vijaya dairy milk
-
250 కోట్ల వ్యయంతో పాడి పరిశ్రమ అభివృద్ది
సాక్షి, విజయవాడ : ఏపీలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తులు ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు తన సొంత డెయిరీ కోసం పాడిపరిశ్రమ, సహకార డెయిరీల వ్యవస్ధని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో విజయ తెలంగాణా పాల ఉత్పత్తుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. సహకార డెయిరీలలో సిఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఏపీలో రైతులకి, మహిళలకి అండగా ఉండే విధంగా అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. (ఏపీ ప్రభుత్వానికి బిగ్ థాంక్యూ: మహేష్ బాబు) ఫ్లిప్ కార్ట్, అమెజాన్లతో కూడా టై అప్ అయ్యి ఈ- కామర్స్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మబోతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. విజయ తెలంగాణా పాల ఉత్పత్తుల నాణ్యతకి దేశవ్యాప్తంగా పేరుందని, దీన్ని మరింత అభివృద్ది చేసేందుకు 250కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పాడిపరిశ్రమపై దేశంలో కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పాల రైతులకి తెలంగాణాలో లీటర్‌కి నాలుగు రూపాయిలు ఇన్సెంటివ్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో 1962 కాల్ చేస్తే పశువులకి వైద్యం అందించేందుకు వంద అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని, 2.13 లక్షల మంది రైతులకి 50 శాతం రాయితీపై పశువులు ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో పాడి పరిశ్రమ అభివృద్దిని చేస్తూ రైతులకి అండగా ఉండటంపై వైఎస్ జగన్‌కి అభినందలు తెలియజేస్తున్నామని మంత్రి తలసాని అన్నారు. ( ఏపీ: సంక్రాంతికి 3607 ప్రత్యేక బస్సులు ) -
విజయ పాల విక్రయాలు ఢమాల్
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో విజయ పాల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఏడాది కింద విక్రయాలు 3.80 లక్షల లీటర్లుకాగా.. ఇప్పుడు 2.30 లక్షల లీటర్లకు తగ్గిపోయాయి. ఏకంగా లక్షన్నర లీటర్లు (సుమారు 40 శాతం) తగ్గిపోవడం గమనార్హం. దీంతో సంస్థ టర్నోవర్‌లో రూ.240 కోట్లు తగ్గిందని విజయ డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి 3.80 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకు పాల విక్రయాలను పెంచుతామంటూ విజయ డెయిరీ అధికార యంత్రంగా సంస్కరణలకు తెరలేపింది. కానీ ఉన్న విక్రయాలే తగ్గిపోతు న్నాయని.. చివరికి డెయిరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కుట్రలు జరుగుతున్నాయని సంస్థ ఉద్యోగులే ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. తగ్గిన లక్షన్నర లీటర్ల విక్రయాలను తిరిగి పూడ్చుకోవడం అంత సులువైన విషయం కాదని పేర్కొంటున్నారు. ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో.. దాదాపు 40 ఏళ్లుగా విజయ డెయిరీ నుంచి వినియోగదా రులకు పాల సరఫరా, బిల్లులు వసూళ్లను ఏజెంట్లే చేసిపెడుతున్నారు. తద్వారా వచ్చే కమీషన్‌తో జీవనం సాగిస్తు న్నారు. ఒక్కో ఏజెంటు నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. ఇక రాష్ట్రంలో విజయ డెయిరీకి ఎక్కువగా పాల విక్రయాలు హైదరాబాద్‌లోనే జరుగుతుంటా యి. ఇక్కడ 1,650 మంది ఏజెంట్లు పాలను సరఫరా చేస్తుండేవారు. కానీ విజయ డెయిరీ అధికార యంత్రాంగం వెనుకా ముందు ఆలోచించకుండా ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసింది. వారి స్థానంలో 112 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగ దారుల సమస్యలు పరిష్కరించడం కోసం హైదరాబాద్‌లో 18 జోన్ కార్యాలయాలు ఉండేవని, వాటిని రద్దు చేశారని డెయిరీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా డిస్ట్రిబ్యూట ర్ల చేతుల్లోనే పాల విక్రయాలు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక గతంలో ఏజెంట్లకు లీటరు పాలకు రూ.2.50 చొప్పున కమీషన్‌గా ఇచ్చేవారు. రవాణాకు అయ్యే ఖర్చు కింద డెయిరీ 70 పైసలు చెల్లించేది. అదే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ను ఏకంగా రూ.3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. అడ్వాన్స్ కార్డులూ డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే.. విజయ పాల కొనుగోలు కోసం వినియోగదారులకు అందజేసే అడ్వాన్స్ కార్డులను అక్టోబర్ నుంచి రద్దు చేయాలని విజయ డెయిరీ భావించింది. కానీ దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించారు. అడ్వాన్స్ కార్డుల ద్వారా విజయ డెయిరీకి నికరంగా 1.30 లక్షల లీటర్ల విక్రయాలు జరిగేవి. ముందస్తుగానే రూ.18 కోట్ల సొమ్ము జమ అయ్యేది. పైగా వినియోగదారులకు లీటరుకు రూ.1.20 రాయితీ వచ్చేది. ఇప్పుడు అడ్వాన్స్ కార్డులను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించి ఆ రాయితీని 60 పైసలకు కుదించారు. పైగా గతంలో అడ్వాన్స్ కార్డులను విజయ డెయిరీ నేరుగా ఈ–సేవ, టీఎస్ ఆన్లైన్ ద్వారా అందజేసేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే పెట్టడంతో అడ్వాన్స్ సొమ్ము రూ.18 కోట్లు ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి వెళ్లినట్లయింది. పైగా అడ్వాన్స్ కార్డులు ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. కార్డులు ఇచ్చామని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు రాయితీని మింగేసే అవకాశముందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా విజయ డెయిరీ ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి వెళ్లిపోతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పైగా కీలక ప్రజాప్రతినిధులు తమ అనుచరులైన కొందరు డిస్ట్రిబ్యూటర్లను నియమించుకున్నారని.. దీంతో పెత్తనం పెరిగి విజయ డెయిరీని దెబ్బతీస్తుందన్న సందేహాలు వస్తున్నాయి. పాల విక్రయాలు తగ్గిన మాట వాస్తవమే.. ‘‘ఇటీవల విజయ డెయిరీ పాల విక్రయాలు తగ్గిపోయిన మాట వాస్తవమే. ఇది తాత్కాలికమే. విజయ డెయిరీని గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేయక తప్పడం లేదు. ఇందులో భాగంగానే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనివల్ల విజయ డెయిరీ విస్తరిస్తుంది. ఇలాంటి విషయాలపై కాస్త వ్యతిరేకత రావడం సహజమే..’’ – సురేశ్ చందా, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
పాల ప్రోత్సాహకానికి పరిమితి!
