సాక్షి, విజయవాడ : ఏపీలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తులు ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు తన సొంత డెయిరీ కోసం పాడిపరిశ్రమ, సహకార డెయిరీల వ్యవస్ధని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో విజయ తెలంగాణా పాల ఉత్పత్తుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. సహకార డెయిరీలలో సిఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఏపీలో రైతులకి, మహిళలకి అండగా ఉండే విధంగా అమూల్తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. (ఏపీ ప్రభుత్వానికి బిగ్ థాంక్యూ: మహేష్ బాబు)
ఫ్లిప్ కార్ట్, అమెజాన్లతో కూడా టై అప్ అయ్యి ఈ- కామర్స్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మబోతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. విజయ తెలంగాణా పాల ఉత్పత్తుల నాణ్యతకి దేశవ్యాప్తంగా పేరుందని, దీన్ని మరింత అభివృద్ది చేసేందుకు 250కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పాడిపరిశ్రమపై దేశంలో కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పాల రైతులకి తెలంగాణాలో లీటర్కి నాలుగు రూపాయిలు ఇన్సెంటివ్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో 1962 కాల్ చేస్తే పశువులకి వైద్యం అందించేందుకు వంద అంబులెన్స్లు ఏర్పాటు చేశామని, 2.13 లక్షల మంది రైతులకి 50 శాతం రాయితీపై పశువులు ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో పాడి పరిశ్రమ అభివృద్దిని చేస్తూ రైతులకి అండగా ఉండటంపై వైఎస్ జగన్‌కి అభినందలు తెలియజేస్తున్నామని మంత్రి తలసాని అన్నారు. ( ఏపీ: సంక్రాంతికి 3607 ప్రత్యేక బస్సులు )
Comments
Please login to add a commentAdd a comment