వ్యర్థ పదార్థాలతో వర్మీ కంపోస్ట్
ఖర్చు తక్కువ..దిగుబడి ఎక్కువ
ఏడాదికి ఆరుసార్లు తయారు చేయవచ్చు
ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల ఎరువు ఉపయోగించాలి
పీలేరు: వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థా ల మీద ప్రయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయా రు చేసే ఎరువు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. వర్మీ కంపోస్టులో పోషక విలువ ఎక్కువ. పశువుల పెంటలో సరాసరి నత్రజని, భాస్వరం, పొటాష్, పోషకాలు వరుసగా 0.75, 0.55 శాతం ఉండగా వర్మీ కంపోస్టులో సరాసరి ఇవి 1.60, 5.04, 0.80 శాతం గా ఉంటాయి. వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకా లు పశువుల ఎరువు కన్నా దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయని పీలేరు మండల వ్యవసాయాధికారి షణ్ముగం(8886612565) తెలిపారు.
వర్మీ కంపోస్టుకు అవసరమైనవి
వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగపడుతాయి.
ఇతర అవసరాలు
వానపాములు ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కోసం తగిన నీడను కల్పించాలి. ఇం దుకు పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచు లు, పాలిథీన్ సంచులను ఉపయోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమేకాక ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవ చ్చు.
వర్మీ కంపోస్టు బెడ్‌లను తయారు చేయటం
భూమికి సమాంతరంగా 3 అడుగులు వెడల్పు ఉంటేటట్లు వర్మీ కంపోస్టు బెడ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్‌ల అడుగుబాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న బెడ్‌లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తువరకు వర్మీ కంపోస్టు చేయాలనుకుంటే కుళ్లుతున్న వ్యర్థ పదార్థాలను(చెత్త, ఆకులు, పేడ మున్నగున్నవి) వేయాలి. ఈ వ్యర్థ పాదార్థాలపైన 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడ వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడ వేసేటపుడు బెడ్‌పై నీరు చల్లాలి. ఇలా ఒక వారం వరకు నీరు అడపాదడపా చ ల్లుతుండాలి. వారం తరువాత పైన సూచించిన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటపుడు బెడ్‌ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటరుకు వెయ్యి వరకు వానపాములను వదలాలి. బెడ్‌పైన పాత గోనె సంచులు, వరిగడ్డి పర్చాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక కప్పలు, పక్షులు, చీమల నుంచి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్‌లపై ప్రతిరోజూ నీరు పలుచగా చల్లాలి.
బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి నాలుగైదు రోజుల ముందుగా నీరు చ ల్లటం ఆపివేయాలి. వానపాములు తేమను వెతుకుతూ లోపలికి వెల్లి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్‌పైన కప్పిన గోనె సంచులు, వరిగడ్డిని తీసివేయాలి. ఎరువును శంఖాకారంగా చిన్నచిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2-3 ఎమ్‌ఎమ్ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఎరువును తొలగించిన బెడ్‌లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తువరకు పరచి కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు.
ఎకారాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వాడవచ్చు
వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చె ట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి రెండు సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు.