4,5 తేదీల్లో దండ కారణ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: దండకారణ్య నిర్వాసితుల సమస్య, ఆదివాసుల అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడటమే లక్ష్యంగా మే 4, 5 తేదీల్లో దండకారణ్యంలో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మీడియాకు ఒక ప్రకటన లేఖ పంపారు.
ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రల్లో ప్రజలను నిర్వాసితులు చేసే గనులు, ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, పైప్లైన్లకు వ్యతిరేకంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బంద్‌తో పాటు మే నెలంతా ప్రతిఘటనా కార్యక్రమాలు నిర్వహిస్తామని వికల్ప్ ప్రకటించారు.