వికారాబాద్ (SC) నియోజకవర్గం నాయకుడు ఎవరు?
వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గం
వికారాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది డాక్టర్ మెతుకు ఆనంద్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత, మాజీ మంత్రి ప్రసాదకుమార్‌పై 3122 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సిటింగ్ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన బదులు ఆనంద్‌కు ఇచ్చారు. ఆయనకు 51744 ఓట్లు రాగా, ప్రసాదకుమార్‌కు 48622 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్ పై పోటీచేసి 23 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 2014లో ప్రసాదకుమార్ కాంగ్రెస్ ఐ తరుపున పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్ధి బి.సంజీవరావు చేతిలో ఓడిపోయారు.
10072 ఓట్ల ఆదిక్యతతో సంజీవరావు విజయం సాధించారు. 2018లో సంజీవరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. వికారాబాద్ ఎస్.సి.లకు రిజర్వు అయిన నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ పదహారు సార్లు ఎస్.సి నేతలు గెలుపొందారు.అంతకుముందు రెండుసార్లు రెడ్లు గెలుపొందారు. ఇక్కడ సీనియర్ నేత చంద్రశేఖర్ 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరుఫునగెలుపొందారు. 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచిన ఈయన 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాద్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2009లో కూడా ప్రసాద్ ఈయనను ఓడిరచడం విశేషం. చంద్రశేఖర్ కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో ఉండగా, మరికొంతకాలం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. వికారాబాద్‌లో రెండుసార్లు గెలిచిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు గెలిచి మంత్రి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. ప్రముఖ దళితనేత ఆరిగే రామస్వామి వికారాబాద్‌లో నాలుగుసార్లు ఎన్నికయ్యారు.
మంత్రి పదవికూడా చేపట్టారు. కాగా కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్లో ప్రసాద్‌కుమార్ మంత్రి అయ్యారు. వికారాబాద్‌కు 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు, మూడుసార్లు టిఆర్ఎస్ గెలుపొందాయి. మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. 1952, 57లలో వికారాబాద్ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1962లో అరిగే రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..