Vikram Abhinandan
-
రెండు రోజుల్లో చంద్రుడిపై పగలు.. రోవర్, ల్యాండర్ పరిస్థితి?
బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇప్పటికే కీలక సమాచారాన్ని అందించాయి. అయితే, చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో ఇస్రో.. ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్, రోవర్లను నిద్రాణ స్థితిలోకి పంపింది. రోవర్, ల్యాండర్ నిద్రలేచేనా? ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణస్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. అయితే, రోవర్, ల్యాండర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Chandrayaan-3 Mission: Vikram Lander is set into sleep mode around 08:00 Hrs. IST today. Prior to that, in-situ experiments by ChaSTE, RAMBHA-LP and ILSA payloads are performed at the new location. The data collected is received at the Earth. Payloads are now switched off.… pic.twitter.com/vwOWLcbm6P — ISRO (@isro) September 4, 2023 చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో విడుదల చేసింది. మరోవైపు.. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
‘అష్ట’దిగ్బంధనం..
న్యూఢిల్లీ: ఇరవైనాలుగు లోహ విహంగాలతో భారత్‌పైకి దాడికి తెగబడిన పాకిస్తాన్‌ను ఎనిమిది భారత యుద్ధవిమానాలు బెదరగొట్టాయి. దీంతో పాక్ విమానాలు తోకముడుచుకుని పారిపోయా యి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ దళాలకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా దేశానికి రావాలని ప్రార్థిస్తున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది ఎఫ్–16లు, నాలుగు మిరాజ్–3 రకం విమానాలు, నాలుగు చైనా తయా రీ జేఎఫ్–17 ‘థండర్’ యుద్ధవిమానాలతో కూడిన ఫైటర్‌జెట్ విమానాల సమూహాన్ని పాకిస్తాన్ భారత్‌పైకి దాడికి పంపింది. భారత వాయుసేన దాడుల గురించి అప్రమత్తం చేసేందుకు ఈ జెట్లకు మరో పాక్ విమానం తోడుగా వచ్చింది. ఈ విమానాలన్నీ ఉదయం 9.45గంటల సమయంలో భారత్ వైపుగా రావడాన్ని సరిహద్దుకు 10 కి.మీ.ల దూరంలో ఉన్నపుడు భారత వాయుసేన దళాలు పసిగట్టాయి. ఒక్కొక్కటిగా అవి భారతభూగంలోకి దూసుకొస్తుండగా వెంటనే భారత్ వాయుసేనకు చెందిన నాలుగు సుఖోయ్ 30 విమానాలు, రెండు ఆధునీకరించిన మిరాజ్ 2000లు, రెండు మిగ్–21 బైసన్లు రంగంలోకి దిగి వెంటబడ్డాయి. భారత యుద్ధవిమానాలు వెంటబడుతుండడంతో పాక్ యుద్ధవిమానాలు విసిరిన బాంబులు లక్ష్యాలను గురితప్పాయి. సరిహద్దు వెంట ఉన్న భారత ఆర్మీ లక్ష్యాలకు సమీపంలో బాంబులు పడ్డాయి. పాక్ ఫైటర్‌జెట్ విమానాల బృందంలోని ఎఫ్–16 జెట్‌ను కూల్చేందుకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్–21 బైసన్ యుద్దవిమానం ద్వారా ‘ఎఫ్–73 ఎయిర్–టు–ఎయిర్ క్షిపణి’ని ప్రయోగించారు. దీంతో ఎఫ్–16 మంటల్లో చిక్కుకుంది. కానీ, అదే సమయంలో ఎఫ్–16 సైతం అభినందన్ నడుపుతున్న మిగ్పైకి రెండు (అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్–టు–ఎయిర్ మిస్సైల్–అమ్రామ్) క్షిపణులను ప్రయోగించింది. అది ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి తప్పిపోగా, మరొకటి అభినందన్ నడుపుతున్న మిగ్‌ను ఢీకొట్టింది. దీంతో కూలిపోతున్న మిగ్ నుంచి అభినందన్ ప్యారాచూట్‌తో బయటకు దూకేశారు. దెబ్బతిన్న పాక్ ఎఫ్–16 సైతం కుప్పకూలింది. మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న ఎఫ్–16 నుంచి ఇద్దరు పాక్ పైలట్లు ప్యారాచూట్ల సాయంతో సరిహద్దు ఆవల ల్యాండ్ అయ్యారు. ‘జమాతే ఇస్లామీ’పై కేంద్రం నిషేధం న్యూఢిల్లీ: వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌పై గురువారం కేంద్రం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నందున చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. పుల్వామా దాడి అనంతరం భద్రతా బలగాలు. వివిధ వేర్పాటు వాద సంస్థల నేతలతోపాటు పెద్ద సంఖ్యలో జమాతే ఇస్లామీ శ్రేణులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ భేటీ సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాక్‌తో ఉద్రిక్తతలు, వింగ్ కమాండర్ అభినందన్‌ను వెనక్కి