వామ్మో.. ఈమెలా ఎవరూ చేయలేరు! | Venezuelan contortionist shows off her incredibly lengthy licker by touching her eye, ear and ELBOW | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఈమెలా ఎవరూ చేయలేరు!

Published Sun, Jul 31 2016 11:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

Venezuelan contortionist shows off her incredibly lengthy licker by touching her eye, ear and ELBOW



సాధారణంగా అయితే.. మనుషులు తమ నాలుకతో మోచేతికొనను తాకలేరు. అదేవిధంగా నాలుకతో ముక్కు కొనను అందుకొనడం కూడా కొంచెం కష్టమే. ఇక నాలుకతో కళ్లను, చెవులను తాకగలరా? లేదు. కానీ, మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న ఈ అమ్మాయి మాత్రం ఇలాంటి పనులన్నింటినీ చిటికెలో చేసేస్తుంది.

ఆమె నాలుక తీసి బయటపెట్టిందంటే.. ఎవరైనా వామ్మో ఎంతపెద్ద నాలుకో అని నోరెళ్లబెట్టాల్సిందే. ఫ్లోరిడా (అమెరికా)లోని ఒకాలాకు చెందిన జెర్కరీ బ్రచో తన పొడువైన నాలుకతో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయిపోయింది.

వెనిజూలా సంతతికి చెందిన ఈ అమ్మడు తన నాలుకతో చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తూ ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. కొంత వింతగా, ఇంకొంత వికృతంగా తోచే ఆమె నాలుక వీడియోలకు యూట్యూబ్‌లో మంచి వ్యూయర్‌షిప్పే ఉంది. నాలుకతో మోచేతి కొనను చుంబిస్తూ.. ముక్కు కొనను తాకుతూ.. ముక్కు రంధ్రల్లో నాలుకను దూరుస్తూ.. చేవిని, కళ్లను నాలుకతో తాకుతూ.. ఓ మై గాడ్‌ అనిపించేలా ఈ సుందరి చాలా ఫీట్లే చేసింది. ఎవరి ప్రత్యేకత వారికున్నట్టే.. ఎవరి వెర్రి వారికుంటుంది కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement