villages Pollution
-
అర్ధరాత్రి గ్యాస్ కలకలం
భువనగిరి : అది జూన్ 30వ తేదీ అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా గ్యాస్ వాసన రావడంతో జనం ఆందోళన చెందారు. తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకైందని భయంగా వంటింట్లోకి వెళ్లి చూసుకున్నారు. ఇలా కాలనీల ప్రజలందరూ చూసుకున్నారు. ఎక్కడా లీక్ కాలేదు. రాత్రిపూట కాలనీ లవాసులందరూ వీధుల్లోకి వచ్చారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్యాస్ వాసన వస్తుండడంతో పారిశ్రామికవాడ నుంచి వస్తుండొచ్చు అని అనుమానించారు. దీంతో ఆదివారం ఉదయం మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ పారిశ్రామిక వాడకు వెళ్లి అక్కడి నుంచి వాసన వస్తున్నట్లు తెలుసుకుని నల్లగొండ కాలుష్య కంట్రోల్‌బోర్డ్ అధికారులకు సమాచారం అందించారు. సమచారం అందుకు న్న అధికారులు పోలీసులతో పారిశ్రామిక వాడకు చేరుకుని కంపెనీని గుర్తించారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు పట్టణ శివారులోని పారిశ్రామికవాడలో వాసన వస్తున్న కంపెనీనీ గుర్తించి కాలుష్యం కంట్రోల్ బోర్డ్ ఏఈఈ వీరేష్, అసెస్మెంట్ గ్రేడ్ 1 అధికారి రవీందర్‌లు శాంపిల్స్‌ను సేకరించారు. అంతకు ముందు కంపెనీలో ఏం ఉత్పత్తి అవుతుంది. ఏఏ పదార్థాలు ఉపయోగిస్తారు. ఎంతమోతాదులో ఉపయోగిస్తారు. వ్యర్థాలు ఎక్కడికి పంపుతారు. రా మెటీరియల్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. వంటి వివరాలను సేకరించారు. అనంతరం కంపెనీలోని మిషన్లను, ముడిపదార్థాలను పరిశీలించారు. అలాగే కంపెనీ అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. ఇంజిన్, కటింగ్ ఆయిల్ ఉత్పత్తి ఇటీవలె అనుమతి పొంది ఇంజిన్, కటింగ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే కంపెనీనీ పట్టణంలోని శివారులోని పారిశ్రామిక వాడలో సర్వే నంబర్ 860, ఫ్లా ట్ నెంబర్ 24 / ఆ–1లో ఏర్పాటు చేశారు. కాగా ఈ కంపెనీలో ఇంజిన్, కటింగ్ ఆయిల్ తయారు చేస్తారు. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఇంజన్ ఆయిల్ తయారుచేసేందుకు ట్రయల్‌రన్ నిర్వహించారు. దీనిని ఉత్పత్తి చేసేందుకు రెండు రియాక్టర్లు ఉన్నాయి. మొదటి రియాక్టర్లో హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న ఐపీఈ(ఐసో ప్రోపైల్ ఆల్క హాల్), ఎంఐసీ(మిథైల్ ఐసోపుటైల్ కార్బి నల్) వేసి 55 డిగ్రీల టెంపరేచర్లో ఉంచారు. అక్కడి నుంచి రెండో రియాక్టర్‌లోకి వెళ్లినప్పుడు ఆ రెండు రా మెటీరియల్‌తో పాటు రెండో రియాక్టర్లో థానే నుంచి కొనుగోలు చేసిన జింక్‌ను కలి పారు. ఈ రియాక్టర్లో 90 డిగ్రీల టెంపరేచర్లో ఉంచారు. ఇక్కడ నుంచి లిక్విడ్(ఆయిల్) రా వా ల్సి ఉండగా లిక్విడ్కి బదులు సాలిడ్ వచ్చింది. దీంతో సిబ్బంది అదే రోజు రాత్రి సాలీడ్ వచ్చిన ట్యాంకర్లు వాటికి సంబంధించిన మిషన్లను శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వాసన సాధారణంగా జింక్ నుంచి వస్తుందని కంపెనీ సిబ్బంది చెప్పారు. సాధారణంగా ఒక్కోసారి ఇంజన్ ఆయిల్ తయారు చేయడానికి 200 కేజీల రా మెటీరియల్ ఉపయోగిస్తే 180 కేజీల ఆయిల్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఉత్పత్తిలో భాగంగా ట్రయల్ రన్ చేసే ప్రాథమిక దశలోనే సంఘటన జరిగింది. త్వరలోనే ఫలితాలు కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసన సంబంధించి వివరాలు సేకరించాం. సేకరించిన ఉత్పత్తికి ఉపయోగించే రా మెటీరియల్ శాంపిల్స్‌ను ఉన్నత కార్యాలయానికి పంపి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష ఫలితాలు రాగానే నిబంధనలకు విరుద్ధంగా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీరేశ్, రవీందర్, కాలుష్య కంట్రోల్‌బోర్డు అధికారులు -
ఇదేనా స్వచ్ఛ భారత్?
