నాస్డాక్లో వీడియోకాన్2హెచ్
ముంబై: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) సేవలందించే వీడియోకాన్2హెచ్ సంస్థ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్)ల ద్వారా 32.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఈ ఏడీఆర్ల జారీ కారణంగా మంగళవారం నుంచి నాస్డాక్లో వీడియోకాన్2హెచ్ ట్రేడింగ్ మొదలైంది. భారత్లో లిస్ట్ అవ్వాలన్న ప్రణాళికలను వాయిదా వేసిన ఈ కంపెనీ ఈ ఏడీఆర్ జారీ ద్వారా 115 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించామని పేర్కొంది. 2000 తర్వాత విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టైన తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ తమదేనని, 2007 తర్వాత అమెరికాలో అతి పెద్ద భారత ఐపీఓ ఇదేనని వివరించింది.