Venezuelan
-
వెనెజులాను ఆక్రమిస్తే పోలా?
బొగోటా: ‘ప్రాంతీయ భద్రతకు సవాల్గా మారిన వెనెజులాను ఆక్రమించేస్తే సమస్య పరిష్కారమవుతుంది కదా?’ ఉన్నతస్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలివి. గత ఆగస్టులో వెనెజులాపై ఆంక్షల గురించి చర్చించిన సందర్భంగా ట్రంప్ వేసిన ఈ ప్రశ్నకు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, జాతీయ భద్రత సలహాదారు మెక్ మాస్టర్ తదితరులు అవాక్కయ్యారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. చర్చ సందర్భంగా మెక్మస్టర్ తదితరులు వెనెజులాపై సైనిక చర్యతో కలిగే పరిణామాలను ట్రంప్నకు వివరించారు. అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దెదించే లక్ష్యంతో చేపట్టే ఈ చర్య ఫలితంగా లాటిన్ అమెరికా దేశాధినేతల మద్దతు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కు తగ్గలేదు. సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చే విషయమై ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ.. గతంలో పనామా (1989), గ్రెనడా(1982)లపై విజయవంతంగా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారని ఆ అధికారి తెలిపారు. ఈ సమావేశం తర్వాత రెక్స్ టిల్లర్సన్, మెక్ మస్టర్ ఇద్దరూ పదవుల నుంచి వైదొలగటం గమనార్హం. ఆ తర్వాత రోజు అంటే ఆగస్టు 11న, వెనెజులాపై సైనిక చర్యకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ హఠాత్తుగా ప్రకటించి కలకలం రేపారు. ఆపై కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ సాంటోస్కు ఫోన్ చేసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ దేశ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. అదే ఏడాది సెప్టెంబర్లో ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు వాషింగ్టన్ చేరుకున్న కొలంబియా, మరో మూడు లాటిన్ అమెరికా దేశాధినేతలతో ట్రంప్ ఇదే విషయంపై చర్చించారు. వారు కూడా ఆయన ఆలోచనను వ్యతిరేకించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘పొలిటికో’ పత్రిక పేర్కొంది. వెనెజులా రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఒబామా హయాంలో ఇవ్వని ప్రాధాన్యాన్ని ట్రంప్ ఇస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు అం టున్నారు. కానీ, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానం అమెరికా విరోధులకు మరింత ఊతమిచ్చేలా ఉందని విమర్శిస్తున్నారు. -
జైల్లో ఘర్షణ, 68మంది మృతి
కారకస్: వెనిజులాలోని జైల్లో మరోసారి తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. సెంట్రల్ నగరంలోని వాలెన్సియాలోని జైలునుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జైలుకు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో అగ్ని ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. దీనిపై చీఫ్ ప్రాసిక్యూటర్ తారెక్ విలియం సాబ్ ట్విటర్లో సమాచారం అందించారు. బాధాకరమైన సంఘటన అంటూ బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. కరోబోబో రాష్ట్రంలో నిర్బంధ కేంద్రంలోని జైళ్లలో నమోదువుతున్న ఘోరమైన సంఘటనలకు తాజా ఉదంతమిది. బుధవారం చెలరేగిన ఘర్షణల సందర్భంగా ఎంతమంది చనిపోయిందీ పూర్తి స్పష్టత లేనప్పటికీ.. ప్రాథమికంగా 68మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాల సమాచారం. ఒక పోలీసు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరోవైపు సరైన సమాచారాన్ని అధికారులు అందించడలేదంటూ జైలు బయట ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించి పరిస్థిని అదుపు చేశారు. మృతులకు సంబంధించిన వివరాలను ఫోరెన్సిక్ వైద్యులు అంచనా వేస్తున్నారని , త్వరలోనే పూర్తి వివరాలను అధికారులు ప్రకటించారు. సమగ్ర దర్యాప్తునకు హామీ ఇచ్చారు. కాగా వెనిజులాలోని జైళ్లలో అధ్వాన్నమైన పరిస్థితుల నేపథ్యంలో జైళ్లలో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణం. గతంలో జైళ్లలో పెద్ద ఎత్తున చెలరేగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ఖైదీలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. -
వామ్మో ఆమె నా..నా.. నాలుక!
-
వామ్మో.. ఈమెలా ఎవరూ చేయలేరు!
సాధారణంగా అయితే.. మనుషులు తమ నాలుకతో మోచేతికొనను తాకలేరు. అదేవిధంగా నాలుకతో ముక్కు కొనను అందుకొనడం కూడా కొంచెం కష్టమే. ఇక నాలుకతో కళ్లను, చెవులను తాకగలరా? లేదు. కానీ, మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న ఈ అమ్మాయి మాత్రం ఇలాంటి పనులన్నింటినీ చిటికెలో చేసేస్తుంది. ఆమె నాలుక తీసి బయటపెట్టిందంటే.. ఎవరైనా వామ్మో ఎంతపెద్ద నాలుకో అని నోరెళ్లబెట్టాల్సిందే. ఫ్లోరిడా (అమెరికా)లోని ఒకాలాకు చెందిన జెర్కరీ బ్రచో తన పొడువైన నాలుకతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. వెనిజూలా సంతతికి చెందిన ఈ అమ్మడు తన నాలుకతో చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తూ ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టింది. కొంత వింతగా, ఇంకొంత వికృతంగా తోచే ఆమె నాలుక వీడియోలకు యూట్యూబ్లో మంచి వ్యూయర్షిప్పే ఉంది. నాలుకతో మోచేతి కొనను చుంబిస్తూ.. ముక్కు కొనను తాకుతూ.. ముక్కు రంధ్రల్లో నాలుకను దూరుస్తూ.. చేవిని, కళ్లను నాలుకతో తాకుతూ.. ఓ మై గాడ్ అనిపించేలా ఈ సుందరి చాలా ఫీట్లే చేసింది. ఎవరి ప్రత్యేకత వారికున్నట్టే.. ఎవరి వెర్రి వారికుంటుంది కదా!