పంపించాలన్న పాక్ ప్రకటన నేపథ్యంలో గురువారం ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్ అజర్‌పై చర్యలకు సంబంధించి పాక్ నుంచి ఎటువంటి హామీ రానంత వరకు సంయమనం పాటించినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమై నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడులకు తలొగ్గిన పాక్ ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని ఈ కమిటీ అభిప్రాయపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభినందన్ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం మంచి పరిణామమని పేర్కొంది. అయితే, బుధవారం పాక్ యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి చొచ్చుకు రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు ఎఫ్–16 విమానాల ద్వారా అమెరికా తయారీ అమ్రోన్ క్షిపణులతో దాడికి యత్నించడాన్ని దురాక్రమణ చర్యేనని పేర్కొంది. ఎన్నికల వేళ ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకున్నా రాజకీయంగా వికటించే ప్రమాదముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. అభినందన్ స్వదేశానికి చేరుకున్న తర్వాతే పాక్‌పై మిగతా చర్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. భేటీలో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. పాక్ మోర్టార్ దాడుల్లో మహిళ మృతి జమ్మూ: కశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఆరు సెక్టార్లలో పౌర ఆవాసాలపై పాక్ సైన్యం గురువారం జరిపిన మోర్టార్ దాడుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక జవానుకు గాయాలయ్యాయి. పాక్ దాడులకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని అధికారులు చెప్పారు. సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం వరుసగా ఇది ఏడవ రోజు. సుందర్బని, మాన్‌కోట్, ఖరికర్మారా, డెగ్వార్ సెక్టార్లలో పాక్ భారీ ఎత్తున మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో కాల్పు లు జరుపుతోందని రక్షణ ప్రతినిధి వెల్లడించారు. మెందార్లోని చజ్జలలో పాక్ మోర్టార్ శకలం తగిలి ఓ మహిళ మరణించగా, మరో ఘటనలో జవాను గాయపడ్డాడని తెలిపారు. -
దేశం మీసం మెలేస్తోంది
దేశమంతా ఇప్పుడు ఒకటే నినాదం. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను భారతం ముక్తకంఠంతో అభినందిస్తోంది. పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. మిగ్–21 బైసన్ యుద్ధ విమానం కూలిన తర్వాత పాక్ సైనికులకు అభినందన్ చిక్కడం.. ఆ తర్వాత స్థానికులు ఆయన్ను రక్తం కారేలా హింసించినా.. వీరుడి ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. పాక్ సైన్యం కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి విరిచికట్టినా ముఖంపై చిరునవ్వు కోల్పోలేదు. కులాసాగా టీ తాగుతూ తనను పాక్ ఆర్మీ బాగానే చూసుకుంటోందని చెప్పడం.. ఆయనలోని జెంటి ల్మన్కు నిలువెత్తు నిదర్శనం. పాక్ మేజర్ ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. తన పేరు అభినందన్ అని, తాను పైలట్‌నని, సర్వీస్ నంబర్ 27981 అని చెప్పారే తప్ప ఒక్క రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు. అనవసర ప్రశ్నలకు సారీ సర్ అంటూ సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియోలతో ఇప్పుడు దేశంలో విక్రం అభినందన్ హీరోగా మారిపోయారు. భారత సైనికుడి సత్తా ఇదంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరదపారుతోంది. వెన్నెముకకు గాయమైనా..! బుధవారం ఉదయం వాస్తవాధీనరేఖకు 7 కిలోమీటర్ల దూరంలో హోర్రా గ్రామంలో భారత్‌కు చెందిన రెండు యుద్ద విమానాలు మంటల్లో చిక్కుకొని కుప్పకూలిపోయాయంటూ డాన్ పత్రిక పేర్కొంది. ఒక విమానం నుంచి పైలట్ ప్యారాచూట్ సాయంతో కిందకి దిగడాన్ని స్థానికులు గుర్తించారు. చేతిలో పిస్టల్‌తో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను స్థానికులు చుట్టుముట్టారు. అభినందన్ ఇది భారతా? పాకిస్తానా? అని వారిని ప్రశ్నించారు. అభినందన్‌ను పక్కదారి పట్టించడానికి వారు భారత్ అని చెప్పారు. ఊపిరి పీల్చుకున్న అభినందన్ తన వెన్నెముకకు దెబ్బతగిలిందని.. దాహంతో నోరెండిపోతోందని మంచినీళ్లు