Verma compost
-
వ్యర్థ పదార్థాలతో వర్మీ కంపోస్ట్
ఖర్చు తక్కువ..దిగుబడి ఎక్కువ ఏడాదికి ఆరుసార్లు తయారు చేయవచ్చు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల ఎరువు ఉపయోగించాలి పీలేరు: వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థా ల మీద ప్రయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయా రు చేసే ఎరువు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. వర్మీ కంపోస్టులో పోషక విలువ ఎక్కువ. పశువుల పెంటలో సరాసరి నత్రజని, భాస్వరం, పొటాష్, పోషకాలు వరుసగా 0.75, 0.55 శాతం ఉండగా వర్మీ కంపోస్టులో సరాసరి ఇవి 1.60, 5.04, 0.80 శాతం గా ఉంటాయి. వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకా లు పశువుల ఎరువు కన్నా దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయని పీలేరు మండల వ్యవసాయాధికారి షణ్ముగం(8886612565) తెలిపారు. వర్మీ కంపోస్టుకు అవసరమైనవి వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగపడుతాయి. ఇతర అవసరాలు వానపాములు ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కోసం తగిన నీడను కల్పించాలి. ఇం దుకు పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచు లు, పాలిథీన్ సంచులను ఉపయోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమేకాక ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవ చ్చు. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయటం భూమికి సమాంతరంగా 3 అడుగులు వెడల్పు ఉంటేటట్లు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగుబాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తువరకు వర్మీ కంపోస్టు చేయాలనుకుంటే కుళ్లుతున్న వ్యర్థ పదార్థాలను(చెత్త, ఆకులు, పేడ మున్నగున్నవి) వేయాలి. ఈ వ్యర్థ పాదార్థాలపైన 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడ వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడ వేసేటపుడు బెడ్‌పై నీరు చల్లాలి. ఇలా ఒక వారం వరకు నీరు అడపాదడపా చ ల్లుతుండాలి. వారం తరువాత పైన సూచించిన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటపుడు బెడ్‌ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటరుకు వెయ్యి వరకు వానపాములను వదలాలి. బెడ్‌పైన పాత గోనె సంచులు, వరిగడ్డి పర్చాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక కప్పలు, పక్షులు, చీమల నుంచి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజూ నీరు పలుచగా చల్లాలి. బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి నాలుగైదు రోజుల ముందుగా నీరు చ ల్లటం ఆపివేయాలి. వానపాములు తేమను వెతుకుతూ లోపలికి వెల్లి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్‌పైన కప్పిన గోనె సంచులు, వరిగడ్డిని తీసివేయాలి. ఎరువును శంఖాకారంగా చిన్నచిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2-3 ఎమ్ఎమ్ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తువరకు పరచి కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఎకారాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వాడవచ్చు వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చె ట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి రెండు సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. -
ఆవు.. అన్నదాతకు ఆదరువు
