ఈసారి ముందుగా ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం!
హైదరాబాద్: నగరంలోని ఇతర వినాయక విగ్రహాల నిమజ్జనం కంటే ముందుగానే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగనుంది. బుధవారం హైదరాబాద్లో గ్రేటర్ పరిధిలో వినాయక ఉత్సవాలపై సమావేశం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం ముందుగానే చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇంతకముందు నగర పరిసర ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలన్నీంటిని నిమజ్జనం చేసిన తరువాత ఎప్పటికోగానీ ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అలా కాకుండా ఖైరతాబాద్ గణనాథుడిని వచ్చే నెల 15న మధ్యాహ్నం 2 గంటల లోపే నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, ముగ్గురు పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దని సూచించారు.