Vijayawada court
-
కొడాలి నాని, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధనను పోలీసుల ద్వారా టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అన్నదానాన్ని పోలీసులు అడ్డుకోబోగా, అన్నం పెడుతుంటే అడ్డుకోవడమేంటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టి వెయ్యడంతో దుమారం చెలరేగింది. ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నాని, వైసీపీ నాయకులు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
చంద్రబాబు చెంప చెళ్ళు..
-
మానసిక వేదనకు గురైన మహిళ వలంటీర్.. కోర్టులో పవన్ పై క్రిమినల్ కేసు
-
విజయవాడ: ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం
సాక్షి, విజయవాడ: ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ (సీజేఐ ఎన్వీ రమణను ఉద్దేశించి).. ఇవాళ ఒక ఉన్నతస్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం.. రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. 2013లో జస్టిస్ ఎన్వీ రమణగారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం అని సీఎం జగన్ తెలిపారు. జ్యూడీషియరీకి సంబంధించి ప్రతీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగారు తెలుగులో మాట్లాడాక.. తాను తెలుగులో మాట్లాడకపోవడం బాగోదని చెప్తూ తెలుగులోనే ప్రసంగించారు జస్టిస్ ఎన్వీ రమణ. నేను శంకుస్థాపన చేసిన బిల్డింగ్‌ను.. మళ్లీ నేనే ప్రారంభించడం ఆనందంగా ఉంది. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైంది. న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులకు( ఏపీ సీఎం జగన్ కూడా) కృతజ్ఞతలు. పెండింగ్ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా వెనకబడిందన్న సీజేఐ.. విభజనతో నష్టపోయామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు. నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ్జి ల ఖాళీలను భర్తీ చేసాను. 250 మంది హైకోర్టు జడ్జి లను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జి లను నియమించగలిగాను. సీఎం వై ఎస్ జగన్ సహకారం వల్లనే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగాం. విశాఖపట్నం లో కూడా ఓ భవనం చివరి దశలో ఉంది. దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నాం అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే.. -
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.. పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌లు కలిసి మొక్క నాటారు. ఇక విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పట్టేటి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు. ఇదీ చదవండి: పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు -
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ లేటెస్ట్ ఫొటోలు
-
కాల్‌డేటాపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు తదుపరి విచారణను నిలుపుదల చేయాలని అభ్యర్థన హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్‌డేటా ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలికం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ సిట్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 25 ఫోన్ నంబర్ల కాల్ డేటాను, అందుకు సంబంధించిన లేఖలను ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2)కు విరుద్ధమని అజయ్‌మిశ్రా తన పిటిషన్లలో పేర్కొన్నారు. విజ యవాడ కోర్టు తన పరిధిని దాటి ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద సెల్యులార్ ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని కోరే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు కాటా డేటా వివరాలను కోరినప్పుడు వాటిని అందజేయాలని, అదే సమయంలో ఆ డేటాను సెల్యులార్ ఆపరేటర్లు తమ వద్ద ఉంచుకోరాదని, ఇదే విషయాన్ని కేంద్ర టెలి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ నెల 13న సెల్యులార్ ఆపరేటర్లకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని వారు విజయవాడ కోర్టుకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఐజీపీ తదితరులు కోరిన వివరాలను ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను ఆదేశించిందన్నారు. ఇదిలా ఉంటే విజయవాడ కోర్టు ఆదేశాలపై సెల్యులార్ ఆపరేటర్లు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ప్రాథమిక దశలోనే వారు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ఈ వ్యవహారంలో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని భావించిన వారు హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. టెలిగ్రాఫ్ చట్టం కింద కోరిన వివరాలను ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలు చట్ట విరుద్ధమని అన్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అజయ్‌మిశ్రా హైకోర్టును కోరారు.