కావాలని అడిగారు. అభినందన్‌ను చుట్టముట్టిన స్థానికుల్లో కొందరు యువకులు భావోద్వేగాలు ఆపుకోలేక పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అభినందన్‌కి తాను పాక్‌లో ఉన్నానని అర్థమైంది. వెంటనే చేతిలో ఉన్న పిస్టల్‌తో గాల్లో కాల్పులు జరుపుతూ.. పరుగులు తీశారు. వెన్నెముకకు గాయమై బాధిస్తున్నా పరుగు ఆపలేదు. ఆయనను పట్టుకోవడానికి స్థానికులు వెంబడిస్తే ఒక నీటి కుంటలోకి దూకేశారు. భారత్ రహస్యాలు పరాయి దేశస్తుల చేతుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తన దుస్తుల్లో దాచుకున్న కీలక డాక్యుమెంట్లను నమిలి మింగడానికి ప్రయత్నించారు. మరికొన్ని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నీళ్లలో ముంచేశారు. ఆయన్ను వెంబడిస్తూ వచ్చిన స్థానికులు నిర్బంధించి రక్తం కారేలా కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన పాక్ ఆర్మీ గ్రామస్తులు నుంచి అభినందన్‌ను రక్షించి తమ అధీనంలోకి తీసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అభినందన్ కనబరిచిన తెగువ దేశ ప్రజల మనసులను గెలుచుకుంది. ఎఫ్–16నే కూల్చేశారు ఆయన నడుపుతున్న మిగ్ 21 బైసన్ కుప్పకూలడానికి కొద్ది సెకండ్ల ముందు కూడా అభినందన్ తాను చేయాల్సిన పని పైనే దృష్టి పెట్టారు. శత్రుదేశ యుద్ధ విమానం ఎఫ్–16ను గురితప్పకుండా కాల్చి కూల్చేశారు. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే ఆర్–73 క్షిపణిని ప్రయోగించి అభినందన్ ఈ పని పూర్తి చేశారు. ఎప్పుడో 1960 కాలం నాటి క్షిపణిని ప్రయోగించి గురితప్పకుండా ప్రత్యర్థి అత్యాధునిక విమానాన్ని కూల్చివేయడం అరుదైన ఘటన అని వైమానిక వర్గాలు పేర్కొన్నాయి. పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాలు భారత్ భూభాగంలోకి 7 కి.మీ. దూరంలోకి చొచ్చుకు వచ్చినా అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోయాయి. వీటి రాకను గుర్తించి గస్తీ తిరుగుతున్న రెండు మిగ్–21 బైసన్ విమానాలువెంబడించాయి. ఈ ప్రయత్నంలో రెండు ఎఫ్–16 విమానాల మధ్యకు అభినందన్ మిగ్ దూసుకెళ్లింది. తర్వాత విమానం అదుపుతప్పింది. పరిస్థితి చేయిదాటుతున్నా.. మిగ్ కూలిపోవడానికి ఆఖరి నిమిషంలో ఎఫ్–16ని కూల్చేశారు. వాఘా వద్ద అభినందన్‌కు ఆహ్వానం న్యూఢిల్లీ: ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సాయంత్రం భారత్–పాక్ సరిహద్దుల్లోని వాఘా పోస్ట్ వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టనున్నారు. ఐఏఎఫ్ అధికారుల బృందం వాఘా వద్ద ఆయనకు స్వాగతం పలకనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన్ను పాక్ సైన్యం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించనుందా లేక భారత అధికారులకు అప్పగిస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. పంజాబ్‌లోని అట్టారి వద్ద భారత్–పాక్ సరిహద్దుల్లో వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని మోదీని కోరారు. ‘పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శిస్తున్నాను. ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఉన్నాను. అట్టారి వద్ద ఆయన్ను దేశంలోకి ఆహ్వానించటాన్ని గౌరవంగా భావిస్తాను. నాకు మాదిరిగానే అభినందన్, ఆయన తండ్రి కూడా నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ పొందినవారే. నాకు అవకాశం ఇవ్వండి’అంటూ ఆయన ప్రధానిని ట్విట్టర్లో కోరారు. -
సింహం కడుపున సింహమే పుడుతుంది
విక్రమ్ అభినందన్ మహారాష్ట్రలో ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో 16 ఏళ్లు సేవలు అందించారు. మన దేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లలో ఆయన కూడా ఒకరు. అభినందన్ వయసు 36ఏళ్లు. సొంత రాష్ట్రం తమిళనాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారు. విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. సుఖోయ్–30 యుద్ధ విమానాలను అత్యంత చాకచక్యంగా నడపగలరు. ఆ తర్వాత మిగ్–21 విమానం నడిపే బాధ్యతలు ఆయనకి అప్పగించారు. సూర్యకిరణ్ విన్యాసాలు చేయడంలో ఈయన దిట్ట. అభినందన్ తండ్రి కూడా మాజీ ఎయిర్‌మార్షల్. ఆయన పేరు సింహకుట్టి వర్ధమాన్. గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌గా సేవలందించారు. 