారులు, ప్రజలు తమ వాహనాలపై ఆరోజే టీజీ ఆని రాసుకున్నారని గుర్తు చేశారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టీజీకి బదులు టీఎస్‌ను తెచ్చి వారి ఆకాంక్షలు, మనోభా వాలను అణచివేసిందని విమర్శించారు. గురువారం హను మకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌తో కలి సి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు నెరవేరేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖ పంపించామని, శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నీ టీజీ మీదనే అవుతాయని, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని చెప్పారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు ఫిట్నెస్ టెస్టులు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు కూడా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తేనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కేడర్లకు చెందిన 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక మూడు సిరీస్‌ల ముచ్చట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్‌లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాహనాలకు ఏపీ సిరీస్ కొనసాగింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్‌లో టీఎస్ సిరీస్ అందుబాటులోకి వచ్చినా, అప్పటివరకు ఏపీ సిరీస్‌తో ఉన్న వాహనాలకు పాత సిరీస్‌నే కొనసాగించొచ్చని నాటి ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2014 జూన్(టీఎస్‌గా మారకముందు)కు ముందు నాటి వాహనాలు ఏపీతో, ఆ తర్వాతవి టీఎస్‌తో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి టీజీ సీరీస్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో మూడు సిరీస్‌లతో వాహనాలు కనిపించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్ సిరీస్‌తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్ తప్ప జిల్లా సిరీస్‌లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి. -
నేటి నుంచి టీఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జిల్లాల వారీ కోడ్లను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం అధికారులు ప్రతిపాదించిన నంబర్లను ఓకే చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పక్షం రోజుల తర్వాత ఈ సిరీస్‌ను ప్రకటించడం విశేషం. వాస్తవానికి ఈ నెల 2 (అపాయింటెడ్ డే) తేదీ నుంచే కొత్త సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికి... టీజీ సిరీస్ కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాల్సి రావటం, కొత్త సిరీస్‌తో మరో నోటిఫికేషన్ జారీ జాప్యం కావడం, టీఎస్ సిరీస్ జారీ అయినా జిల్లాల వారిగా కోడ్నంబర్ల కేటాయింపు వెంటనే చేయకపోవడంతో ఈ జాప్యం అనివార్యమైంది. దీంతో గత పక్షం రోజులుగా తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఎట్టకేలకు జిల్లాల వారి కోడ్ నెంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి పొద్దుపోయాక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏపీ సిరీస్‌లో భాగంగా తెలంగాణ జిల్లాలకు ఉన్న కోడ్నంబర్లను టీఎస్ సిరీస్‌లో కూడా కొనసాగించాలని ఇదివరకే రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏపీ బదులు టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందని జిల్లా కోడ్లు మారిస్తే సాఫ్ట్వేర్ పరంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాని తెలంగాణ జిల్లాలకు కొత్త కోడ్ ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించడంతో కొత్త కోడ్ నంబర్లు కేటాయించక తప్పలేదు. పాత కోడ్ నంబర్లలో వీలైనన్ని అలాగే ఉండేలా అధికారులు ఈ కొత్త కోడ్ నంబర్లను కేటాయించడం విశేషం. పాత సిరీస్‌లో హైదరాబాద్ నగరంలో ఉన్న 9,10,11,12,13 కోడ్నంబర్లే ఇప్పుడు ఉండడం విశేషం. కొత్త సిరీస్‌లో భాగంగా తొలి నెంబర్‌గా టీఎస్ 09 ఈఏ 0001 బుధవారం కేటాయించనున్నారు. పోలీసు వాహనాలకు గతంలోలానే పీ కోడ్‌ను, ఆర్టీసీకి జెడ్‌ను, రవాణాశాఖ వాహనాలకు టీ, యూ,వి, డబ్ల్యూ, ఎక్స్, వై వరకు కేటాయించారు. -
హైసెక్యూరిటీ ప్లేట్లు జారీలో నిర్లక్ష్యం
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: హైసెక్యూరిటీ ప్లేట్లు జారీ చేయడంలో లింక్ ఆటో టోక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో 20 శాతం వాహనాలకు కూడా హైసెక్యూరిటీ ప్లేట్లను అమర్చలేదు. వేలల్లో వాహనాలు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వందల సంఖ్యలో కూడా వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. వాహన యాజమానులకు అవగాహన కల్పించడంలో ఆ సంస్థ విఫలమైంది. హైసెక్యూరిటీ ప్లేట్ ఉన్న వాహనం దొంగతనానికి గురైతే లేబర్ కోడ్ ఆధారంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అన్ని వాహనాలకు ఒకే విధమైన ప్లేట్లు ఉంటాయి. ఎటువంటి రాతలకు ఆస్కారం ఉండదు. 2014 మార్చి ఒకటో తేదీన రవాణా శాఖ కార్యాలయంలో హైసెక్యూరిటీ ప్లేట్లు జారీ పక్రియ ప్రారంభమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇంతవరకు 3500 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, ఇంతవరకు 237 వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ ప్లేట్లను అమర్చారు. ఆసక్తి చూపని వాహనదారులు హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటుకు వాహనదారులు ఆసక్తి కనబరచడం లేదని లింక్ ఆటోటెక్ ప్రవేట్ లిమిటెడ్ సూపర్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. టువీలర్ వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్‌కు 245, ఫోర్ వీలర్ వాహనాలకు 619 ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.