vepagunta
-
నిరసనలతో హోరెత్తిన వేపగుంట
స్వగ్రామం చేరుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం విశాఖపట్నం: ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మెహిదీపట్నం నుంచి రావడంతో విశాఖ జిల్లా వేపగుంటలో విషాదకర వాతావరణం నెలకొంది. అప్పలరాజుని ముమ్మాటికీ హతమార్చారని ఆరోపిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. అప్పలరాజు హైదరాబాదు మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో విధుల్లో ఉండగానే పిస్తోలుతో కాల్చుకుని మరణించాడని అక్కడి అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పలరాజు మృతదేహం మంగళవారం వేపగుంట సమీపించే సరికి కుటుంబసభ్యులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. అప్పలరాజు అమర్హ్రే... అంటూ నినాదాలిచ్చారు. మృతుని తల్లి ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు, భార్య అనసూయ, పిల్లల రోదనలతో జనం చలించిపోయారు. వీరితోపాటు జనం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అప్పలరాజు ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికివాడు కాడని... అతని మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పలరాజు భౌతికకాయానికి ఆర్మీఅధికారులు గౌరవవందనం ఏర్పాటు చేయకపోవడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తని వేధించారు... ‘నా భర్తని ముమ్మాటికీ మానసికంగా హింసించే చంపారు...మరణానికి ముందు నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ ఆయనను వేధించారు’ అంటూ అప్పలరాజు భార్య అనసూయ కన్నీటి పర్యంతమయింది. మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో ముస్తఫా అనే బాలుని మృతిపై కొద్ది రోజులుగా విచారణ జరుగుతుండగా.... కేసు నుంచి బయట పడడానికి ఇద్దరు జవాన్లు తన భర్తపై నింద మోపారని చెప్పింది. చనిపోవడానికి మూడు రోజుల కిందటి నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ వేధించారని, ముస్తఫాని అప్పలరాజే చంపినట్లు బలవంతంగా ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుండేవారని ఆరోపించింది. తన భర్త తుపాకీతో కాల్చుకుని మరణించే అవకాశం లేనే లేదని, ఎవరో ఆయనను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆందోళన వ్యక్తం చేసింది. తన బావ అప్పలరాజు మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, జ్యుడీషియల్ విచారణ జరపాలని అప్పలరాజు బావమరిది శివరామకృష్ణ డిమాండ్ చేశారు. -
నిలిచిన ఆర్మీజవాన్ అప్పలరాజు అంత్యక్రియలు
విశాఖ : ఆర్మీ జవాన్ అప్పలరాజు అంత్యక్రియలు విశాఖ వేపగుంట శ్మశాన వాటికలో మంగళవారం నిలిపిపోయాయి. అధికార లాంఛనాల కార్యక్రమానికి ఆర్మీ అధికారులు ఎవరూ రాకపోవటంపై బంధువులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు. 14 ఏళ్ల పాటు కుటుంబాన్ని వదిలి దేశసేవకు అంకితమైన ఆర్మీ జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ అప్పల రాజు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మోహదీపట్నం ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున అప్పలరాజు పిస్టోలుతో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. -
విశాఖకు ఆర్మీ జవాన్ అప్పలరాజు మృతదేహం
విశాఖ : హైదరాబాద్ మోహదీపట్నంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మంగళవారం విశాఖ చేరింది. మృతుని బంధువులు, స్థానికులు రేగొండ జంక్షన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఆందోళనకు యత్నించిన అప్పలరాజు భార్య అనసూయను ఆర్మీ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా అప్పలరాజు స్వస్థలం వేపగుంట. జవాను అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మోహదీపట్నం ఆర్మీ ఏరియాలో గత నెల 8వ తేదీన ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పలరాజును కూడా ఇటీవలే విచారించి వదిలిపెట్టారు. తరచు విచారణ పేరుతో అప్పలరాజును వేధిస్తుండటంతో మన స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మిలటరీ అధికారుల భావిస్తున్నారు. కాగా ముస్తఫా కేసులో అప్పలరాజును నిందితుడిగా భావించరాదని మిలటరీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న అప్పలరాజు ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున పిస్టోలుతో కాల్చుకుని మరణించటం మిస్టరీగా మారింది. -
మిస్టరీగా ఆర్మీ జవాను మృతి
గోపాలపట్నం: ఆర్మీ జవాను బల్ల అప్పలరాజు(38) ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆయన మరణంతో వేపగుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ మెహదీపట్నం ఆర్మీ ఏరియాలో ఈనెల 8న ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఆర్మీ ఉద్యోగి బల్ల అప్పలరాజు ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున పిస్తోలుతో కాల్చుకుని మరణించడం మిస్టరీగా మారింది. ఏడాదిలో సర్వీసు ముగుస్తుందనగా... అప్పలరాజు స్వస్థలం వేపగుంట. ము త్యాలమ్మ, నరసమ్మ దంపతుల మూడో కుమారుడు. ముందు నుంచి చురుగ్గా ఉండే ఆయన చిన్న వయసులోనే ఆర్మీ లో చేరారు. తొమ్మిదేళ్ల క్రితమే అనసూయతో వివాహం జరిగింది. వీరికి కొడు కు నిషాంత్(7), కుమార్తె ప్రణతి (15 నెలలు) ఉన్నారు. అప్పలరాజు గతంలో జమ్ము, సిక్కిం, పంజాబ్, అండమాన్ లో సైనికునిగా పనిచేసి ఉన్నతాధికారులతో పతకాలు కూడా అందుకున్నాడు. తాజాగా హైదరాబాదు మెహదీపట్నం ఆర్మీ ఏరియాలో భార్యా పిల్లలతో ఉం టున్నాడు. మరో ఏడాదిలో సర్వీసు ము గియనుంది. దసరాకి భార్యాపిల్లలతో వేపగుంట వచ్చిన అప్పలరాజు పది రోజులు గడిపి వెళ్లారు. పేదరికంలో ఉన్న అన్నయ్య, అమ్మకీ అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇంతలో అప్పలరాజు మరణంచినట్లు టీవీల ద్వా రా తెలుసుకున్న ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు షాకయ్యారు. నా కుమారుడు దేశభక్తుడు తన కుమారుడు హత్యలు చేసే వ్యక్తి కాడని, దేశభక్తుడని తల్లి ముత్యాలమ్మ తెలిపిం ది. చనిపోయేటంత పిరికివాడు కాదని, అతడి మరణంపై తమకు అనుమానాలున్నాయని సోదరుడు ముత్యాలు అన్నారు. అప్పలరాజు స్వతహాగా వివాదరహితుడని, ఎవరో హతమార్చి పిస్తోలుతో కాల్చుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.