1999 కార్గిల్ యుద్ధంలో సమయంలో కీలక పాత్ర పోషించారు. ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పని చేసి ఆయన పదవీ విరమణ చేశారు. అభినందన్ సోదరుడు కూడా వాయుసేనలో పనిచేశారు. అభినందన్ భార్య తన్వి మార్వా కూడా ఐఏఎఫ్‌లో అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇలా కుటుంబం మొత్తం దేశ సేవకే తమ జీవితాలను అంకితం చేయడం విశేషం. అభినందన్‌ను విడుదల చేయడానికి పాక్ అంగీకరించడంతో ఆయన తండ్రి వర్ధమాన్ ఆనందానికి హద్దుల్లేవు. నిజమైన సైనికుడంటూ కుమారుడిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దేశం అంతా తన కుమారుడి విడుదలకు ప్రార్థించిన భారతీయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే తీసిన సినిమా చెలియా (తమిళంలో కాట్రూ వెలియడాయ్)లో సహజంగా సన్నివేశాలను చిత్రీకరించేందుకు అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్‌ను సంప్రదించారు. ఆ చిత్రంలోనూ ఐఏఎఫ్ విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చేస్తుంది. పైలట్‌ను అదుపులోనికి తీసుకొని చిత్రహింసలు పెడుతుంది. -
పైలట్ అభినందన్ తండ్రి భావోద్వేగం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన తన కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని భారత పైలట్ అభినందన్ వర్థమాన్ తండ్రి, మాజీ ఐఏఎఫ్ అధికారి ఎస్ వర్థమాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ ఆ దేశ ఆర్మీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హింసించినట్లుగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో యావత్ భారతావని ఆందోళనలో మునిగిపోయింది. దీంతో అభినందన్ క్షేమంగా ఉండాలని భారతీయులంతా ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఎస్ వర్థమాన్.. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి, విపత్కర సమయంలో కూడా అభినందన్ ధైర్య సాహసాలు ప్రదర్శించాడన్నారు. ‘ తన కోసం ప్రార్థిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. అభి బతికి ఉన్నందుకు ఆ దేవుడికి కృతఙ్ఞతలు తెలుపుతున్నా. తను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. పాక్ చేతికి చిక్కినా అభి చాలా ధైర్యంగా ఉన్నాడు. తను నిజమైన సైనికుడు. తనను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం మీ మద్దతు మాకెంతో ధైర్యాన్ని ఇస్తోంది. మీ అందరి ఆశీస్సులతో వాడు క్షేమంగా తిరిగి వస్తే చాలు’ అని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా అభినందన్ తండ్రి ఎస్ వర్థమాన్ కూడా వైమానిక దళంలో పనిచేశారు. వారి స్వస్థలం కేరళ అయినా.. అభినందన్ కుటుంబసభ్యులు తమిళనాడులోని తాంబరంలో స్థిరపడ్డారు. ఇక తమ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా ఉన్నారని, ఆయనకు మందులు, ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. భారత పైలట్‌ను తిరిగి అప్పగించేందుకు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్నారు. -
అభినందన్‌ను విడిచిపెట్టండి: ఫాతిమా భుట్టో
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ను విడుదల చేయాలని పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనుమరాలు, పాకిస్తానీ రచయిత్రి ఫాతిమా భుట్టో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో విక్రమ్ అభినందన్ అనే భారత పైలట్ ఆ దేశ సైన్యానికి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హింసించినట్లుగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో యావత్ భారతావని ఆందోళనలో మునిగిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తనతో పాటు పాకిస్తానీ యువత మొత్తం అభినందన్‌ను క్షేమంగా భారత్ పంపించాలని కోరుకుంటున్నారంటూ ఫాతిమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్‌లో ఆమె కథనం రాసుకొచ్చారు.(ఎవరీ విక్రమ్ అభినందన్?) అనాథలుగా మారాలనుకోవడం లేదు... ‘శాంతి, మానవత్వం, నిబంధనల పట్ల నిబద్ధత కనబరిచి భారత పైలట్‌ను విడుదల చేయండి. మా జీవితంలో గరిష్ట కాలమంతా యుద్ధ వాతావరణంలోనే గడిపాము. పాకిస్తాన్ సైనికులు గానీ భారత సైన్యం గానీ చనిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఉపఖండం అనాథలుగా మిగిలిపోవాలని అనుకోవడం లేదు కూడా. మా తరం పాకీస్తానీలు మాట్లాడే హక్కు కోసం నిర్భయంగా పోరాడారు. అందరినీ క్షేమంగా ఉంచే శాంతి కోసం మా గళం వినిపించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ సైనిక పాలన, ఉగ్రవాదం, ఇతర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్న కారణంగా మతదురభిమానానికి, యుద్ధానికి మేము వ్యతిరేకం. శాంతిని దూరం చేసే ఈ అంశాలను మేము అస్సలు సహించలేం’ అని పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో మేనకోడలు ఫాతిమా పేర్కొన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి #saynotowar అనే హ్యాష్ ట్యాగ్.. మొదట పాకిస్తాన్లో ట్రెండ్ అయిన విషయాన్ని ప్రస్తావించిన ఫాతిమా... ‘ పొరుగదేశంతో మా దేశం శాంతియుతంగా ఉన్న సందర్భాన్ని నేనెప్పుడూ చూడలేదు. కానీ ప్రస్తుతం నాలాగే చాలా మంది భారత్- పాక్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తత తొలగిపోవాలని ఆశిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్- పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. -
త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో బుధవారం త్రివిధ దళాధిపతులు మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దు వద్ద పరిస్థితులపై ఆరా తీశారు. సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితులను రావత్ మోదీకి వివరించారు. భారత పైలట్ అభినందన్ క్షేమంపై కూడా మోదీ ఆరాతీశారని సమాచారం. పాక్ కబంధ హస్తాల్లో చిక్కున్న భారత పైలట్‌ను క్షేమంగా, త్వరగా విడిపించే అంశంపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దులో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రధాని వారితో చర్చించినట్లు సమాచారం. -
అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నాని ట్వీట్ చేశారు. (భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!) బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత పైలట్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియోను విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత పైలట్ ఒకరు పాకిస్తాన్ సైన్యానికి చిక్కారని భారత్ కూడా దృవీకరించింది. (పైలట్‌ను హింసించడం అమానుషం) ఇవి చదవండి : భారత పైలెట్ అభినందన్ క్షేమం! ఎవరీ విక్రమ్ అభినందన్? -
పైలట్‌ను హింసించడం అమానుషం : భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు పట్టుబడ్డ భారత పైలట్ అభినందన్‌ను సురక్షితంగా అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. తమ పైలట్‌కు ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించే బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పైలట్ అభినందన్‌ను హింసించడం అమానుషమని పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ పైలట్‌ను చూపడం జెనీవా ఒప్పందానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్త చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉగ్ర క్యాంపుల గురించి పాకిస్తాన్‌కు సమాచారమిచ్చామని, పాక్ చర్యలు తీసుకోనందునే దాడి చేశామని పేర్కొంది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే తప్ప పాక్ ప్రజలపై కాదని స్పష్టం చేసింది. (భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!) బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో స్థానికులు అభినందన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భారత పైలట్ పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది. యుద్దంలో చిక్కిన సైనికునిపై దాడి చేసి పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా బుధవారం సాయంత్రం అభినందన్‌కు సంబంధించి మరో వీడియోను పాక్ విడుదల చేసింది. వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. తనపై స్థానికులు దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యమే కాపాడిందని చేప్పారు. (ఎవరీ విక్రమ్ అభినందన్?) ఇది చదవండి : భారత పైలెట్ అభినందన్ క్షేమం! -
భారత పైలెట్ అభినందన్ క్షేమం!
