అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Prayers For Safety And Quick Return Of Indian Pailet Abhinandan | Sakshi
Sakshi News home page

అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలి : వైఎస్‌ జగన్‌

Published Wed, Feb 27 2019 9:15 PM | Last Updated on Wed, Feb 27 2019 9:15 PM

YS Jagan Prayers For Safety And Quick Return Of Indian Pailet Abhinandan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాకిస్తాన్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నాని ట్వీట్‌ చేశారు. (భారత పైలట్‌కు పాక్‌ చిత్రహింసలు!) 

బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత పైలట్‌ అభినందన్‌ పాక్‌ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్‌ ఓ విడియోను విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్‌ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత పైలట్‌ ఒకరు పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కారని భారత్‌ కూడా దృవీకరించింది. (పైలట్‌ను హింసించడం అమానుషం)

ఇవి చదవండి : భారత పైలెట్‌ అభినందన్‌ క్షేమం!
ఎవరీ విక్రమ్ అభినందన్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement