vidyut
-
ఎస్ఎస్ఏలో విద్యుత్ చౌర్యం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎవరైనా పేదవాళ్లు కరెంటును అక్రమంగా వాడుకుంటే వేలాది రూపాయలు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేసే విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కేంద్రంలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో యథేచ్చగా కరెంటును అక్రమంగా వాడుకుంటున్నా కనిపించడం లేదు. విద్యుత్‌నగర్ సర్కిల్లో ఉన్న ఎస్ఎస్ఏ కార్యాలయాన్ని ఇటీవల టీవీ టవర్ వెనుకకు మార్చారు. పీఓ చాంబర్, ఇంజినీరింగ్ విభాగానికి పక్కా కరెంటు ఉంది. అయితే ఎఫ్ఏఓ, జీసీడీఓ, సీఎంఓ, ప్లానింగ్ కోఆర్డినేటర్, ఐఈడీ కోఆర్డినేటర్, అకడమిక్ మానటరింగ్ అధికారి, అలెస్కో విభాగాల గదులతో పాటు సమావేశ హాలుకు కరెంట్ సదుపాయం లేదు. దీంతో అక్రమంగా కరెంటు తీగలకు కొక్కీలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అయితే కరెంటు కనెక్షన్ కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. వారి నుంచి ఇంకా అనుమతులు రాలేదు. కొక్కీలు తగిలించి.. తమదీ ప్రభుత్వ కార్యాలయమే కదా? ఏమవుతుందిలే అనుకున్నారో ఏమోకాని ఎంచక్కా విద్యుత్ తీగలకు కొక్కీలు తగిలించి కరెంటును వాడుకుంటున్నారు. ఇటీవల ఓరోజు అక్రమంగా కరెంట్ వాడుతున్న విభాగాలకు కరెంటు సరఫరా ఆగిపోయింది. ఒకరిద్దరు సిబ్బంది నేరుగా విద్యుత్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరారు. ఫలానా స్తంభం నంబరు చెప్పగానే అవతలి నుంచి గట్టిగా స్పందించడంతో కంగుతినడం వీరి వంతైంది. అనుమతి తీసుకోకుండా దొంగ కరెంటు ఎలా వాడుతున్నారంటూ విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పరిశీలించి జరిమానా వేస్తామని హెచ్చరించడంతో ఫోన్ కట్ చేయడం ఇవతలివారి వంతైంది. ఇదండీ ఎస్ఎస్ఏ కార్యాలయంలో విద్యుత్ చౌర్యం తీరు. అలా వాడడం తప్పే అనుమతి లేకుండా విద్యుత్ తీగలకు కొక్కీలు తగిలించి కరెంటు వాడుకోవడం తప్పే. కరెంటు సరఫరా లేకపోతే ఉన్న విభాగాల నుంచి తీసుకోవాలి తప్ప అలా నేరుగా కరెంటు స్తంభం నుంచి తీసుకోకూడదు. నేను కొత్తగా విధుల్లోకి వచ్చా. నాకు విషయం తెలీదు. మా సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. – సుబ్రహ్మణ్యం, పీఓ -
తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
-
13,357ఉద్యోగాల భర్తీ
- విద్యుత్ సంస్థలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ - కొత్త నియామకాలు.. భారీగా పదోన్నతులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఒకేసారి భారీ ఎత్తున రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. 2012 నుంచి ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి నియామకాలు చేపట్టాలని అధికారులను మంగళవారం సీఎం ఆదేశించారు. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిధిలో జూనియర్ లైన్మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 1,500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు పది వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా ఆదేశించారు. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో జేఎండీ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల పరిధిలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా దశల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన అనంతరం ఏర్పడే ఖాళీల్లో కొత్త ఉద్యోగుల నియామకం జరుపుతామన్నారు. కాగా, ఖాళీలను భర్తీ చేసుకోవడంతో పాటు విద్యుత్ రంగంలో రాష్ట్రం ఎంతో ముందుకు పోతోందని, ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, గృహావసరాలకు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. -
వ్యవసాయానికి 'కోత'లు రానివ్వం
గజ్వేల్: వేసవిలో వ్యవసాయానికి కరెంట్ కోతలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్, జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో కొత్తగా నిర్మించతలపెట్టిన 132/33 కేవీ, మరో ఏడు 33/11కేవీ సబ్స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యమే కారణమని, ఉత్తర, దక్షిణ విద్యుత్ గ్రిడ్‌లైన్‌ను తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎంత ధరకైనా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి వేదికగా వాడుకోవాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. సమస్యలపై చర్చ జరపడానికి అసెంబ్లీని ఎన్ని రోజులైనా పొడిగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. -
గడ్డం గీసిన మలైకా ఆరోరా ఖాన్!