Village school
-
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్‌కు డిప్యూటేషన్‌పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్‌పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్‌పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
గ్రామస్తుల ఐక్యతకు ‘విదేశీయుల’ సలామ్
సాక్షి, ఐనవోలు: మండలంలోని ఒంటి మామిడిపల్లి గ్రామస్తుల ఐక్యతను బాల వికాస ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన విదేశీ బృందం ప్రశంసించింది. శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సూడాన్, అఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన 11 మంది సభ్యుల విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను గ్రామస్తులు ఏవిధంగా సమిష్టి నిర్ణయంతో తిరిగి తెరిపించుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలకు జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉందని గ్రామస్తులు తెలియజేశారు. విదేశీ ప్రతినిధి బృందం గ్రామం మొత్తం తిరిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి çపనుల గురించి సర్పంచ్ ఆడెపు దయాకర్, ఎంపీటీసీ పెండ్లి కావ్య తిరుపతిలను అడిగి తెలుసుకున్నారు. మౌళిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలవికాస ప్రతినిధులు పీడీటీసీ మేనేజర్ సునీత, ఆఫీసర్ ఫ్రాన్సిస్ మంజుల, గజేందర్, సురేందర్, పాఠశాల చైర్మన్ పొన్నాల రాజు, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ జైపాల్, రాజు, వెంకన్న, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
పల్లె బడి.. టీచర్లేరీ!
సాక్షి, హైదరాబాద్: పల్లె బడికి కష్టమొచ్చింది. ఉపాధ్యాయ బదిలీలతో అక్కడ బోధన సంకటంలో పడింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేని పరిస్థితి నెలకొంది. టీచర్లు లేకపోవడంతో పిల్లల సంఖ్య కూడా పతనమవుతోంది. నాలుగేళ్ల అనంతరం నిర్వహించిన బదిలీలు కావడంతో గ్రామీణ ప్రాంత బడులు ఖాళీ అయ్యాయి. ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు పట్టణ, జిల్లా, తాలూకా కేంద్రాల్లోని స్కూళ్లకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,150 స్కూళ్లలో పూర్తిస్థాయి టీచర్లకు స్థానచలనం కలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై క్షేత్రస్థాయిలో నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో తాజా బదిలీల తంతు పల్లె బడులను మరింత అఘాతంలోకి నెట్టేసినట్లైంది. 44,361 మందికి స్థానచలనం బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,361 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 2,189 మందికీ స్థానచలనం కలిగింది. మరో 42,172 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా బదిలీ అయ్యారు. దశాబ్దన్నర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు బదిలీ కావడం ఇదే తొలిసారి. తాజా బదిలీల్లో 42 శాతం టీచర్లు పట్టణ ప్రాంతాలకు వచ్చినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పల్లె బడులు బలహీనపడ్డాయి. అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడంతో బోధన ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో టీచర్‌లెస్, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్ల వివరాలను క్షేత్ర స్థాయి నుంచి విద్యా శాఖ సేకరిస్తోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన టీఆర్టీ ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో బోధన కుంటుపడే ప్రమాదం నెలకొంది. విద్యా వలంటీర్లతో భర్తీ బదిలీలతో ఏర్పడిన ఖాళీలతో పాటు సాధారణ ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 16,781 వీవీలను నియమించుకోవాలని డీఈవోలను ఆదేశించింది. మంజూరైన వీవీ పోస్టుల్లో 15,473 మందిని ఉపాధ్యాయ, సెలవులతో ఏర్పడిన ఖాళీలతో భర్తీ చేస్తారు. మరో 1,308 మందిని తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధకులుగా నియమిస్తారు. వీరికి నెలవారీ గౌరవ వేతనంగా రూ.12 వేలు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఛిఛీట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీచర్లు లేని స్కూళ్లు కొన్ని వికారాబాద్ జిల్లా దోమ మండలం కుమ్మరితం డా ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో ఇద్దరూ బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులుండగా 8 పోస్టులున్నాయి. బదిలీలతో ఇక్కడ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ఉన్నత పాఠశాలలో 350 మంది పిల్లలున్నారు. ఇక్కడ 8 మంది టీచర్లుండగా ఆరుగురు పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లా దాదాపూర్ ఉన్నత పాఠశాలలో 550 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ 20 మంది పనిచేస్తుండగా తాజా బదిలీలతో 12 మందికి స్థానచలనం కలిగింది. -
'వెన్నెల' క్రీడా వెలుగులు
