venkata ramireddy
-
ప్రజలపై పెనుభారం మోపుతారా!
అనంతపురం (కార్పొరేషన్): విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు ఐదున్నర నెలల్లో రూ.15,485 కోట్ల పెనుభారం మోపారని.. తిరిగి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయించడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఐదున్నర నెలల్లోనే మాట తప్పారని ధ్వజమెత్తారు.ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచి్చన చంద్రబాబు మాట తప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. బెల్టు తీసినంత సులభం కాదు.. బెల్టు షాపుల మాఫియాను అరికట్టడం బెల్టు తీసినంత సులభం కాదని చంద్రబాబుకు అనంత చురకలంటించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టడానికి కారణం చంద్రబాబే అన్నారు. వేలం పాట వేసి మరీ బెల్టు షాపులను తన కార్యకర్తలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పుడేమో బెల్టు తీస్తా అని తనకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బూడిద కోసం రెండు జిల్లాల పోలీసులను సరిహద్దుల్లో బందోబస్తు పెట్టడం, ఈ విషయంపై సీఎం చంద్రబాబు పంచాయితీ పెట్టడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేటు మరొకటి లేదని మండిపడ్డారు. -
టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
-
దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారం
దుబాయ్: విజయా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు స్వర్గీయ బి.నాగిరెడ్డి స్మారకార్థం ప్రతియేటా నిర్వహించే ‘నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం’ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. గత ఆరేళ్లుగా ఈ అవార్డును తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాకు అందజేస్తున్నారు. 2017 ఏడాదికిగాను ‘ఫిదా’ సినిమాని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సొలేట్ ఆడిటోరియంలో భారతీయ దౌత్యవేత్త సుమతీ వాసుదేవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫిదా సినిమా నిర్మాత దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారంతో పాటు 1.5 లక్షల రూపాయల నగదు అందజేశారు. విదేశీ గడ్డపై ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నామని ఇకపై ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని విజయా అధినేతలు వెల్లడించారు. కాగా, పురస్కార గ్రహీత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇటువంటి పురస్కారం అందుకోవడం నా అదృష్టం, ఇంత గొప్ప అవార్డును అందుకోవడానికి ఏ దేశానికైనా వెళతానన్నారు. నాగిరెడ్డి కుమారులు వెంకటరామి రెడ్డి, కోడలు భారతి రెడ్డి ( విజయా ఆస్పత్రుల అధినేత్రి) పర్యవేక్షణలో.. గీతా రమేశ్, రమేశ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుధా పల్లెం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగిరెడ్డి సినిమా పాటలు.. సంగీత దర్శకులు మాదవపెద్ది సురేశ్‌చంద్ర వాద్య, గాయక బృందం విజయా సినిమాల పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో అబుదాబికి చెందిన ఆదిభట్ల కామేశ్వర శర్మ, సునీతా లక్ష్మీ నారాయణ, ఉమా పద్మనాభం, స్వప్నికా శ్రీనివాస్, విశాలా మధు తదితరులు పాల్గొన్నారు. -
'పాలీ హౌస్‌లు నిర్మిస్తే.. రైతులకు సహకరిస్తాం'
నల్లగొండ(భువనగిరి అర్బన్): రాష్ట్ర రైతులు పాలీ హౌస్‌లు నిర్మించుకుంటే తాము సహకరిస్తామని ఉద్యానవన కమిషనర్ వెంకట రామిరెడ్డి అన్నారు. ఆయన నల్లగొండ జిల్లా భువనగిరిలో కొత్తగా ఏర్పాటు చేసిన పాలీ హౌస్‌ను ప్రారంభించారు. భువనగిరికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు తన పొలంలో పాలీ హౌస్‌ను నిర్మించి క్యాప్సికం సాగు చేస్తున్నారు. అయితే ఈ రోజు పంటను కమిషనర్ పరిశీలించారు. 200 గజాల నుంచి 1000 గజాలలోపు స్థలంలో పాలీహౌస్‌లు నిర్మించుకుని లాభాలు పొందాలని రైతులకు తెలిపారు.