village panchayath
-
మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! తగ్గేదెలే!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. మంజు లెక్క చేయలేదు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కదా. ఆడపిల్ల ఎదిగితే ఆపాలని మూఢ విశ్వాసాల పేరుతో చూసే కుట్ర ఇది. జార్ఖండ్ రాష్ట్రం. గుమ్లా జిల్లా. సిసాయి మండలం. డహుటోలి గ్రామం. 22 ఏళ్ల మంజూ ఉరవ్ తన పొలం మీద వచ్చిన ఆదాయంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దాంతో తన పొలం దున్నుకోవాలనుకుంది. ఆడపిల్ల పొలం ఎందుకు దున్నాలనుకుంటోంది? మంజు డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అయితే ఉద్యోగం వెతుక్కునేలోపు కరోనా వచ్చి పడింది. ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంజూకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఐదెకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పెరిగింది. ఈ కరోనా ఎప్పుడు పోతుందోనని వ్యవసాయం మొదలెట్టింది. చదువుకున్న అమ్మాయి, పైగా వ్యవసాయం అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉంది. ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, టొమాటో వేసింది. రెండేళ్లు చేసిన సేద్యం ఆమెకు లాభం తెచ్చింది. జబ్బల్లో సత్తువ ఉంటే ఎవరు అడ్డుకుంటారు. ఇంకో పదెకరాల పొలం ఇటీవల కౌలుకు తీసుకుంది. అంటే ఇప్పుడు తన కింద 15 ఎకరాలు ఉన్నాయన్న మాట. అన్ని ఎకరాల పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఉంటే మేలు కదా. కొత్త ట్రాక్టరుకు డబ్బు లేదు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. తన పొలం తనే దున్నుకోగలదు అనుకుంది. అయితే ఈమె పాటికి ఈమె ఇలా డెవలప్ అయిపోతే ఎలా అనుకున్నారో నిజంగానే ఈమె ప్రతాపానికి భయపడ్డారోగాని పొలం దున్నుకోవడం మొదలెట్టిన మంజూను గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టి పిలిపించారు. మంజూ వెళ్లింది. ‘దుక్కి దున్నే పని మగవాడిది. ఆ సంగతి నీకు తెలియదు. మగవాళ్లు కాకుండా ఆడవాళ్లు నాగలి పట్టినా, ట్రాక్టర్‌తో దున్నినా ఊరికి అరిష్టం. కరువొచ్చి పడుతుంది. లేని పోని మహమ్మారులు చుట్టు ముడతాయి. కనుక వెంటనే నువ్వు దున్నడం ఆపేయాలి. తప్పు కట్టి ఇక ఈ పని చేయనని హామీ ఇవ్వాలి. కాదూ కూడదని మళ్లీ దున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తాం’ అన్నారు. మంజు జంకలేదు ‘ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డు పుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ట్రాక్టర్ ఎక్కి పని చేసుకోవడానికి వెళ్లిపోయింది. మీడియాకు ఈ సంగతి తెలిసి వార్తయ్యింది. లోకల్ పోలీసులు ఇరు వర్గాలను కూచోబెట్టి ‘ఇది మూఢ విశ్వాసం. ఆ అమ్మాయిని దండించేందుకు పంచాయితీకి హక్కు లేదు. అలా ఆపడానికి లేదు’ అని ఊరి పెద్దలకు చెప్పారు. ఊరు వింటేగా? ఎందుకు? ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడి సక్సెస్ఫుల్ రైతుగా ఎదిగితే కుర్రకారు దానిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి అవమానంగా భావిస్తారు. పేదవాళ్లు పేదగా ఉండాలిగాని ఇలా ఎదిగితే ఉన్నోళ్లు కన్నెర్ర చేస్తారు. ఆడవాళ్లు నాలుగ్గోడల్లో ఉండకుండా ఇలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే మగవాళ్లు ఆగ్రహిస్తారు. వీటన్నింటి ఫలితమే ‘అరిష్టం’ అనే మూఢవిశ్వాసం. ఆడవాళ్లు ముందుకు సాగేకొద్ది ఎక్కడో ఒక చోట అడ్డు పడే పురుష ప్రపంచం ఉంటుంది. వారిని ఓడించి ముందుకు సాగే మంజు వంటి యువతులూ ఉంటారు. ఉండాలి కూడా. ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. – మంజూ ఉరవ్ -
మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష
ముంబై: కాలంతో పాటు మనం మారాలని అంటుంటారు. కానీ ఇంకా పలు గ్రామాల్లో పెద్దలుగా చెలామని అవుతున్న కొందరు వాళ్లు మారకపోవడమే గాక ఇతరులను తమ దారిలోనే నడవాలని అనుకుంటున్నారు. అదే తరహాలో ఇటీవల ఓ మహిళకు రెండో పెళ్లి చేసుకున్నందుకు గాను ఆ ప్రాంత కుల పెద్దలు ఆమెకు దారుణ శిక్ష విధించారు. కుల పెద్దల ఉమ్మిని నాకాలని ఆదేశించారు. ఈ దారుణ ఘటన మహారాష్ర్ట అకోలా జిల్లాలో చోటు చేసుకుంది. అకోలా జిల్లాకు చెందిన ఓ మహిళ(35)కు 2011లో వివాహమైంది. కుటుంబ గొడవల కారణంగా తన భర్తకు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన ‘నాథ్ జోగి’ పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమె రెండో పెళ్లి గురించి మాట్లాడని ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోదరితో పాటు బంధువులను కుల పెద్దలు పంచాయతీకి పిలిపించారు. రెండో పెళ్లి చేసుకోవడం తప్పని అందుకు శిక్ష అనుభవించాలని తెలిపారు. చేసిన తప్పుకు గాను.. కుల పెద్దలంతా కలిసి అరటి ఆకులపై ఉమ్మి వేస్తారని, దాన్ని సదరు మహిళ నాకాలని ఆదేశించారు. అంతే కాకుండా రూ. లక్ష జరిమానా వేశారు. ఈ శిక్షపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత మహిళ.. నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ కుల పెద్దల నిర్వాకం బయటపడింది. ( చదవండి: నా దృష్టిలో నాగలక్ష్మి దేశంలోనే అత్యంత ధనవంతురాలు :సోనూసూద్ ) -
నేడు మూడో విడత పంచాయతీ ఎన్నికలు
-
గ్రామ పంచాయితీ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో ఓ గ్రామ పంచాయితీ జారీ చేసిన ఆదేశాలు కాస్త విడ్డూరంగానూ.. చర్చనీయాంశంగానూ మారాయి. టాయ్లెట్లలో పిల్లల ఫోటోలను తీసి వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేయాలని పంచాయితీ పెద్దలు స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించారు. ధామటారి జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీ అధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను కలుపుకుని సుమారు 355 పాఠశాలలకు ఈ ఉత్తర్వులు అందాయంట. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఆయా స్కూళ్లలో టాయ్ లెట్ల నిర్మాణాలను చేపట్టగా.. వాటి పనితీరు... పిల్లలు వాటిని సరిగ్గా వినియోగిస్తున్నారా? లేదా? శుభ్రత తదితర విషయాలపై స్పష్టత కోసమే ఈ ఆదేశాలను ఇచ్చినట్లు పంచాయితీ పెద్దలు చెబుతున్నారు. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైపోయాయి. ఇది ముమ్మాటికీ పిల్లల హక్కులను భంగం కలిగించటం అవుతుందని.. పైగా స్కూల్ సిబ్బంది కూడా ఈ ఆదేశాలను ఇబ్బందిగా భావిస్తున్నారని టీచర్లు చెబుతున్నారు. -
50 రోజులుగా ఉద్యమ జ్వాల
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాలు మహోద్ధృతంగా సాగుతున్నాయి. మారుమూల పల్లెల నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. జూలై 31న మొదలైన సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్రమై బుధవారానికి 50 రోజుకు చేరింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో గత నెల 13 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. జీతాలు లేకపోయినా ఏమాత్రం వెరువకుండా సమైక్యాంధ్ర కోసం నిరంతరం ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. గ్రామస్థాయిలోని వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ కార్యాలయాలు మొదలుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అన్నీ మూతపడ్డాయి. మొదట్లో కొన్ని శాఖలకే పరిమితమైన సమ్మె క్రమంగా అన్నింటికీ విస్తరించింది. జూలై 31 నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లాపరిషత్ పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరుచుకోనేలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంత దీర్ఘకాలం సమ్మె చేయడం ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా గనుల శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెలో ఉండటంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. గ్రామ పంచాయతీలు సైతం సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి ప్రధాని, రాష్ట్రపతి తదితరులకు పంపుతున్నాయి. 50 రోజులకు చేరిన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహించేందుకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఈ నెల 30వ తేదీ వరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదని, సమైక్యాంధ్ర కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని సమైక్యవాదులు ప్రకటిస్తున్నారు.