Vigilance and Monitoring Committee
-
నిధులపై నిఘా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రంలో 16వ లోకసభ కొలువుదీరిన నేపథ్యం లో జిల్లాలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విడుదలయ్యే కేంద్ర ప్రభుత్వ నిధులపై ఈ కమిటీ నిఘా పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన పథకాలను ఈ కమిటీ పకడ్బందీగా పర్యవేక్షించనుంది. 15వ లోకసభ రద్దు చేయడం ద్వారా గతంలో ఉన్న విజిలెన్స్, మానిటరింగ్ కమిటీకి కాలం చెల్లిం ది. సార్వత్రిక ఎన్నికలు, ప్రభు త్వాల ఏర్పాటు, పదవీ ప్రమాణ స్వీకారాలు పూర్తయి పాలన ఊపందుకుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒక్కొక్కటిగా అధికారిక కార్యక్రమాలు, క మిటీల పునరుద్ధరణ జరగుతోంది. సభ్యుల నియామకం జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవలే ఆదేశించింది. స్పందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కమిటీలను ఖరా రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మన జిల్లా కమిటీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చైర్‌పర్సన్‌గా నియమితుల య్యారు. కో-చైర్మన్‌గా జహీరాబాద్ ఎంపీ భీంరావు బస్వంత్ రావు పాటిల్ వ్యవహరించనున్నారు. కలెక్టర్ రోనాల్‌రోస్ గౌర వ సభ్యులుగా ఉంటారు. శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, గంప గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేము ల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్ సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి తది తరులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, సీఈఓ రాజారాం, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు, త పాలశాఖ సీనియర్ సూపరింటెం డెంట్‌తోపాటు, జిల్లాలోని 36 మం ది ఎంపీపీలు సైతం ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే కమిటీ పని చేస్తుంది. -
తూతూమంత్రంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారం.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వ్యయం చేస్తుండటంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్రమాలు.. లొసుగులపై చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆరు నెలలకోసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభాసుపాలవుతోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కమిటీ సభ్యులైన జిల్లా మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. అయితే వీరంతా గైర్హాజరయ్యారు. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చ జరగాల్సిందిపోయి నామమాత్రంగా ముగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు మాత్రమే హాజరవగా.. నిధుల వినియోగంలో అక్రమాలను ఎండగట్టారు. ఇదిలాఉండగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంతో పాటు డీఆర్డీఏ పాలక వర్గ సమావేశం కూడా సోమవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పట్టకపోవటంతో రెండింటినీ కలిపి ఒకే సమావేశంలో కానిచ్చేశారు. అతి ముఖ్యమైన తొమ్మిది ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇందులో డీఆర్డీఏ, డ్వామా, ఐఏవై గృహా లు, ఆర్‌డబ్ల్యుఎస్, ఐసీడీఎస్, పీఎంజీఎస్‌వై రోడ్ల నాణ్యత, అటవీశాఖ కార్యక్రమాలు, భూమి హక్కులు, ల్యాండ్ సర్వే అమలు, 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల వినియోగంపై ప్రముఖంగా చర్చ చేపట్టాలి. మంత్రులెవరూ హాజరు కాకపోవడంతో అక్రమాలపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దృష్టి సారించలేకపోయింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే కీలకమైన అంశాలను లేవనెత్తారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు.. డీఆర్డీఏ, డ్వామా, గృహ నిర్మాణాలు, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను నిలదీశారు. అదే విధంగా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సైతం ప్రభుత్వ నిధుల వినియోగంపై చర్చ లేవనెత్తారు. ఏదేమైనా 14 నియోజక వర్గాల పరిధిలో పేరుకుపోయిన సమస్యలు, వాటి పరిష్కారానికి డిమాండ్ చేయాల్సిన అమాత్యులు, శాసనసభ్యులకు చర్చలో పాల్గొనే తీరిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పనేమిటని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఫిర్యాదు చేయటానికి వచ్చిన పలు గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయమై శోభా నాగిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అట్రాసిటీ కేసుల్లో అందని సత్వర న్యాయం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసుల్లో సత్వర న్యా యం జరగక పోగా కేసు నమోదు సమయంలోనే బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాల్లో కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, బాధితుల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ అనేక అట్రాసిటీ కేసులు పెండింగులో ఉంటున్నాయన్నారు. కేసులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందని కమిటీ సభ్యుడు ధనరాశి శ్యాం సుందర్ అన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందడంలేదన్నారు. పెదపూడి మండలం కరకుదురులో ఆక్రమణలో ఉన్న14.55 ఎకరాల అసైన్డ్ భూమి విషయమై మూడుసార్లు కమిటీ సమావేశాల్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా నాయకులు చెంగళరావు, అప్పారావు అన్నారు. 1976లో 27మంది ఎస్సీలకు పట్టాలు ఇచ్చి స్వాధీనం చేసిన ఈ భూమిని అగ్రవర్ణ వ్యక్తి ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ భూమిని లబ్ధిదారులకు స్వాధీనపరిచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సిరి, అదనపు వైద్యాధికారి పవన్‌కుమార్ పాల్గొన్నారు.