-
పాల ప్రోత్సాహకానికి పరిమితి!
► 25 లీటర్ల లోపు పాలు పోసే రైతులకే వర్తింప చేయాలని నిర్ణయం? ► మిగతా రైతులకు రూ.4 ప్రోత్సాహకం నిలుపుదల ► ఈ విధానం అమలైతే 79,568 మందికే లబ్ధి ► సరికాదంటున్న డెయిరీ సంఘాలు సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తోన్న ప్రోత్సాహకానికి రాష్ట్ర సర్కారు సీలింగ్ పద్ధతిని ఖరారు చేసినట్లు తెలిసింది. ఒకటి నుంచి 25 లీటర్ల వరకు పాలు పోసే రైతులకు మాత్రమే ప్రోత్సాహక సొమ్ము చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. 25 లీటర్లకు పైబడి పాలు పోసే రైతులకు ప్రోత్సాహక సొమ్మును నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతేడాది నవంబర్ నుంచి ప్రభుత్వం విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సన్న, చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు, కొందరు వ్యాపారులు కూడా ప్రోత్సాహక సొమ్ము పొందుతున్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం దీనిపై ఆరా తీసింది. చివరకు 25 లీటర్ల సీలింగ్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన జారీ కావాల్సి ఉంది. ఇదీ పాల లెక్క.. ప్రస్తుతం రాష్ట్రంలో 81 వేల మంది రైతులు ప్రభుత్వం ఇచ్చే రూ.4 ప్రోత్సాహక సొమ్ము తీసుకొని పాలు పోస్తున్నారు. వారిలో 5 లీటర్ల లోపు పాలు పోసే రైతులు 55,853 మంది, 5 నుంచి 10 లీటర్లు పోసే రైతులు 14,127 మంది, 10 నుంచి 15 లీటర్లు పోసే రైతులు 5,761 మంది, 15 నుంచి 20 లీటర్లు పోసే రైతులు 2,699 మంది, 20 నుంచి 25 లీటర్లు పోసే రైతులు 1,128 మంది, 25 నుంచి 50 లీటర్లు పోసే రైతులు 1,259 మంది, 100 లీటర్ల కన్నా ఎక్కువ పాలు పోస్తున్నవారు 100 మందిదాకా ఉన్నారు. వీరిలో 25 లీటర్ల లోపు పాలు పోసేవారు 79,568 మంది ఉన్నట్టు తెలిసింది. వారికే ప్రోత్సాహకం అందించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం కూడా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్థికభారం తగ్గించుకునేందుకేనా? గతేడాది నవంబర్ 1 నుంచి ప్రభుత్వం పాడి రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహంగా అందిస్తోంది. ఈ లెక్కన లీటరుకు రూ.28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలు కాకముందు విజయ డెయిరీ గత ఏడాది అక్టోబర్‌లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వు అమలు ప్రారంభమైన గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. సర్కారు అంచనాలకు మించి సేకరణ పెరిగింది. అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహక సొమ్మును సక్రమంగానే అందించిన విజయ డెయిరీ నవంబర్ రెండో వారం నుంచి ఇప్పటివరకు రైతులకు బిల్లు సొమ్మును నిలిపేసింది. వీరితోపాటు 10 ప్రైవేటు డెయిరీలకూ చెల్లింపులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారం పెరగడంతో సీలింగ్‌పై నిర్ణయం తీసుకుంది. దీంతో నిజమైన రైతులు కూడా అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందని డెయిరీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం డెయిరీ ఫారాలకు ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం సమంజసం కాదని ఆదర్శ పాల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. ఇంకా నిర్ణయం కాలేదు : పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా పాల ప్రోత్సాహకానికి సంబంధించి సీలింగ్‌పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి చెప్పారు. ప్రోత్సాహక సొమ్ము తీసుకుంటున్న రైతులు ఎందరన్న లెక్కలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.