Vijayamohan
-
పకడ్బందీగా ఉపఎన్నిక
కర్నూలు(అగ్రికల్చర్): ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. మంగళవారం సాయంత్రం శాంతిభద్రతలు, బందోబస్తు ప్లాన్‌పై పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ యంత్రాంగంతో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. ఎన్నికలు ఆళ్లగడ్డ నియోజకవర్గానికే పరిమితమైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మాత్రం జిల్లా అంతటా ఉంటుందని చెప్పారు. మద్యం షాపులపై పూర్తిగా నియంత్రణ ఉండాలన్నారు. బెల్టు షాపులను సమూలంగా అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం చూపవద్దన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ పూర్తిస్థాయిలో అదుపులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని.. లెసైన్స్ కలిగిన తుపాకులను సంబంధిత పోలీస్స్టేషన్లలో సరెండర్ చేయించాలన్నారు. ఎవరూ ఆయుధాలను కలిగి ఉండరాదని పేర్కొన్నారు. క్రిటికల్ పోలింగ్ బూత్‌లు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై తగిన నిఘా ఉండాలని, కులమతాలను రెచ్చగొట్టే శక్తులను కనిపెట్టాలని అధికారులకు చెప్పారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అవసరమైన చర్యలను తీసుకుంటుందని తెలిపారు. బెల్టు షాపులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 100కి ఫోన్ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడు, ఆళ్లగడ్డ రిటర్నింగ్ అధికాారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చేరిన వ్యయ పరిశీలకుడు కర్నూలు(అగ్రికల్చర్) : ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ప్రక్రియ మొదలు కావడంతో ఎన్నికల కమిషన్ నియమించిన వ్యయ పరిశీలకులు చవాన్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో సమావేశమై ఆళ్లగడ్డ నియోజకవర్గంపై చర్చించారు. తర్వాత ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆయన వెంట అసిస్టెంట్ వ్యయ పరిశీలకుడు సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఏర్పాట్లను వేగవంతం చేయండి కర్నూలు(అగ్రికల్చర్): ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్ అధికారులకు ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల మెటీరియల్‌తో ఆర్టీసీ బస్సుల్లోనే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ ఉప ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్లు మొదలుకొని ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు నోడల్ అధికారులు తమకు అప్పగించిన పనులను జవాబుదారీ తనంతో, ఎక్కడ ఏ చిన్న పొరపాట్లకు తావు లేకుండా పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ రోజు 25 రూట్లను 25 బస్సులు అవసరమవుతాయని, వీటితో పాటు ఎన్నికల పరిశీలకులకు, రూట్ ఆఫీసర్లకు, మరో 25 వాహనాలను సిద్ధం చేయాలని ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది, మైకో పరిశీలకులు, ఇతర పోలింగ్ అధికారులకు ఈనెల 19న శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని శిక్షణ నోడల్ అధికారి జేడీఏను ఆదేశించారు. ప్రతి ఓటరుతో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ఈవీఎంలు మొరాయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల మీడియా సెంటర్లో టీవీ ఏర్పాటు చేసుకుని ఇంగ్లిషు, తెలుగు ఛానల్స్ ద్వారా తాజా ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు విడుదల చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్ గౌడు, డీఈఓ నాగేశ్వరరావు, జేడీఏ ఠాగూర్ నాయక్, సీపీఓ ఆనంద్ నాయక్, డీటీసీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ఆళ్లగడ్డ: ఎన్నికల విధుల్లో బీఎల్ఓల పాత్ర కీలకమని.. అందులో నిర్లక్ష్యం విహ ంచినా..పక్షపాతం చూపినా చర్యలు తప్పవని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం బీఎల్ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఓటరు పేరు ఓట్ల జాబితాలో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. డెత్ రిజిష్టర్ చూసి చనిపోయిన వారి పేర్లు తొలగించాలన్నారు. ఓటరు నమోదుకు ఈనెల 11 వతేదీ వరకు వచ్చిన అర్జీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే పోలింగ్ బూత్ పరిధిలో ఒకేసారి ఎక్కువ ఓట్లు పెరిగినా, తగ్గినా ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించాలని ఆదేశించారు. ఓట్ల స్లిప్‌లు పంచలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలింగ్ రోజున ప్రతి బీఎల్ఓ ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. వీఆర్వోలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే కష్టమవుతుందన్నారు. ఇప్పటి నుంచి ఓ ప్రణాళికతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ ఆళ్లగడ్డ టౌన్: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఎన్నికల, పోలీస్ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలుసూచనలు, సలహాలు చేశారు. నిర్భయంగా ఓటేయ్యండి శిరివెళ్ల: వచ్చే నెల 8వ తేదీన జరిగే ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఓటర్లకు సూచించారు. సోమవారం గోవిందపల్లె గ్రామంలోని ఎస్పీజీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో కరెంట్, తాగునీటి సదుపాయాలపై తహశీల్డార్ రాంసుబ్బయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళిత వాడలో ఓ చెట్టు కింద అరుగుపై కూర్చొని దళితులతో ముచ్చటించారు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా.. పోలింగ్ కేంద్రం తెలుసునా అని ఓటర్లను ప్రశ్నించారు. -
భావోద్వేగాలకు గురికావద్దు
కోసిగి రూరల్ : రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులు జరగకుండా చూస్తామని కలెక్టర్ విజయమోహన్ పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల రైతులు భావోద్వేగాలకు గురికాకుండా సహనం పాటించాలని సూచించారు. ఆధునికీకరణ పనులను తిరిగి ప్రారంభిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆర్డీఎస్ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆధునికీకరణ పనుల్లో ఆనకట్ట ఎత్తు పెంచడం లేదన్నారు. అలా పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని అన్నారు. తన పరిశీలనలో రైతులు, అధికారులు తెలిపిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని చెప్పారు. సీమ రైతులకు అన్యాయం చేయవద్దు.. ఆర్డీఎస్ ఆనకట్టు ఎత్తును పెంచి రాయలసీమ రైతులు, ప్రజలకు ఎలాంటి అన్యాయం చేయవద్దని కలెక్టర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బెట్టనగౌడ్, భీంరెడ్డి, మురళీరెడ్డి కోరారు. ఎత్తు పెంచితే దిగువ ప్రాంతానికి 1500 క్యూసెక్కుల నీటి సరఫరా తగ్గిపోతుందని, అలాగే ఎగువ ప్రాంతంలో 200 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా ఆర్డీఎస్ ఎత్తును పెంచుకోవడానికి నిజాం పాలకులు వీలు కల్పించినట్లు కలెక్టర్‌కు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి వివరిస్తుండగా సీమ రైతులు అడ్డుకున్నారు. సీమ ప్రాంత రైతులకు నీటి కష్టాలు వచ్చేలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సాగు, తాగునీటి వసతి కల్పించాలి తుంగభద్ర నది నుంచి సీమ ప్రాంత వాసులకు తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోసిగి మండల రైతులు కలెక్టర్ విజయమోహన్‌ను కోరారు. చాలా కాలంగా ఆర్డీఎస్ నుంచి దాగువకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంతో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ కాన్వాయ్‌ని అడ్డుకుని చుట్టుముట్టారు. ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి వెనుదిరిగారు. కలెక్టర్ వెంట ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, కోసిగి సీఐ అస్రార్‌బాషా, కోసిగి, పెద్దకడుబూరు మండలాల ఎస్ఐలు కృష్ణమూర్తి, జగన్ మోహన్ యాదవ్ ఉన్నారు. రైతుల ఆందోళనకు కోసిగి వైఎస్సార్సీపీ నాయకులు మంగమ్మ, నాడుగేని నరసింహులు, హోళగుంద కోసిగయ్య, లచ్చప గోవిందు, బండల గోవిందు, ఆకాశ్‌రెడ్డి, దొడ్డి నరసన్న తదితరులు మద్దతు తెలిపారు. -
‘నిట్’ కోసం స్థల పరిశీలన
నన్నూరు(ఓర్వకల్లు): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం నన్నూరు సమీపంలో భూమిని గురువారం కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటు కోసం అనుకూలమైన భూమిని సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. కొన్ని అనివార్య కారణాలతో స్థల సేకరణలో జాప్యం జరిగిందన్నారు. నెల రోజుల క్రితం నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా వద్ద స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అలాగే కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద గల 150 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించామన్నారు. ఒకే చోట 300 ఎకరాలు కావాలని, జాతీయ రహదారి అందుబాటులో ఉండాలని తాజాగా ప్రభుత్వం సూచించిందన్నారు. దీంతో నన్నూరు-పూడిచెర్ల మధ్య గల 1338, 386 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి అనుకూలమైనదిగా భావించామన్నారు. గడెం తిప్పపైగల ఈ భూముల వివరాలను 48 గంటల్లో పంపాలని సర్వే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రఘుబాబు, ఇన్చార్జి తహశీల్దార్ శ్రీనాథ్, సర్వేయర్లు మల్లికార్జున, సుబ్బారెడ్డి, వీఆర్ఓ మౌలిబాషా ఉన్నారు.