మట్టిలో ఉన్నా మాణిక్యం కాంతులీనుతుందంటారు. అలాంటి కోవకు చెందినదే ఓ చిన్నారి. చదివేది గ్రామీణ పాఠశాలలోనైనా.. క్రీడా పోటీల్లో మాత్రం మిస్సైల్లా దూసుకుపోతోంది. తొమ్మిదో తరగతిలోనే తన ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రశంసలందుకుంటోంది. అయితే నిరుపేద కుటుంభంలో పుట్టిన ఆ బాలిక ప్రతిభను పేదరికం అడ్డుకుంటోంది. ఎవరైనా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు తెస్తానంటున్న చిన్నారి శ్రీవెన్నెల వివరాలు చదవండి. మేదరమెట్ల: క్రీడల్లో వెలుగులు నింపుతున్న శ్రీవెన్నెల ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి చెందిన కోటా దేవదాసు, సుజాతల కుమార్తె. ఈ బాలిక గ్రామంలోని ఆరివారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈఏడాది తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడల పట్ల వెన్నెల కున్న ఆసక్తి గమనించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రతిమ ఆ బాలికకు, డిస్కస్‌త్రో. షాట్‌పుట్‌లలో తర్ఫీదునిచ్చారు. ఆ రెండు ఈవెంట్స్‌లో విద్యార్థిని ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సా«ధించి, జాతీయ స్థాయికి ఎంపికై అందరి మన్ననలను అందుకుంటోంది. ఆశయానికి అడ్డోస్తున్న పేదరికం.. శ్రీ వెన్నెల తండ్రి బేల్దారీ పనులు చేస్తుంటాడు. పేద కుటుంబం కావడంతో తమ కుమార్తెను గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిస్తున్నారు. తన బిడ్డ డిస్కస్‌త్రో, షాట్‌పుట్ ఈవెంట్లలో జాతీయ స్థాయికి ఎంపికైందని తెలుసుకుని బాలిక తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఆమెకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి, తమ పేదరికం అడ్డొస్తుందని, ఎవరైనా దాతలు ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి పతకాలను అందిస్తానని చెబుతోందంటున్నారు కన్నవారు. శ్రీవెన్నెల సాధించిన విజయాలు.. ♦ 2016–17 సంవత్సరం పొదిలిలో నిర్వహించిన డిస్కస్ త్రో షాట్çపుట్ పోటీల్లో మొదటి స్థానం సాధించింది. ♦ 2017–18లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో రెండు ఈవెంట్స్‌లో మొదటి స్థానం సాధించింది. విద్యార్థిని ప్రతిభను గమనించిన స్టేట్ సెలక్షన్ కమిటీ బాలికను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసింది. ♦ పలాసాలో నిర్వహించిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని డిస్కస్ త్రోలో మొదటి స్థానం, షాట్పట్లో మూడో స్థానం సాధించింది. జాతీయ స్థాయికి ఎంపిక.. ♦ ఈనెల 18న మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రోత్సహిస్తే దేశానికి పతకాలు తెస్తా.. క్రీడల్లో మరింత రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలను అందించాలని ఉంది. క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదుకొని పోలీసు అధికారి కావాలని ఆసక్తిగా ఉంది. పెద్ద కోచ్‌ల వద్ద కోచింగ్ ఇప్పించే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే మంచి స్థాయిలో నిలిచేందుకు కృషి చేస్తా. – కోటీ శ్రీ వెన్నెల -
జనశక్తి నక్సల్స్‌పై పోలీసుల కాల్పులు
⇒ కాంట్రాక్టర్ నుంచి రూ.5లక్షలు డిమాండ్ ⇒ రూ.50వేలకు కుదిరిన ఒప్పందం ⇒ మొదటి విడతగా రూ.10వేలు అందజేత ⇒ తిరిగి వెళ్తుండగా పోలీసుల కాల్పులు ⇒ ఒకరికి గాయాలు.. ⇒ ఆయుధంతో పాటు అదుపులోకి.. ⇒ మరొకరు పరారీ ⇒ జిల్లాలో కదలికలపై ఆందోళన ఒకరికి గాయాలు.. ఆయుధం స్వాధీనం? కోవెలకుంట్ల: అవుకు మండల పరిధిలోని రామాపురం గ్రామ పాఠశాల వద్ద జనశక్తి నక్సల్స్‌పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. ఘటనలో ఒక నక్సలైట్‌కు బుల్లెట్ గాయం కాగా అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో కర్నూలుకు తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. బనగానపల్లెకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్వరరెడ్డి నుంచి జనశక్తి నక్సల్స్ పార్టీ కార్యకలాపాల నిమిత్తం రూ.5లక్షలు డిమాండ్ చేశారు. అందుకాయన తాను అంత ఇచ్చుకోలేనని.. రూ.50వేలు మాత్రమే ఇస్తానని అంగీకరించాడు. మొదటి విడతగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రూ.10వేలు కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గ్రామ పాఠశాల సమీపంలో ముట్టజెప్పాడు. మిగిలిన మొత్తం సోమవారం అందజేయాలని చెప్పిన నక్సల్స్ ఉసేని, మారుతిలు మోటార్ బైక్‌పై అవుకు మండలం రామాపురం మీదుగా బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకున్న కోవెలకుంట్ల పోలీసులు వారిని వెంబడించారు. ఈ నేపథ్యంలో నక్సల్స్ బైక్‌ను పొలాల్లో వదిలేసి జొన్న సేనులో నుంచి పారిపోతుండగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపారు. మారుతికి బుల్లెట్ గాయం కాగా.. ఉసేని పరారయ్యాడు. ఆ వెంటనే 50 మంది పోలీసులు రౌండప్ చేసి మారుతుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఆయుధం స్వాధీనం చేసుకుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో కర్నూలుకు తరలించారు. ఇదే సమయంలో జనశక్తి నక్సల్స్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న బెలూంకు చెందిన శివశంకర్ అలియాస్ శివ, వెంకటరమణ అలియాస్ మెష, పేరుసోములకు చెందిన పక్కీర అలియాస్ ప్రతాప్‌తో పాటు మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కాల్పుల ఘటనను, మారుతిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఈ ఆపరేషన్‌లో కోవెలకుంట్ల సీఐ నాగరాజుయాదవ్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బెలూం గ్రామంలో నాపరాతి గనుల పంచాయితీ వ్యవహరం తేల్చేందుకు వారం రోజుల క్రితమే ఇద్దరు నక్సల్స్ గ్రామానికి చేరుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది.