Videocon Telecommunication
-
ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మూడు వారాల వరకు వీడియోకాన్ టెలీ కమ్యూనికేషన్స్(వీటీఎల్) సర్దుబాటు స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలకు సంబధించిన రూ.1,300 కోట్ల చెల్లింపుకోసం భారతి ఎయిర్టెల్ అందించిన బ్యాంక్ గ్యారంటీలను వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మధ్యంతర ఉపశమనం కోసం ఈలోగా టెలికామ్ వివాదాల సెటిల్ మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీఎస్ఎటి)కు వెళ్లేందుకు ఎయిర్‌టెల్‌కు అనుమతి ఇచ్చింది. ఏజీఆర్ తీర్పును కోర్టు సమీక్షించదని ఈ సందర్భంగా మరోసారి సుప్రీంకోర్టు తెలిపింది. 2016లో ఎయిర్టెల్ వీడియోకాన్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. అయితే, ఈ కొనుగోలు సందర్భంగా వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలను కేంద్రం డిమాండ్ చేయకుండా భారతి ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్స్ శాఖ దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎస్ అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ నేడు(ఆగస్టు 24) విచారించింది. ఎయిర్టెల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ.. "వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలను వారంలోగా రూ.1,500 కోట్లకు చెల్లించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌కు డీఓటి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే అప్పుడు హామీ ఇచ్చిన ఎయిర్టెల్ బ్యాంకు నుంచి రికవరీ చేస్తామని డీఓటి తెలిపింది. ఒక టెలికామ్ కంపెనీ స్పెక్ట్రమ్ ఏజీఆర్ బకాయిలను ఆ కంపెనీ మాత్రమే భరించాలని కొనుగోలుదారుడు కాదు అని" అన్నారు. అందుకే వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలను ఎయిర్టెల్ నుంచి తిరిగి పొందలేరని పేర్కొన్నారు.(చదవండి: జోకర్ రీఎంట్రీ... జర జాగ్రత్త! క్షణాల్లో మీ ఖాతా ఖాళీ) -
ఈడీ ముందుకు చందా కొచర్
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా గతంలో ఆయన్ని ప్రశ్నించింది. వీడియోకాన్ గ్రూప్ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ పునర్వ్యవస్థీకరించడంలో ఆయన పాత్ర గురించి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు రూ.1,875 కోట్ల మేర రుణాలివ్వడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చందా కొచర్, దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఏడాది క్రితం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. చందా కొచర్ సహకారంతో ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకున్న ధూత్.. ప్రతిగా ఆమె భర్త దీపక్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. చందా కొచర్, దీపక్ కొచర్ల మంగళవారం మళ్లీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. -
ఎయిర్టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ స్పెక్ట్రమ్
డీల్ విలువ రూ.3,438 కోట్లు న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌కు చెందిన 4 జీ స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. ఎయిర్‌సెల్ కంపెనీకి 8 టెలికం సర్కిళ్లలో ఉన్న 4జీ స్పెక్ట్రమ్‌ను ఎయిర్టెల్ కంపెనీ రూ. 3,438 కోట్లకు కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఎయిర్‌సెల్ అనుబంధ సంస్థలైన డిష్‌నెట్ వెర్లైస్, ఎయిర్‌సెల్ సెల్యులర్ కంపెనీలకు ఎయిర్టెల్ కంపెనీ, తన అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నై కలసి), బిహార్, జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో-మొత్తం 8 టెలికం సర్కిళ్లలో ఎయిర్‌సెల్ 4జీ స్పెక్ట్రమ్ ఎయిర్టెల్ చేతికి వస్తుంది. దీంతో ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 4జీ సేవలందించే వీలు కలుగుతుంది. ఒక నెల కాలంలో ఎయిర్‌టెల్‌కు ఇది రెండో డీల్. భారతీ ఎయిర్టెల్ ఇటీవలనే వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స నుంచి ఆరు టెలికం సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రమ్‌ను రూ.4,428 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఎయిర్‌సెల్ నుంచి కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై ఎయిర్‌టెల్‌కు 2030, సెప్టెంబర్ 20 వరకూ హక్కులుంటాయి.