Velai Illa pattathari
-
రామ్... వీఐపి!
వీఐపి.. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం. కానీ, ఈ మధ్య తమిళ పరిశ్రమలో ఈ మూడక్షరాలకు ఓ కొత్తర్థం చెబుతున్నారు. అదే ‘వేలై ఇల్లాద పట్టదారి’ (వి.ఐ.పి). అంటే.. డిగ్రీ పట్టా పుచ్చుకున్న నిరుద్యోగి అని అర్థం. ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. అలాగే, పెళ్లికి ముందు అమలాపాల్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం అక్కడ వసూళ్ల వర్షం కురిపించడం మరో విశేషం. దాంతో ఈ సినిమా హక్కుల కోసం ఇతర భాషలకు చెందిన నిర్మాతలందరూ క్యూ కట్టారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీనే నెలకొంది. ఈ నేపథ్యంలో... ఇంత పోటీని తట్టుకొని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ‘రవికిశోర్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారు’ అనగానే... ఇందులో నటించే హీరో ‘రామ్’ అని చెప్పకనే చెప్పేస్తున్నారంతా. రామ్‌తోనే స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ రీత్యా ఇందులో హీరో పాత్ర... బోయ్ నెక్ట్స్ డోర్ అన్నట్టుగా ఉంటుంది. ఎలాగూ రామ్‌కి పక్కింటబ్బాయి ఇమేజ్ ఉంది కాబట్టి, రామ్‌కి ఈ కథ యాప్ట్‌గా ఉంటుందని పరిశీలకుల అంచనా. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
యాడ్ ఫిలింలో అమలాపాల్
నటి అమలాపాల్ విజయ్ ఓ యాడ్ ఫిలింలో నటించనున్నారు. ఈమెకు ఇటీవల విడుదలయిన ‘వేలై యిల్లా పట్టదారి’ చిత్రం ఘన విజయం సాధించడం సంతోషం కలిగించినట్లు తెలిపారు. ఈమె ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్ రూపొందిస్తున్న మరో చిత్రంలో అమలా నటించనున్నారు. అంటే తన భర్త దర్శకత్వం వహించనున్న యూడ్ ఫిలింలో అమలాపాల్ కెమెరా ముందుకు రానున్నారు. పెళ్లయిన తరువాత ఆమె అంగీకరించిన యూడ్ ఫిలిం ఇదే కావడం గమనార్హం. ఎందుకంటే పెళ్లయ్యూక వైవాహిక జీవితానికే పరిమితమవుతానని, నటనకు దూరమవుతానని ఆమె ఇంతకు ముందే ప్రకటించారు. అయితే అమలా పాల్ వివాహానంతరం నటిస్తున్న ఒకే ఒక చిత్రం మిలి అనే మళయాల చిత్రం. ఈ చిత్రం ఆమె వివాహానికి ముందే ఒప్పుకున్నారు. -
ధనుష్ చిత్ర పోస్టర్లపై వ్యతిరేకత
తమిళసినిమా: నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం వేలై ఇల్లా పట్టాదారి వివాదాల్లో చిక్కుకుంది. ధనుష్ నిర్మించి, నటించిన ఈ చిత్రం విజయబాటలో పయనిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సిగరెట్లు తాగే ఫొటోలతో పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిశాయి. దీనిని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సంఘం నిర్వాహకులు ఈ వ్యవహారంపై ఆరోగ్యశాఖకు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై పొగాకు నియంత్రణ ప్రజా సంఘం నాయకుడు సిరిల్ అలెగ్జాండర్ మాట్లాడుతూ వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ నిచ్చిందన్నారు. ఈ చిత్రంలో పొగతాగే సన్నివేశాలు చాలా ఉన్నాయని, పైగా ధనుష్ సిగరెట్ తాగే ఫొటోలను పోస్టర్లుగా ముద్రించి ప్రచారం చేస్తున్నారని ఇది పొగాకు నియంత్రణ చట్ట వ్యతిరేకత చర్య అవుతుందని పేర్కొన్నారు. ధనుష్ పాపులర్ నటుడని ఆయనే ఆరోగ్యానికి సంబంధించిన పొగాకు నియంత్రణ చట్టాన్ని అతిక్రమించారని ఆరోపించారు. కాబట్టి ధనుష్ సిగరెట్లు తాగే పోస్టర్లను ప్రభుత్వం వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.