vidya Volunteer
-
దీన స్థితి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్ చేయాలని వేడుకుంది. నర్సంపేట రూరల్: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు పట్టించుకోలేదని ఆవేదన.. 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చితికిన జీవితం.. విద్యావలంటీర్ బలవన్మరణం
సాక్షి, నల్లగొండ క్రైం: ఆర్థిక ఇబ్బందులతో ఓ విద్యావలంటీర్ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో చోటుచేసుకుంది. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పాలకూరి శైలజ (30) భర్త అమరేందర్ సివిల్‌సప్లయ్ విభాగంలో అటెండర్‌గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. అతని ఉద్యోగం రెన్యువల్ కావాల్సి ఉండగా కాలేదు. దీంతో జీతం రావడం లేదు. శైలజ గతంలో విద్యావలంటీర్‌గా పని చేసేది. కరోనాతో ఏడాది కాలంగా పాఠశాలలు ప్రారంభం కాకపోవడంతో విధుల్లోకి తీసుకోలేదు. ఇద్దరికీ వేతనాలు రావడం లేదు. ఆర్థికంగా చితికిపోవడంతో కుటుంబ జీవనం గడవడం దుర్భరంగా మారింది. భర్త ఆవేదనను భరించలేక శైలజ నల్లగొండలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. శైలజది ప్రభుత్వ హత్యే.. హైదరాబాద్: విద్యా వలంటీర్ శైలజది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్ షర్మిలమ్మ అనుచరురాలు ఇందిరాశోభన్ ఆరోపించారు. లోటస్‌పాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిలమ్మ బృందంలోని నాయకుడు పిట్టా రాంరెడ్డితో కలసి ఆమె మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక నల్లగొండలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న పాలకూరి శైలజ మృతి పట్ల ఇందిర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆర్థిక ఇబ్బందులతో, తీవ్ర మనోవేదనకులోనై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తొడసం రామస్వామి అనే విద్యావలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేలమంది విద్యా వలంటీర్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడం, పెండింగ్ వేతనాలను చెల్లించకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం -
శభాష్ వలంటీర్!
సాక్షి, బద్వేలు అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థలోని వలంటీర్లు అందిస్తున్న సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బద్వేలు మున్సిపాలిటీలోని 23వ వార్డు సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ముండ్లపాటి వరకుమార్ అనే వలంటీర్ అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 31వ వార్డులోని సురేంద్రనగర్‌కు చెందిన రాచర్ల లక్ష్మిదేవి 111612177 ఐడితో వితంతు పింఛన్ తీసుకుంటోంది. అయితే ఆమె కుమారుడికి అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా చెన్నైలో ఉండి చికిత్స చేయించుకుంటోంది. నిబంధనల ప్రకారం వరుసగా మూడునెలలు పింఛన్ తీసుకోకుంటే హోల్డ్‌లో ఉంచుతారు. (చదవండి: అయ్యో పాపం: పింఛన్ కోసం వెళ్లి..) ఇది గమనించిన వలంటీర్ స్థానిక వార్డు ఇన్చార్జి యద్దారెడ్డితో చర్చించాడు. అసలే పేదరికంతో ఉన్న మహిళకు పింఛన్ రాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి చెన్నైకి వెళ్లి పింఛన్ అందించి రావాలని కోరాడు. దీంతో వలంటీర్ వరకుమార్ చెన్నైలోని ఆసుపత్రి వద్దకు వెళ్లి సదరు మహిళకు 3నెలల పింఛన్ అందించి తనలోని సేవా నిరతిని చాటుకున్నాడు. అసలే కష్టాల్లో ఉన్న తనకు సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి పింఛన్ అందించిన వలంటీర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది వరకుమార్‌ను అభినందించారు. -
విద్యావాలంటీర్పై ఉన్మాది ఘాతుకం
-
విద్యా వాలంటీర్లు ఎంపిక
యాలాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల నియామక పత్రాలను సోమవారం అందజేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఉర్దూమీడియం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వి.విల నియామకానికి సంబందించి ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. అభ్యర్థుల మెరిట్ లిస్టు ప్రకారం నియామకమైన వారికి ఎంపీపీ సాయన్నగౌడ్, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. మండలంలో మొత్తం 26 పోస్టులకు గాను సోమవారం 23 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
వచ్చే ఏడాది పూర్తి స్థాయి డీఎస్సీ
వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయి డీఎస్సీ ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. రైతు సమస్యలపై పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఇచ్చామని... ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ది కోసమే నిరసన వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ఏకీకృత సర్వీసు అంశంపై సుప్రింకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాతే స్పందిస్తామని వివరించారు. ఇక ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త విద్యావాలంటీర్ల రిపోర్టింగ్ తేదీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించామని తెలియజేశారు.