మంచిర్యాలలో వివాహిత సజీవ దహనం
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రం సమీపంలోని నస్పూర్ గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానిక లక్ష్మీనగర్‌కు చెందిన వేముల రాగిణి(26) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఆమెతో పాటు ఉన్న ఆమె11 నెలల కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం షార్ట్‌సర్క్యూట్ లేక అగ్నిప్రమాదంతోనా తెలియరాలేదు. స్థానికులు మాత్రం రాగిణి భర్తపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.