vijay singhania
-
మార్కెట్లకు ‘ఫెడ్’ డైరెక్షన్
♦ 25–26 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ భేటీ ♦ 27న డెరివేటివ్స్ ముగింపు ♦ కంపెనీల ఫలితాలు,లిక్విడిటీ కీలకం ♦ స్టాక్ వారీ కదలికలు, కన్సాలిడేషన్‌కు అవకాశం ♦ ప్రతికూలతలు లేకుంటే ముందుకే ♦ విశ్లేషకుల అంచనాలు న్యూఢిల్లీ: ఈ వారం పలు కీలక అంశాలకు వేదిక కానుంది. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ సమావేశం బుధవారం జరగనుండగా, జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారంతో గడువు తీరిపోనుంది. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. అధిక వోలటాలిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, వచ్చే నెల ఫ్యూచర్స్‌కు రోలోవర్ ఏ మేర ఉంటుందన్నవి మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించే అంశాలుగా ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయపడ్డారు. బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుందని చెప్పారు. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి, ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిక్ బ్యాంకు, తదితర బ్లూచిప్ కంపెనీలు జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కీలక అంశాల నేపథ్యంలో మార్కెట్లలో అధిక అస్థిరత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలు అంత ఆశాజనకంగా ఏమీ లేవన్నారు. తేడా వస్తే రివర్స్ ‘‘అధిక లిక్విడిటీకితోడు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలతో మార్కెట్లు అధిక స్థాయికి చేరాయి. అధిక స్థాయిల దిశగా సెంటిమెంట్ నెలకొని ఉంది. అదే సమయంలో ఉన్నట్టుండి మార్కెట్లు తిరుగుముఖం పట్టే రిస్క్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఏవైనా ప్రతికూల పరిణామాలు ఎదురైతే అది మన మార్కెట్లపై పడుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీద్ మోదీ చెప్పారు. 25–26 నాటి ఫెడ్ సమావేశం నుంచి ఏవైనా ఊహించని నిర్ణయాలు వెలువడతాయా అన్న ఆసక్తి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ వారీగా కదలికలతోపాటు మార్కెట్లలో కన్సాలిడేషన్ ఉంటుందని అధిక శాతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం రిజల్ట్స్ సోమవారం (24న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి. 25న భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు... ఈ నెల 26న యస్ బ్యాంక్, 27న డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు, 28న ఎల్ అండ్ టీ కంపెనీలు జూన్ త్రైమాసికపు ఫలితాలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే సోమవారం జపాన్, అమెరికా తయారీ రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 26న అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుండగా, ఈ వారంలోనే చమురు ఉత్పాదక దేశాల సమాఖ్య ఓపెక్ సమావేశం కూడా జరగనున్నది. జూలైలో విదేశీ ఇన్వెస్టర్ల దూకుడు దేశీయ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) దూకుడు కొనసాగుతోంది. క్యాపిటల్ మార్కెట్లలో జూలైలో 2.4 బిలియన్డాలర్ల (రూ.15,348 కోట్ల మేర) పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు విదేశీయులు చేసిన పెట్టుబడులు 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,60,000 కోట్లు) దాటేశాయి. జనవరి నెలలో రూ.3,496 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్ల పట్ల సానుకూలంగానే కొనసాగుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జూలై 3–21 తేదీల మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ.2,977 కోట్ల మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.12,371 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
ఒడిదుడుకుల వారం..!
మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వారంలో వచ్చే టాటా మోటార్స్, ఐటీసీ, సన్ ఫార్మా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలని వారంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా పరిణామాల ప్రభావం.. మన స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వారంలో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. ఈ గురువారం (ఈ నెల 25న) ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు ఎక్స్పైరీ అవుతాయని, మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి పెరగడంతో అమెరికా మార్కెట్, ఇతర ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయని వివరించారు. కంపెనీల ఫలితాల సీజన్ కొనసాగుతోందని, అందరి కళ్లు ఈ వారంలో ఫలితాలను వెల్లడించే కంపెనీలపై ఉంటుందని తెలిపారు. కరెక్షన్ తర్వాత దూకుడు... సమీప భవిష్యత్తులో మార్కెట్లో కరెక్షన్ వుండవచ్చని, అటుతర్వాత దూకుడు కొనసాగవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు. గత కొన్ని సెషన్లుగా అమెరికాలోనూ, మన స్టాక్ మార్కెట్లోనూ ర్యాలీ కొనసాగుతోందని, ఈ వారంలో కన్సాలిడేషన్‌కు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన వి.కె. శర్మ పేర్కొన్నారు. లాభాల స్వీకరణకు ఆస్కారం.. ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు ఈ వారంలో ముగియనున్నందున, లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ ఎనలిస్ట్ ఫోరమ్ పరేఖ్ చెప్పారు. భారీ పన్ను సంస్కరణల్లో ఒకటైన జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైందని, జీఎస్టీ రేట్లు ఖరారైన నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడుతుందని యెస్ సెక్యూరిటీస్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల విషయంలో ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్, బొగ్గును ఉపయోగించే లోహ కంపెనీలు, డెయిరీ కంపెనీలు లాభపడతాయని వివరించారు. కీలక కంపెనీల ఫలితాలు నేడు(ఈ నెల 22న) గెయిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీలు తమ గత ఆర్థిక సంవత్సరం, క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 23న) టాటా మోటార్స్, ఓల్టాస్, సెంట్రల్ బ్యాంక్, జిందాల్ స్టీల్ కంపెనీలు, బుధవారం(ఈ నెల 24న) అదానీ ఎంటర్ప్రైజెస్, లుపిన్, గురువారం(ఈ నెల 25న) బాష్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, శుక్రవారం (ఈ నెల26న) ఐటీసీ, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, మహానగర్ గ్యాస్, ఎన్బీసీసీ, దివీస్ ల్యాబ్స్ తమ తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. వెలుగులో జీఎస్టీ షేర్లు జీఎస్టీ మండలి వివిధ సేవలపై పన్ను రేట్లను ఖరారు చేసిన నేపథ్యంలో హాస్పిటాలిటీ చెయిన్స్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి వినోద సంబంధ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. జీఎస్టీ రేట్లు విమానయాన సంస్థలపై సానుకూల ప్రభావం చూపుతాయని జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు వెలుగులో ఉంటాయని నిపుణులంటున్నారు. టెలికం సేవలుపై పన్ను రేట్లను 18 శాతంగా(గతంలో 15 శాతంగా) నిర్ణయించిన నేపథ్యంలో టెలికం షేర్లపై ఒత్తిడి ఉంటుందని అంచనా. కాగా ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటిదాకా 266 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో అధిక భాగం డెట్ మార్కెట్లోకి రావడం విశేషం. రూపాయి నిలకడగా ఉండటమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్లో రూ.4.157 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.12,941 కోట్ల చొప్పున వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.17,099 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ కాలానికి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.94,900 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దీంతో మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ. 1 లక్ష కోట్లకు మించాయి. -
కొత్త శిఖరాలకు మార్కెట్..!
బీజేపీ భారీ విజయంతో జోష్.. ►నేడు మార్కెట్‌కు హోలీ సెలవు ►మరింత వేగంగా సంస్కరణలు ►ఫెడ్ నిర్ణయంతో కరెక్షన్ ! ►ఈ వారం మార్కెట్ తీరుపై విశ్లేషకుల అంచనా న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో స్టాక్ మార్కెట్ పండుగ చేసుకోనున్నదని విశ్లేషకులంటున్నారు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు రానున్నాయనే అంచనాలతో స్టాక్ సూచీలు రికార్డ్ స్థాయిలను తాకనున్నాయని వారంటున్నారు. హోలీ కారణంగా నేడు(సోమవారం) మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కానున్నది. అయినప్పటికీ, రానున్న రోజుల్లో బలమైన ర్యాలీ చోటు చేసుకోగలదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరింత బలంగా ఇన్వెస్టర్ల విశ్వాసం.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంతో మార్కెట్ కొత్త జోన్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. ఈ విజయంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతుందని, మరిన్ని ఆర్థిక సంస్కరణలకు మోదీ ముందుకు వస్తారని పేర్కొన్నారు. జనాభా పరంగా దేశంలో అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు 2019 నాటి సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటివని అందరూ పరిగణించారని వివరించారు. ఈ విజయంతో ఎన్డీఏ మరింత పటిష్టంగా తయారైందని, ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల విశ్వాసం మరింత బలపడిందని సెంట్రమ్ బ్రోకింగ్ ఈడీ, సీఈఓ కె. సందీప్ నాయక్ చెప్పారు. సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ సానుకూలంగా సాగుతుందని, మార్కెట్ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిని తాకుతుందని పేర్కొన్నారు. 2015, మార్చి 4న బీఎస్ఈ సెన్సెక్స్ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్లను తాకాయి. ఇవే ఇప్పటిదాకా ఈ స్టాక్ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. నిఫ్టీ బ్రేక్ అవుట్.. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణల దూకుడును పెంచుతారని ప్రభుదాస్ లీలాధర్ సీఈఓ అజయ్ బోడ్కే వ్యాఖ్యానించారు. ఈ విజయం స్టాక్ మార్కెట్‌కు ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయంతో సంస్కరణలు మరింత వేగాన్ని పుంజుకుంటాయని, అన్ని రంగాల్లో వృద్ధి వెల్లివిరుస్తుందని శామ్కో సెక్యూరిటీస్ జిమీత్ మోడీ పేర్కొన్నారు. ఈ వారంలో నిఫ్టీ కొత్త శిఖరాలకు చేరుతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార సుధాంశు చెప్పారు. ఇక వారం మంగళవారం వెలువడే ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండనున్నది. రెండు వారాల కన్సాలిడేషన్ తర్వాత ఈ మంగళవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ కానున్నదని విశ్లేషకులంటున్నారు. ఆ రోజు 9,119 పాయింట్ల నిఫ్టీ ఇంట్రా డే రికార్డ్ బద్దలయ్యే అవకాశాలున్నాయని వారంటున్నారు. జనవరిలో పారిశ్రామికోత్పత్తి 2.7 శాతం పెరగడం కూడా సానుకూల ప్రభావం చూపించనున్నది. ఇక ఈ నెల 