vilas rao desmukh
-
కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా భర్త.. వీడియో వైరల్
మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యారు. తన దివంగత తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి దివంగత కాంగ్రెస్ నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రితీష్ తాజాగా మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. నాన్న చనిపోయి 12 ఏళ్లు అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఆ సమయంలో వెంటనే ఆయన అన్నయ్య, లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ ఓదార్చారు. 'సాహెబ్ (విలాస్‌రావ్ దేశ్‌ముఖ్) మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు గడిచాయి. ఆయన లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉంటుంది. అతను ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రకాశిస్తాడు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు. అతను ప్రజల కోసం బలంగా నిలబడ్డాడు. తద్వారా ఇప్పుడు మేము, మా పిల్లలు కూడా నిలువెత్తు ఆవశ్యకతను అనుభవిస్తున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అది ఈ స్టేజీపైన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ వెలుగుల రూపంలో ప్రకాశవంతంగా కనిపింస్తుంది.' అని రితీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2012లో హీరోయిన్ జెనీలియాను బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చివరిగా వేద్ అనే చిత్రంలో జంటగా కనిపించారు.తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మే 26, 1945న లాతూర్‌లో జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆగస్టు 14, 2012న మరణించారు. थोरामोठ्यांचा आदर करणं ही महाराष्ट्राची संस्कृती आहे. प्रत्येक घराघरात हेच संस्कार केले जातात. परंतु, जेव्हा स्वार्थाचा विचार मनात येतो, तेव्हा सगळी नाती मागे पडतात आणि अशातच मग घर आणि पक्ष फोडावा लागला तरी कसलाच विचार लोक करत नाही.#Maharashtra #RiteishDeshmukh pic.twitter.com/i8xqWEzEYr — Nationalist Congress Party - Sharadchandra Pawar (@NCPspeaks) February 18, 2024 -
హ్యాపీ బర్త్‌డే పప్పా: రితేశ్ భావోద్వేగం
-
మిస్ యూ పప్పా: హీరో భావోద్వేగం
‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మిమ్మల్ని రోజూ మిస్సవుతున్నా!!’’ అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న తండ్రి కుర్తా స్లీవ్‌లో తన చేతిని ఉంచిన రితేశ్.. దానిని ఆలింగనం చేసుకుని ఆ చేతితో తన తలను తానే నిమురుకున్నాడు. తండ్రే స్వయంగా దిగివచ్చి తనను ఆత్మీయంగా హత్తుకున్నట్టు ఉద్వేగానికి లోనయ్యాడు. మిస్ యూ నాన్నా అంటూ ట్విటర్ వేదికగా నివాళి అర్పించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ‘ఎంత అందమైన వీడియో’అంటూ రితేశ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. అతడితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ప్రముఖ దర్శకుడి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్) కాగా రితేశ్ భార్య, నటి జెనీలియా సైతం మామగారిని గుర్తు చేసుకుంటూ.. ‘‘నువ్వు గర్వపడే విషయం ఏమిటని టీచర్ రియాన్‌ను అడిగినపుడు.. వాడి సమాధానం.. మా తాతయ్య అని. ఎల్లప్పుడూ మేం మీ సమక్షంలోనే ఉన్నట్లు భావిస్తాం. మీరెక్కడున్నా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారని తెలుసు. మా అందరిలో మీరు జీవించే ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే పప్పా’’అని భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. కాగా 1945 మే 26న జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 2012లో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. విలాస్‌రావ్ నలుగురు కుమారుల్లో రితేశ్ సినీరంగంలో ఉండగా.. మిగిలిన వారు రాజకీయాల్లో ప్రవేశించి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.(‘గ్లామర్ వాలా, సఫాయీ వాలా ఒకటే’) -
నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్