కూడేరు : పారిశుద్ధ్యం పట్ల మండల అభివృద్ధి అధికారి , పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రతకు నోచుకోలేదు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. కూడేరు మండలంలో 14 పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండల అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ) ఆవరణలోనే చెత్తా చెదారంతో కంపు కొడుతోందంటే అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో ఆర్థం చేసుకోవచ్చు. వీధుల్లో ఉన్న చెత్తను మూడు చక్రాల బండిలో తెచ్చి ఎంపీడీఓ కార్యాలయ గేటు ముందు పడేస్తున్నారు. అందులో స్థానికులు కొందరు మలమూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతోంది. ఈ కంపును దాటుకొని మండల ప్రజలు అంగన్వాడీ కేంద్రం, ఐకేపీ కార్యాలయం, హౌసింగ్ ఆఫీసర్, హార్టికల్చర్ కార్యాలయాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రజలు ముక్కు మూసుకొని వెళుతున్న పరిస్థితి నెలకొంది. రోజు అధికారులు ఈ కంపును చూస్తు వెళుతున్నారే తప్ప శుభ్రం చేయిద్దామన్న ఆలోచన లేదని ప్రజలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పల్లె గతి ఇంతే
ఏలూరు: పల్లెల్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో అధికారుల్లో చిత్తశుద్ధి కరువైంది. జనావాసాల నడుమ పేరుకుపోతున్న చెత్తను తొలగించే పని అంతంతమాత్రంగానే సాగుతోంది. మరోవైపు వీధుల్లో తొలగించే చెత్తను వేసేందుకు డంపింగ్ యూర్డులు నిర్మించకపోవడంతో పల్లెల్ని కాలుష్యం కాటేస్తోంది. జిల్లాలో 884 పంచాయతీలు ఉండగా, దశల వారీగా అన్ని గ్రామాల్లో డంపింగ్ యూర్డులు ఏర్పాటు చేస్తామంటున్న ఉన్నతాధికారుల ప్రకటనలు ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. మొదటి దశగా 150 గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలోనే ప్రకటించారు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఒక్కచోట కూడా డంపింగ్ యూర్డును ఏర్పాటు చేయలేకపోయూరు. ఫలితం గా గ్రామాలు మురికి కూపాలుగా మారుతున్నారుు. తొలగించిన చెత్తను మంచినీటి చెరువులు, దూడల చెరువులు, సామూహిక మరుగుదొడ్లు ఉన్న ప్రాంతాల్లో వేస్తుండటంతో కాలుష్యం పెరిగిపోతోంది. సెంటు భూమైనా కేటాయించలేదు డంపింగ్ యూర్డు కోసం కనీసం ఒకటి నుంచి నాలుగు సెంట్ల స్థలమైనా కేటాయించాలంటూ రెవెన్యూ శాఖను పంచాయతీ వర్గాలు వేడుకుంటున్నాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి గ్రామంలో పోరంబోకు, గ్రామకంఠం భూములు ఉన్నాయి. వాటిని డంపింగ్ యూర్డుల కోసం కేటాయించే అవకాశం ఉన్నా రెవెన్యూ యం త్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఆర్థిక సంఘం నిధులిచ్చినా... గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడితే ప్రజలు రోగాల బారినుంచి బయటపడతారు. ఈ దృష్ట్యా పల్లెల్లో పారిశుధ్యం, మంచినీటి వనరుల కోసం కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం ద్వారా గడచిన ఐదేళ్లలో జిల్లాలోని పంచాయతీలకు రూ.300 కోట్లను మంజూరు చేసింది. ఈ మొత్తంలో 50శాతం నిధులను పారిశుధ్య పరిస్థితుల మెరుగుదలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అరుుతే, గ్రామాల్లో డంపింగ్ యార్డులకు అవసరమైన స్థల సేకరణకు ఈ నిధుల్లో ఒక్కపైసా కూడా వెచ్చించలేదు. పంచాయతీల్లో చెత్త సేకరణ రిక్షాలను కొనుగోలు చేసి మాలన పడేశారు. పాలకులు, అధికారులు డంపింగ్ యూర్డుల సమస్యపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో గజం స్థలం కూడా దక్కే అవకాశం ఉండదని పంచాయతీ పాలకవర్గాలు వాపోతున్నారుు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవిష్యత్‌లో స్థలాల కొరత తీవ్రమవుతుందని, ఈలోగానే డంపింగ్ యూర్డులకు అవసరమైన స్థలాలు సమకూర్చాలని పాలకవర్గాలు కోరుతున్నాయి.