ఇస్లామాబాద్ : భారత పైలట్ విక్రమ్ అభినందన్‌కు సంబంధించి మరో వీడియోను పాక్ విడుదల చేసింది. భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ వెల్లడించింన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అభినందన్‌ను ప్రశ్నలు అడుగుతూ తీసిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. మీ లక్ష్యం ఏంటని పాక్ అధికారులు అడిగిన ప్రశ్నకు.. జవాబు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు. విమాన వివరాల కూపీ లాగడాని పాక్ ఆర్మీ అధికారులు ప్రయత్నించగా, అందుకు తానేమీ చెప్పదలచుకోలేదని అభినందన్ చెప్పారు. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. పాక్ ముందు విడుదల చేసిన వీడియోలో అభినందన్‌పై దాడి దృశ్యాలు ఉండటంతో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందన్న నేపథ్యంలో మరో వీడియోను విడుదల చేసినట్టు భావిస్తున్నారు. -
ఎవరీ విక్రమ్ అభినందన్?
సాక్షి, చెన్నై: భారత పైలట్ విక్రమ్ అభినందన్ తమకు పట్టుబడినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. (పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్) అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేశారు. ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. దేశంపైకి దండెత్తిన శత్రు విమానాలను వెంటాడుతూ దాయాది దేశానికి పట్టుబడ్డ ఆయన చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్‌ను విడిపించుకోవాలన్న ఆలోచనలో భారత్ ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్‌ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది. (భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!) క్షేమంగా విడిచిపెట్టాలి: అభినందన్ మేనమామ అభినందన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని ఆయన మేనమామ గుంగనాధన్ విజ్ఞప్తి చేశారు. మేనల్లుడిని తన చేతులతో పెంచానని.. టీవీల్లో వస్తున్న ఫొటోలు, వీడియోలు అభినందన్వేనని తెలిపారు. అభినందన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వీరు ఢిల్లీలో ఉంటున్నారని చెప్పారు. -
భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ను పాక్ చిత్రహింసలకు గురిచేస్తోంది. యుద్ద ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పాకిస్తాన్ భూభాగంలో మిగ్-21 విమానం కూలిపోయినప్పుడు పారాచ్యూట్ ద్వారా భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ భూభాగంలో దిగారు. దీంతో అభినందన్‌ను పట్టుకున్న పాక్ ఆర్మీ విచక్షణారహితంగా దాడి చేశారు. అభినందన్ ఛాతి భాగంలో పిడిగుద్దులు గుద్దుతూ రక్తం వచ్చేలా కొట్టారు. పారాచ్యూట్ ద్వారా దిగినప్పుడు అభినందన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ పాక్ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. అయితే అభినందన్‌పై దాడి చేసింది పాక్ సైనికులా లేదా ఉగ్రవాదులా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించలేదు. (ఎవరీ విక్రమ్ అభినందన్?) యుద్దంలో చనిపోతే వీరమరణం పొందొచ్చు.. కానీ శత్రువులకు దొరికితే నరకం కనిపిస్తుంది. దీన్ని నివారించేందుకే ప్రపంచ దేశాలు జెనీవా ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఒప్పందం ప్రకారం యుద్ధంలో చిక్కిన శత్రు సైనికులను హింసించరాదు. కానీ పాక్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అభినందన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. కాగా తనపై పాక్ ఆర్మీ దాడి చేయలేదని అభినందన్ తెలిపారు. స్థానికులు తనపై దాడి చేస్తుంటే పాకిస్తాన్ సైన్యమే తనను కాపాడిందని అబినందన్ చెబుతున్న ఓ వీడియోను పాక్ విడుదల చేసింది. మరో వైపు అభినందన్ పాక్‌కు పట్టుబడడాన్ని భారత్ అధికారికంగా ధృవీకరించలేదు. మిగ్-21 విమానం కూలిపోయిందని, ఒక పైలట్ తప్పిపోయారని మాత్రమే భారత్ వెల్లడించింది.