సాక్షి, ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని పలువురు రాజకీయ వారసులు చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. హరియాణా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు సహా దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ఆదిత్య ఠాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అజిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్(ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున) లాతూర్ జిల్లా నుంచి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరో కుమారుడు, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ నాన్న మేము సాధించాం!! వరుసగా మూడోసారి అమిత్ లాతూర్ సిటీలో గెలుపొందగా(40 వేల మెజార్టీ), ధీరజ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని లక్షా 20 వేల భారీ మెజార్టీతో సొంతం చేసుకున్నాడు. లాతూర్ ప్రజలు మాపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు’ అని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక ఠాక్రే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులతో పాటు... కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే గెలుపొందగా... మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణేలతోపాటు పలువురు రాజకీయ నాయకుల వారసులు విజయం సాధించిన విషయం విదితమే. We did it PAPPA!!! @AmitV_Deshmukh wins Latur (city) by 42000+ votes for the 3rd consecutive time.@MeDeshmukh wins Latur (rural) by 1,20,000 votes. Thank you people of Latur for this faith & trust. pic.twitter.com/pOGFsmoEJU — Riteish Deshmukh (@Riteishd) October 24, 2019 వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే మనవడు, శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీకి వెళ్లనున్నారు. శివసేనకు పెట్టనికోటగా ఉన్న ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి యువసేన అధ్యక్షులైన ఆయన బరిలోకి దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానే, వంచిత్ ఆఘాడి అభ్యర్థి గౌతం గైక్వాడ్, ఇండిపెండెంట్ అబిజీత్ బిచ్‌కులేతోపాటు 12 మంది బరిలోకి దిగారు. అయితే ఆదిత్య ఠాక్రేకు 89,248 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు 21,821 ఓట్లతో ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానే ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇలా ఆదిత్య ఠాక్రే 67,427మ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు వర్లీ నియోజకవర్గంలో 6305 మంది ఓటర్లు నోటాకు ఓటేవ్వడం కూడా విశేషం. ధీరజ్ దేశ్‌ముఖ్ భారీ మెజార్టీ మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని లాతూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు ధీరజ్ దేశ్‌ముఖ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ ప్రత్యర్థులైన శివసేన అభ్యర్థి సచిన్ అలియాస్ రవి దేశ్‌ముఖ్ కంటే అధికంగా ‘నోటా’కు ఓట్లు వచ్చాయి. ఎక్కడలేని విధంగా నోటా ద్వితీయ స్థానంలో నిలిచింది. దీంతో లాతూరు రూరల్ లోకసభ నియోజకవర్గం ఫలితాలు అందరిని దృష్టిని ఆకర్శించాయి. కడపటి వివరాలు అందిన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్‌కు 1,33,161 ఓట్లు పోలవ్వగా నోటాకు ఏకంగా 27,287 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు శివసేన అభ్యర్థి సచిన్‌అలియాస్ రవీ దేశ్‌ముఖ్‌కు 13,335 ఓట్లు పోలయ్యాయి. -
‘ఏడేళ్ల క్రితం అడిగితే సమాధానం చెప్పేవాడు’
ముంబై : తన తండ్రిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఆరోపణల పట్ల రితేష్ దేశ్‌ముఖ్ స్పందించారు. మన మధ్యలేని వారి గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు రితేశ్. ఇంతకు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. ‘26/11 దాడులు జరిగినప్పుడు దివంగత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన కుమారుడు రితేశ్‌కు సినిమా అవకాశాలు ఇప్పించే ప్రక్రియలో బిజీగా ఉన్నార’ని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రితేష్.. ట్విటర్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. ‘గౌరవనీయులైన మంత్రి.. 26/11 దాడులు జరిగినప్పుడు మా నాన్నతో కలిసి తాజ్ హోటల్ని సందర్శించిన మాట వాస్తవమే. కానీ మీరు ఆరోపించినట్లు ఆ సమయంలో నేను షూటింగ్లో బిజీగా ఉన్నానన్నది అబద్ధం. ఆయనకున్న పలుకుబడితో నాకు సినిమా అవకాశాలు ఇప్పించలేదు. నన్ను సినిమాలోకి తీసుకోవాలని ఏ దర్శకుడితో, నిర్మాతతో కానీ మా నాన్న చర్చించింది లేదు. ఆ విషయంలో నేను ఇప్పటికీ చాలా గర్వపడతాను. ప్రశ్నించే హక్కు మీకు కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ లోకంలో లేని వ్యక్తి గురించి మీరు ఇలా ఆరోపించడం సరికాదు. ఏడేళ్ల క్రితం మీరు ఈ ప్రశ్న అడిగి ఉంటే మా నాన్న సమాధానం ఇచ్చేవారు. మీ ఎన్నికల ప్రచారాలకు ఆల్ ది బెస్ట్ సర్’ అని పేర్కొన్నారు రితేశ్. pic.twitter.com/5NHzYQATNs — Riteish Deshmukh (@Riteishd) May 13, 2019 2004 నుంచి 2008 వరకు విలాస్‌రావ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 ఆగస్టులో అనారోగ్యంతో ఆయన మరణించారు. -
ముఖ్యమంత్రి మన అల్లుడే..!