అమలాపురం :జిల్లాలో సేంద్రియ పద్ధతిని అనుసరించే రైతులు ఒకప్పుడు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టేస్థాయిలో ఉండేవారు. వీరి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతోంది. వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులపై మొగ్గు చూపుతుండడం, మార్కెట్లో ఎక్కువ ధర ఉండడం రైతులను ఇటు మళ్లేలా చేస్తోంది. ఈ పద్ధతిలో తొలి రెండేళ్లు దిగుబడి తగ్గినా, మూడో ఏటి నుంచి పెరుగుతోంది. వరి, ఇతర వాణిజ్య పంటలకన్నా కూరగాయల రైతులు ఎక్కువగా ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జిల్లాలో 15 శాతం మంది సాగులో సేంద్రియ పద్ధతిని ఎక్కువగా వినిగిస్తుంటే ఐదు శాతం మందిది పూర్తిగా సేంద్రియ సాగే. కొందరు ప్రకృతి వ్యవసాయం అంటుంటే.. ఇంకొందరు వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల పద్ధతి అంటున్నారు. మరి కొందరు గో ఆధారిత సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అన్నింటిలో గో ఆధారిత వ్యవసాయానిదే అగ్రస్థానం. పేరూ, తీరూ ఏదైనా వీరందరి లక్ష్యం పెట్టుబడులు తగ్గించుకోవడం.. లాభాలు పొందడం, భూసారాన్ని పరిరక్షించుకోవడం, కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని, జీవన వైవిధ్యాన్ని కాపాడడం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం. కొత్త రైతుల ఆసక్తి సేంద్రియసాగు వల్ల జిల్లాలో ప్రధాన పంట అయిన వరి, చెరకు, పత్తి సాగుల్లో ఎకరాకు రూ.8వేల నుంచి రూ.పది వేల వరకు ఆదా అవుతోంది. కొబ్బరి, అరటి తదితర పంటల్లో పెట్టుబడి మరీ స్వల్పం. సొంత ఆవుల నుంచి సేకరించే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడతో కలిపి జీవామృతం తయారీకి రైతుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. పురుగులు, తెగుళ్ల నివారణకు వేప ఆకు, వేప నూనె, వేప పిండిని, ఆవుమూత్రం, సీతాఫలం, ఉమ్మెత్త వంటి వాటిని ఉపయోగించి ఘన జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రాలను తయారు చేస్తున్నారు. ప్రధానంగా పెట్టుబడి తగ్గడమే పలువురు కొత్త రైతులను ఆకర్షిస్తోంది. మిత్రపురుగుల్ని పొట్టన పెట్టుకుంటున్న రసాయనాలు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయి. వీటిని పెంచడం కోసం మరిన్ని ఎరువులు వాడాల్సి వస్తోంది. తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరుగుతోంది. వీటి నివారణకు రూ.వేలకు వేలు పెట్టుబడి అవుతోంది. ఈ ఖరీఫ్‌లో సుడిదోమ సోకి ఎకరాకు ఐదు బస్తాలకు పైబడి దిగుబడి కోల్పోగా, నివారణకు ఎకరాకు రూ.మూడు వేల వరకు ఖర్చయింది. కేవలం దోమ నివారణకే జిల్లాలో రైతులు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఒక సాలె పురుగు ఒకరోజులో 12 వరకు దోమల్ని తింటుంది. పురుగుమందుల వల్ల పొలంలో సాలీళ్లు , పలురకాల మిత్రపురుగులూ అంతరిస్తున్నాయి. భూమిలో 16 అడుగుల లోతుకు చొచ్చుకుపోయే వానపాము విసర్జించే మలమే కంపోస్టు అవుతోంది. విష రసాయనాలకు ఇవి కూడా బలయ్యాయి. వాటి ప్రాధాన్యతను గుర్తిస్తున్న రైతులు వీటిని వృద్ధి చేసుకునేందుకు వర్మీ కంపోస్టు, జీవన ఎరువులను వాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనత.. రైతులు ఇలా అద్భుతాలు సృష్టిస్తుంటే ప్రభుత్వం ఈ సాగును ప్రోత్సహించడంలో ఉదాసీనత చూపుతోంది. ఎరువులు, పురుగు మందుల కంపెనీల అడుగులకు మడుగులు ఒత్తుతూ జీవన ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాల తయారీకి సహకరించడం లేదు. కోనసీమలో సాగుసమ్మె జరిగాక 2013లో కోనసీమలోని 13 మండలాలకు చెందిన సుమారు ఐదు వేల మంది రైతులకు ప్రభుత్వం రూ.కోటి విలువ చేసే జీవన ఎరువులను ఉచితంగా అందించింది. ఇది సత్ఫలితం ఇచ్చినా ఆయా కంపెనీల ఒత్తిడికి తలొగ్గి వీటి పంపిణీని పక్కనబెట్టింది. ఇప్పుడు కూడా రైతులకు అవసరమైన జీవన ఎరువులను అందకుండా చేసి పరోక్షంగా ప్రైవేట్ కంపెనీలకు వంత పాడుతోంది. ప్రభుత్వం కూడా కలిసి వస్తే ‘తూర్పు’న సేంద్రియ సాగు మరిన్ని వెలుగులు విరజిమ్ముతుంది.