16న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా కీలకం కానున్నది. ర్యాలీ తర్వాత కరెక్షన్..: ఈ వారంలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలోనే వడ్డీరేట్లు పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు బలం పుంజు కుంటున్నాయని సింఘానియా వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్లు పెరిగితే భారత్ వంటి వర్ధమాన దేశాలపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ర్యాలీ తర్వాత కొంత కరెక్షన్ చోటు చేసుకోవచ్చని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు అంచనాలు బలంగా ఉండడమే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ విజయాన్ని మార్కెట్ అంచనా వేసిందని, ఇది గత శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. మంగళవారం స్టాక్ సూచీలు మంచి జోరునే చూపిస్తాయని, అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్‌తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంక్‌లు తీసుకునే ద్రవ్య విధాన నిర్ణయాలపైననే ఈ జోరు కొనసాగే అవకాశాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. కాగా గత వారంలో బీఎస్ఈ సెన్సక్స్ 114 పాయింట్లు లాభపడి 28,946 పాయింట్ల వద్ద, ఎన్ఎన్సీ నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 8,935 పాయింట్ల వద్ద ముగిశాయి. రూ.10,288 కోట్ల విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.10,288 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఈ ట్రెండ్ మరింతగా కొనసాగుతుందని అంచనాలున్నాయి. -
ఒడిదుడుకుల వారం..
♦ ఈ నెల 29న డెరివేటివ్స్ ముగింపు ♦ వచ్చే వారంలో ఆర్బీఐ పాలసీ ♦ వడ్డీరేట్ల ప్రభావిత షేర్లపై ఇన్వెస్టర్ల చూపు న్యూఢిల్లీ: డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. తక్షణ ప్రధాన సంఘటనలేవీ లేనందున అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెం బర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 29) ముగుస్తాయని, దీంతో మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఎఫ్ అండ్ ఓ సెప్టెంబర్ కాంట్రాక్టులు ముగియనున్నందున ఈ వారంలో సాధారణం కంటే అధికంగానే ఒడిదుడుకులుంటాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. వచ్చే వారంలో ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత రంగ షేర్లలో లావాదేవీల జోరు ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ పెట్టుబడుల జోరు ఈ వారంలో స్టాక్ మార్కెట్‌ను నిర్దేశిస్తాయని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ పేర్కొన్నారు. పతనానికి బ్రేక్! అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, వర్షపాత గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. వచ్చే వారంలో అల్జీరియాలో ఇంధన సమావేశం జరగనున్న నేపథ్యంలో చమురు ధరల్లో కూడా ఒడిదుడుకులుంటాయని వివరించారు. సరఫరాల జోరును నియంత్రించి ధరల పతనాన్ని నిరోధించే ప్రణాళికను ఈ ఇంధన సమావేశం రూపొందించగలదన్న అంచనాలు బాగా ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్య విధాన కమిటీ(మోనేటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ)లో కొత్తగా ముగ్గురు సభ్యుల నియామకం కారణంగా వచ్చే నెల నాలుగున జరిగే ఆర్బీఐ పాలసీ ఎలా ఉండనున్నదోనని మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు. జీఎస్టీ సమావేశం, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం, తదితర ఇటీవల పరిణామాలు మార్కెట్ పతనాన్ని కొంత మేర నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ ద్రవ్య విధానాలపై వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల అభిప్రాయాలపై ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. బ్యాంక్ షేర్లపై ఫోకస్ స్టాక్ సూచీల గమనాన్ని విదేశీ పెట్టుబడులు నిర్దేశిస్తాయని ట్రేడ్‌బుల్స్ సీఈఓ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. వచ్చే వారం ఆర్బీఐ పాలసీ ఉన్నందున బ్యాంక్ షేర్లు వెలుగులో ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఉంటుందని, ఫలితంగా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికాలో ఆగస్టు నెలకు సంబంధించి కొత్త ఇళ్ల గణాంకాలు సోమవారం(ఈ నెల 26న), వినియోగదారుల విశ్వాస గణాంకాలు మంగళవారం(ఈ నెల 27న), రెండో క్వార్టర్ అమెరికా జీడీపీ గణాంకాలు గురువారం(29న), ఇంగ్లండ్ క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 30న) వెలువడతాయి. మరింత జోరుగా విదేశీ పెట్టుబడులు.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈనెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.5,643 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.3,905 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడులు రూ.9,549 కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ అమలు సంబంధిత చర్యలు వేగంగా జరుగుతుండడం, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం, వంటి సానుకూలాంశాలు దీనికి కారణాలు. కార్పొరేట్ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అనుమతించడంతో ఈ జోరు మరికొన్ని వారాలు కొనసాగవచ్చని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.46,493 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్ నుంచి రూ.3,442 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి వీరి నికర పెట్టుబడులు రూ.43,051 కోట్లుగా ఉన్నాయి.