సాక్షి, భైంసా(ముథోల్): ఏ ఎన్నికలు వచ్చినా కుభీర్ మండలంలోని పల్సి గ్రామస్తులకు మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే, ఆయన సతీమణి వైశాలి పుట్టి పెరిగింది ఈ గ్రామంలోనే! ఈమె ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్ పల్సికర్ రంగారావు కూతురు. దీంతో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మా ఊరి అల్లుడే మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా పని చేశారని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన పిళ్లుబాయి అల్లుడు.. పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పుష్పకు ఒక కుమార్తె కాగా, రెండో భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని విలాస్‌రావ్ దేశ్ముఖ్తో వివాహం జరిపించారు. వైశాలి–విలాస్‌రావ్ దంపతుల కొడుకు రితేష్ దేఖ్‌ముఖ్. బాలీవుడ్ హీరోగా రాణిస్తున్న రితేష్ తెలుగు సినిమా ప్రియులకు సుపరిచితమైన హీరోయిన్ జెనీలియాను వివాహం చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా పని చేసిన రంగారావుకు ఊరిపేరే ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లావాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. రంగారావు అనారోగ్యంతో మృతి చెందినప్పుడు ఆయన అంత్యక్రియలు ఇక్కడే స్వగ్రామంలో చేశారు. నాడు సీఎంగా ఉన్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన మామ పెద్ద కర్మ నిర్వహించిన 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ భైంసా మండలంలోని వాడి గ్రామం దగ్గర సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు. పెళ్లిళ్లకు ప్రత్యేక ఆహ్వానం.. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పల్సి గ్రామ ప్రజలకు, మాజీ మంత్రి దివంగత గడ్డెన్న కుటుంబీకులకు, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ కుటుంబీకులకు, డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ కుటుంబీకులకు ఆహ్వాన పత్రికలు వచ్చేవి. ఫిబ్రవరి–3, 2012న బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియాల వివాహానికి కూడా పల్సి వాసులు ముంబయి సైతం వెళ్లారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ భార్య వైశాలి పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది మరమ్మతులు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలున్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు. విలాస్‌రావ్ రాజకీయ ప్రస్థానం.. 1974లో బాబుల్‌గాం సర్పంచ్‌గా మొదలైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు ఆయనను వరించాయి. 1976లో లాథూర్ తాలుకా పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 1980, 85, 90ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై రెవెన్యూ, కోఆపరేటివ్, అగ్రికల్చరర్, హోం, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ మంత్రిగా, రెండుసార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర సీఎంగా రెండోసారి ఎన్నికైన ఆయన 2008 నవంబర్ 26న ముంబాయి పేలుళ్లకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై డిసెంబర్ 2011లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యంతో 14 ఆగష్టు 2012న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతిచెందారు. -
కాంగ్రెస్ ఎన్సీపీ మధ్య ముదురుతున్నవిభేదాలు
