Venkateshwara
-
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్‌సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్‌గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్‌ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్‌తో పాటు మరో డాక్యుమెంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్‌నోట్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్‌రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్‌ఖాన్, పులి సునీల్‌కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్‌కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
వెంకటేశ్వర వైభవం
-
కొమ్మరవరంలో బయటపడ్డ పురాతన విగ్రహాలు
-
శ్రీవారి సేవలో రతన్ టాటా
-
బ్రేక్‌ఫాస్ట్ షో : ఈ దృశ్యాలు శ్రీవారివే(నా)!!
-
ఈ దృశ్యాలు.. తిరుమల శ్రీవారివే(నా)?!
-
అయ్యో ఎంత కష్టం !
*నిరుపేదకు పెద్దజబ్చు *దాతలూ దయ చూపండి అతనో నిరుపేద యువకుడు. క్షౌరవృత్తితో వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంతలో అనారోగ్యం బారినపడ్డాడు. పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలూ పాడయ్యాయనే పిడుగులాంటి వార్త చెప్పారు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డను ఆదుకునేందుకు దాతలు దయ చూపాలని వేడుకుంటున్నారు. పుత్తూరు, న్యూస్‌లైన్: పుత్తూరు పట్టణం గేటుపుత్తూరులోని గుండ్లపుత్తూరుకు చెందిన రాధమ్మ, చక్రపాణిల రెండవ కుమారుడు వెంకటేశ్వర్లు(33). ఇతనికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. స్థానికంగా ఉన్న క్షౌర దుకాణంలో వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు. వచ్చే అంతోఇంతో ఆదాయంతో తల్లి, భార్యను పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం కాళ్లు వాయడంతో స్థానికంగా ఓ ప్రయివేటు క్లినిక్‌లో చూపించుకున్నాడు. అక్కడి వైద్యుల సలహా మేరకు తిరుపతి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వెంకటేశ్వర్లుకు రెండు కిడ్నీలూ పాడైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అమ్మ రాధమ్మ, అన్న రాజేంద్రబాబు పలు ఆస్పత్రుల్లో వెంకటేశ్వర్లుకు వైద్యం చేయించారు. సుమారు 50 వేల రూపాయలు అప్పు మిగిలినా పరిస్థితిలో మార్పులేదు. ఇక స్థోమత లేకపోవడంతో తిరుపతి స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వెంకటేశ్వర్లును చేర్పించారు. అక్కడ నెల రోజులు డయాలసిస్ చేసిన వైద్యులు తర్వాత ఇంటికి పంపేశారు. వెంకటేశ్వర్లుకు వారంలో రెండు సార్లు ప్రయివేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇందుకు కోసం ప్రతి వారం రూ.4 వేలు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని భరించే శక్తి ఆ కుటుంబానికి లేదు. అప్పోసప్పో చేసి నెట్టుకొస్తున్నారు. వారు మాట్లాడుతూ రెండు కిడ్నీల మార్పిడికి రూ.14 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. దాతలు దయతలిస్తే తమ బిడ్డ మళ్లీ ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పారు. దాతలు 8500951242 నంబరులో సంప్రదించాలని కోరారు. అలాగే ఎ.రాజేంద్రబాబు, ఎస్బీఐ బ్యాంకు ఖాతా(32470026300) లో సొమ్ము జమ చేయవచ్చని తెలిపారు. -
మోకాళ్ల నొప్పులను నివారించడం ఎలా...?
నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు కాస్తంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఫ్రెండ్స్‌ని అడిగితే ఇవి పాత నొప్పులనీ, భవిష్యత్తులో మరింత పెరుగుతాయని అంటున్నారు. వీటికి ఆపరేషన్ అవసరమా? ఇవి మరింత పెరగకుండా నివారణ చర్యలను సూచించండి. - వెంకటేశ్వరావు, ఆదోని మోకాళ్లలో నొప్పి మొదట్లో కొద్దిగా కనిపించగానే, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వారు తమ జీవనశైలిని తప్పక మార్చుకోవాలి. సమతులాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవనం గడపడంతో పాటు ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయాలి. పాదాలకు సౌకర్యంగా ఉండే పాదరక్షలనే ఎంచుకోవాలి. బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు. లావెటరీ విషయంలోనూ వెస్ట్రన్ ఉపయోగించడం మేలు. ఇక కొందరు మోకాళ్ల నొప్పులు కనిపించగానే మసాజ్ చేయిస్తుంటారు. ఇది అంత మంచి పరిష్కారం కాదు. మరికొందరు మోకాళ్ల నొప్పులనగానే నీ-రీప్లేస్మెంట్ సర్జరీ గురించి ఆలోచిస్తారు. కానీ అది ఖరీదైన ప్రక్రియ. పైగా చివరి ఆప్షన్‌గా మాత్రమే దాన్ని ఆలోచించాలి. ఈలోపు జీవనశైలిలో మార్పులతోనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి. నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా అని అదేపనిగా నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్) వాడకూడదు. భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులను రాకుండా చేయడానికి లేదా వీలైనంత ఆలస్యం చేయడానికి సైక్లింగ్, ఈత వంటి ఎక్సర్సైజ్లు, బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒకేచోట కుదురుగా కూర్చోడాన్ని నివారించడం చేస్తుండాలి. కూర్చున్న చోటే చేసే వ్యాయామంలాగా... కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక కాలిని రోజూ 20-30 సార్లు ముందుకు చాపడం చేస్తూ ఉండాలి. రెండో కాలి విషయంలోనూ అదే వ్యాయామాన్ని చేయాలి. ఇలాంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్