Vikraman Direction
-
హీరోగా పరిచయమవుతున్న డైరెక్టర్ విక్రమన్ తనయుడు
ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇప్పుడు నటుడిగానూ అలరిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తన ఆర్కే సెల్యులాయిడ్ ద్వారా నిర్మిస్తున్న చిత్రం హిట్‌లిస్ట్. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్కా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్య, కదీర్, కార్తికేయన్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నటుడు శరత్‌కుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. చదవండి: ఓటీటీలోకి 'బింబిసార'.. స్ట్రీమింగ్ అయ్యేది అక్కడే దర్శకుడు కేఎస్ రవికుమార్, సితార, మునీష్ కాంత్, రెడిన్ కింగ్సీ, అభినయ, కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామచంద్ర, మైమ్ గోపి, అనుపమ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నటుడు విజయ్ కనిష్కా పుట్టినరోజు సందర్భంగా శనివారం ప్రారంభమైంది. నటుడు విజయ్ కనిష్కా, నటి సితారపై ముహూర్తం షాట్ చిత్రీకరించారు. చిత్ర వి వరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ వంటి జనరంజక అంశాలతో కూడిన చక్కని కు టుంబ కథా చి త్రంగా హిట్‌లిస్ట్ ఉంటుందని చెప్పారు. -
విక్రమన్ దర్శకత్వంలో సూర్య
నటనలో వైవిధ్యం కోసం తపించే నటుల్లో సూర్య ఒకరు. ఆయన కథలపై చూపే శ్రద్ధ దర్శకులను ఎంపిక చేసుకునే విధానంలో పరిణితి స్పష్టం అవుతుంది. చిత్రం చిత్రానికి తాను ఎదుగుతూ, తన చిత్రాల విజయాల స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే హీరోగా సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదుగుతున్నారు. సింగం, సింగం -2 వంటి రాక్ హిట్లు తరువాత అంజాన్ అంటూ బిగ్ బ్యాంగ్‌తో తెరపైకి రానున్నారు. అంజాన్ ఈ నెల 15న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్‌గా సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. సూర్య ఆ తరువాత చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో సూర్య నటించనున్నారు. విక్రమన్ ఇంతకు ముందు యావరుంనలం చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఇటీవలే తెలుగులో అక్కినేని కుటుంబంతో మనం అనే చిత్రంతో అద్భుతమయిన విజయాన్ని అందుకున్నారు. ఈ బహుభాషా దర్శకుడు సూర్య కోసం మంచి కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథను సిద్ధం చేస్తున్నారట. దీని గురించి విక్రమన్ మాట్లాడుతూ సూర్య కోసం కథ తయారు చేస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఈ చిత్రం ఆయన నటిస్తున్న మాస్ చిత్రం తరువాత సెట్‌పైకి రానుందని తెలిపారు. ఈ కథ ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంటూ అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఉంటుందన్నారు. చిత్రంలో ఇద్దరు కథా నాయికలు ఉంటారని, అయితే వాళ్ల ఎంపిక జరగలేదని వివరించారు.