పల్లె గతి ఇంతే
ఏలూరు: పల్లెల్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో అధికారుల్లో చిత్తశుద్ధి కరువైంది. జనావాసాల నడుమ పేరుకుపోతున్న చెత్తను తొలగించే పని అంతంతమాత్రంగానే సాగుతోంది. మరోవైపు వీధుల్లో తొలగించే చెత్తను వేసేందుకు డంపింగ్ యూర్డులు నిర్మించకపోవడంతో పల్లెల్ని కాలుష్యం కాటేస్తోంది. జిల్లాలో 884 పంచాయతీలు ఉండగా, దశల వారీగా అన్ని గ్రామాల్లో డంపింగ్ యూర్డులు ఏర్పాటు చేస్తామంటున్న ఉన్నతాధికారుల ప్రకటనలు ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. మొదటి దశగా 150 గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలోనే ప్రకటించారు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఒక్కచోట కూడా డంపింగ్ యూర్డును ఏర్పాటు చేయలేకపోయూరు. ఫలితం గా గ్రామాలు మురికి కూపాలుగా మారుతున్నారుు. తొలగించిన చెత్తను మంచినీటి చెరువులు, దూడల చెరువులు, సామూహిక మరుగుదొడ్లు ఉన్న ప్రాంతాల్లో వేస్తుండటంతో కాలుష్యం పెరిగిపోతోంది.
సెంటు భూమైనా కేటాయించలేదు
డంపింగ్ యూర్డు కోసం కనీసం ఒకటి నుంచి నాలుగు సెంట్ల స్థలమైనా కేటాయించాలంటూ రెవెన్యూ శాఖను పంచాయతీ వర్గాలు వేడుకుంటున్నాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి గ్రామంలో పోరంబోకు, గ్రామకంఠం భూములు ఉన్నాయి. వాటిని డంపింగ్ యూర్డుల కోసం కేటాయించే అవకాశం ఉన్నా రెవెన్యూ యం త్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఆర్థిక సంఘం నిధులిచ్చినా...
గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడితే ప్రజలు రోగాల బారినుంచి బయటపడతారు. ఈ దృష్ట్యా పల్లెల్లో పారిశుధ్యం, మంచినీటి వనరుల కోసం కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం ద్వారా గడచిన ఐదేళ్లలో జిల్లాలోని పంచాయతీలకు రూ.300 కోట్లను మంజూరు చేసింది. ఈ మొత్తంలో 50శాతం నిధులను పారిశుధ్య పరిస్థితుల మెరుగుదలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అరుుతే, గ్రామాల్లో డంపింగ్ యార్డులకు అవసరమైన స్థల సేకరణకు ఈ నిధుల్లో ఒక్కపైసా కూడా వెచ్చించలేదు. పంచాయతీల్లో చెత్త సేకరణ రిక్షాలను కొనుగోలు చేసి మాలన పడేశారు. పాలకులు, అధికారులు డంపింగ్ యూర్డుల సమస్యపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో గజం స్థలం కూడా దక్కే అవకాశం ఉండదని పంచాయతీ పాలకవర్గాలు వాపోతున్నారుు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవిష్యత్‌లో స్థలాల కొరత తీవ్రమవుతుందని, ఈలోగానే డంపింగ్ యూర్డులకు అవసరమైన స్థలాలు సమకూర్చాలని పాలకవర్గాలు కోరుతున్నాయి.