ముంబై: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య విభేదాలు ముసురుకుంటున్నాయి. ఎన్సీపీ అధిపతి శరద్ పవార్ గురువారం ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై నేరుగా దాడి చేయకుండా.. రాష్ట్రంలో పాలన నత్తనడకనసాగుతోందని విమర్శించారు. ‘పాలనా వ్యవహారాలు చూస్తున్న వారు సమర్థంగా వ్యవహరించక పోవడం వల్ల ఫైళ్లకు అనుమతులు మంజూరు కావడం లేదు. దీంతో పాలన స్తంభిస్తోంది. నెలలు గడుస్తున్నా ముఖ్యమైన పత్రాలపైనా సంతకాలు కావడం లేదు. ఏవైనా పనులు అనవసరం అనుకుంటే వాటిని వెంటనే తిరస్కరించాలి. నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌పై రచించిన ఈ పుస్తకాన్ని పవార్ ఆవిష్కరించాక మాట్లాడుతూ పైవిధంగా అన్నారు. దేశ్‌ముఖ్ సమర్థ ముఖ్యమంత్రని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టిచూస్తే చవాన్‌పై పవార్ అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి. చవాన్ పాలన మందకొడిగా సాగుతోందని, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సీట్ల లొల్లే కారణమా ? రాబోయే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తమకు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ఎన్సీపీకి నచ్చడం లేదని తెలుస్తోంది. ‘మారుతున్న రాజకీయ పరిస్థితులను పరిశీలించాలకే సీట్లను పెంచాలనే డిమాండ్‌ను లేవనెత్తాలని నిర్ణయించుకున్నాం’ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎన్సీపీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. 2009లో ఇది 26 స్థానాల్లో పోటీ చేసింది. ‘2004లో మా పనితీరు ఆధారంగా 2009లో కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించారు. ఇప్పుడు మా సామర్థ్యం మెరుగుపడింది కాబట్టి ఎంపీ స్థానాల సంఖ్య కూడా పెరగాలి. 2006లో మాకు 69 అసెంబ్లీ స్థానాలుంటే 2009లో అవి 82కు పెరిగాయి. ఎన్సీపీ స్థానాలు 71 నుంచి 62కు పడిపోయాయి’ అని సదరు నాయకుడు వివరించారు. హింగోలీ, కొల్హాపూర్, పర్భణి, అమరావతి, జల్గావ్లోని రెండు ఎంపీ సీట్లలో ఒకటిని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జల్గావ్లో ఒక ఎన్సీపీకి ఒక ఎంపీ ఉన్నాడు. ఇక ఎన్సీపీ యావత్మల్, జాల్నా, రాయిగఢ్, పాల్ఘర్ స్థానాలపై కన్నేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న పుణే ఎంపీ స్థానం కూడా మాకే కావాలని ఎన్సీపీ కోరుతోంది. అయితే ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే యావత్మల్కు చెందిన వారు కాగా, మాజీ సీఎం అబ్దుల్ రెహమాన్ రాయిగఢ్ సొంతస్థానం కావడ ం గమనార్హం. ఇక కాంగ్రెస్ డిమాండ్‌పై ఎన్సీపీ మండిపడుతోంది. ‘కాంగ్రెస్ మాతో పొత్తును రద్దు చేసుకొని మొత్తం 48 స్థానాల్లో పోటీ చేయొచ్చు! కొన్ని సీట్ల మార్పిడికి మాత్రం మేం సిద్ధం. మా అధిష్టానమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. ఈసారి కేంద్రంలో అదృష్టం కలిసివస్తే పవార్‌ను ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఎన్సీపీ కోరుకుంటోంది. అందుకే ఎంపీ స్థానాలపై పట్టువీడడం లేదు. దీనికితోడు ప్రతిపక్షాల ఎంపీలు కొందరు తమ పార్టీలో చేరే అవకాశం ఉండడంతో సీట్లను వదులుకోవడానికి ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే నవాబ్ మాలిక్ ఈ విషయంపై స్పందిస్తూ ఢిల్లీలో జరిగిన ఒప్పందం ప్రకారం 26:22 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు ఒప్పందానికి కాంగ్రెస్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టీకరించారు. ఈ విషయమై త్వరలోనే కాంగ్రెస్‌తో చర్చిస్తామని వెల్లడించారు. ఇక చవాన్‌పై పవార్ చేసిన విమర్శలపై స్పందిస్తూ తమ అధినేత ఇంగ్లిష్ చేసిన వ్యాఖ్యలను మరాఠీలో తప్పుగా తర్జుమా చేయడం వల్ల ఇలా జరిగిందని, రెండు పార్టీల మధ్య విభేదాలేవీ లేవన్నారు.