venkata
-
గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
ఒకరి గురించి ఒకరు భజన ఈ భజన బ్యాచ్ మనకు అవసరమా
-
వేడుకగా హంస పురస్కారాల ప్రదానం
రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్.అబ్దుల్ అజీజ్ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్ జడా సుబ్బారావు (అసిస్టెంట్ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్ హెచ్ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు. వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కె. సుధాకర్ ప్రసంగించారు. -
ఆ భూకేటాయింపు సమర్థనీయమేనా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన కె.కోటేశ్వర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. -
Andhra Pradesh: శుభకరమైన పాలన
జాన్ రాల్స్టన్ సౌల్ అన్న సామాజిక శాస్త్ర నిపుణుడు తన ‘ద కొలాప్స్ ఆఫ్ గ్లోబలిజం’ పుస్తకంలో ఉదాత్త నాయకులు భగవత్ సంకల్పంగా, ప్రకృతి నియమాను సారంగా ఆవిర్భవిస్తారని పేర్కొంటాడు. నాడు ఆరోగ్యం, ఆహారం, ఆవాసం, ఆచారం, అభ్యాసం, ఆర్జనం, ఆదర్శ దాంపత్యం, ఆదాయం అనే అష్టలక్ష్మిలకు తోడు ఆనంద మనే నవరత్నములను తొడిగిన గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రీరాముడు మానవ జాతికి అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత వికాస క్రమానికి ఇది దోహదపడిందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఆమోదిస్తున్నారు. వివేకానందుడు, గాంధీ మహాత్ముడి నుండి నేటి పాలకుల వరకు రామరాజ్యం ఒక సుందర స్వప్నం. ఆ దారిలోనే కుటుంబ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆకలికి మత విలువలు తెలియవంటాడు వివేకానందుడు. నాడు కలకత్తా ప్లేగు సమయంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాదిమందిని కాపాడాడు. ఆ ధీరుని స్ఫూర్తితో గాంధీ మహాత్ముడు వాలంటరీ వ్యవస్థతో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వ హించాడు. నేడు అదే స్ఫూర్తితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థ లక్షలాది మంది కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఆరోగ్య పరిరక్షణ రామరాజ్యంలో మౌలిక ధర్మం. అయోధ్యా రాజ్యంలో పెద్దలెవరూ తమ పిల్లలకు అంత్యక్రియలు జరిపిన దాఖలాలు లేవు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ లక్ష్య మిది. దానిని మరింత ముందుకు తీసుకొనిపోయి, ప్రపంచంలోని ఆరోగ్య రంగా నికి ఒక దిక్శూచిగా ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పనిచేయడం వాస్తవం. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా సంరక్షణ, ఆక్సిజన్ సరఫరాల లాంటి అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటించిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ వైద్యా లయాలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వమిది. ఖరీదైన వైద్యసేవలు కూడా ఈ మహమ్మారి సమయంలో ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లండ్, యూరప్ సమాజాలు, అమెరికా లాంటి ధనిక దేశాలు ఆరోగ్య సంస్కరణలు లేకుండా కకావిక లమయ్యాయి. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లేయర్ లాంటి గొప్ప నాయకుడు కూడా ఆరోగ్య సంస్కరణలో అనుకున్నంత సాధించలేకపోయానని తన జీవితచరిత్రలో అంతర్మథనం పొందాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రాజ్యంలాగా తండ్రి చేపట్టిన ఆరోగ్య సంస్కరణలకు నిజరూపాన్ని ఇవ్వడం నేడు సత్య ప్రామాణికం. సగటు మనిషి జీవన ప్రమాణాలకు కారణమైన ఆరోగ్యం, ఆహారం, ఆవాసాలను సుస్థిరం చేస్తూనే, అభ్యాసంలో భాగంగా విద్యను సంతృప్తిగా భోదించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం రామరాజ్యంలో భాగమే. సాంకేతిక విప్లవంతో కుగ్రామమైన ఈ ధరణిలో నాడు–నేడు పేరుతో పదిహేను వేల పాఠశాలలను సంస్కరించడం చరిత్ర మరువదగని అంశం. నాటి గురుకులాల వలె జగనన్న గోరుముద్దలతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ముందుచూపు రాజ్య ధర్మంలోని విశిష్టత. అధికార యంత్రాంగాన్ని సమాయత్తపరచి అల్పమైన విషయాలను కూడా వదలకుండా అత్యంత లాభం చేకూర్చేవాడే నిజమైన పాలకుడని శ్రీరాముడు ఉపదేశించాడు. అధర్మ వేషంలో ధర్మ పన్నాగాలు పన్నేవారి పట్ల అప్రమత్తతతో వుండాలనీ, జనులకు నిజం తెలియాలనీ భరతునికి రాముడు ఉపదేశిస్తాడు. ప్రజలకు సత్యాన్ని విడమరచి చెప్పేందుకు ధార్మిక సంస్థలను ప్రభు త్వానికి చేరువ చెయ్యాలి. నాడు రాజకీయాలకు అతీతంగా సమాజ సేవను మత సారంగా తెలియ జెప్పిన వివేకానందుడు మనకు ఆదర్శం కావాలి. ప్రభుత్వాన్ని బూచిగా చూపించి ప్రజలలో గందరగోళం సృష్టించడం అనైతికం. అతలాకుతలమవుతున్న మానవ జాతిలో ఆంధ్రజాతి సమున్నతంగా జీవించాలంటే జనే జనే, గృహే గృహే, గ్రామే గ్రామే, పురే పురే అంటూ ఆబాలగోపాల హృదయం సామాజిక చైతన్యంతో తొణికిసలాడాలి. మన రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతి ఇంట గుడి గంటలు మ్రోగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంఘీభావం తెలపాలి. - ఎస్. వెంకట శర్మ వ్యాసకర్త ముఖ్య సమన్వయ అధికారి, ధార్మిక సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానములు -
విషాదాన్ని మరపించేది హాస్యమే
– ముళ్లపూడి జయంతి సభలో సాహితీవేత్తలు రాజమహేంద్రవరం కల్చరల్ : మన జీవితాల్లో విషాదాన్ని మరపించే శక్తి ఒక్క హాస్యానికే ఉందని ప్రముఖ గేయకవి మహమ్మద్ ఖాదర్‌ఖాన్ పేర్కొన్నారు. బుధవారం కళాగౌతమి ఆధ్వర్యంలో ప్రకాశం నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన రచయిత ముళ్లపూడి వెంకట రమణ జయంతిసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గురజాడ వెంకట అప్పారావు, భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్లపూడి వెంకట రమణలు తెలుగునాట నవ్వులు పండించారని, మాట ‘విరుపు’ ముళ్లపూడి ప్రత్యేకత అని ఆయన వివరించారు. ‘జీవితాన్ని ‘స్కాచి’వడపోశాడు, ‘డబ్బు’ చేశాడు వంటి పదప్రయోగాలతో నూతన ఒరవడిని ముళ్లపూడి ప్రవేశపెట్టారన్నారు. చరిత్ర పరిశోధకుడు వి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హాస్యం అపహాస్యం కాకుండా ఉత్తమాభిరుచితో ముళ్లపూడి రచనలు చేశారన్నారు. ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పౌరాణికగాథలను సాంఘిక మూసలోకి తీసుకువెళ్లడం ఒక్క ముళ్లపూడికే చెందిందన్నారు. రామాయణంలో సుందరకాండ అంతా కనిపించే హనుమంతుడు, రామపట్టాభిషేకం అయ్యాక శ్రీరాముడు సీతమ్మతల్లిని అడవులకు పంపించినప్పుడు ఆ తల్లి వెంటే పిల్లవాడిరూపంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడని, లవకుశులతోపాటు సీతమ్మతల్లి యోగక్షేమాలు చూసేవాడని తన చివరి సినిమాలో ముళ్లపూడి చెప్పడం సంప్రదాయ విరుద్ధం కాదని అన్నారు. ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ మాట్లాడుతూ మృదువైన హాస్య, వ్యంగ్య రచనకు ప్రాణం పోసినవాడు ముళ్లపూడి అని పేర్కొన్నారు. ముళ్లపూడి ‘ఋణానందహరి’లో రచించిన ‘ఎవ్వనిచే జనించు ఋణమెవ్వనిచే భ్రమియించు లోకములో..నేను ఋణంబు వేడెదన్’ అన్న పద్యాన్ని వినిపించారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి ముళ్లపూడి జీవితంలో అనుభవించిన కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను విశ్లేషించారు. హాసం క్లబ్ కన్వీనర్ డి.వి.హనుమంతరావు మాట్లాడుతూ ముళ్లపూడి స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిని కేవలం హాస్యరచనగా చూడరాదని, అందులో ముళ్లపూడి వేదాంత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముందుగా ముళ్లపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాట్యాచార్యుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, చిత్రకారుడు మాదేటి రవిప్రకాష్, గాంగేయశాస్త్రి, అవధాన అష్టాపద తాతా సందీపశర్మ, రామచంద్రుని మౌనిక, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ, సన్నిధానం శాస్త్రి, మల్లెమొగ్గల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.