Vinod agarwal
-
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
వాహన రేట్ల పెంపు యోచనలో వీఈసీవీ
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి మరింత కఠినతర ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను 5 శాతం వరకూ పెంచాలని వీఈ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) యోచిస్తోంది. బీఎస్–4, బీఎస్–6 ప్రమాణాలతో పోలిస్తే రేట్ల పెంపు తక్కువ స్థాయిలోనే.. 3–5 శాతం శ్రేణిలో ఉండవచ్చని అనలిస్టులతో సమావేశంలో కంపెనీ ఎండీ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మోడల్స్‌లో కూడా దశలవారీగా మార్పులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వోల్వో గ్రూప్, ఐషర్ మోటర్స్ కలిసి వీఈసీవీని జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. యూరో–6 ప్రమాణాలకు సరిసమానమైన భారత్ స్టేజ్ 6 (బీఎస్–6) రెండో దశకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దడంపై దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మరింత అధునాతనమైన పరికరాలను ఫోర్ వీలర్లు, వాణిజ్య వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉద్గారాల పరిశీలించేందుకు వాహనంలో సెల్ఫ్–డయాగ్నోస్టిక్ డివైజ్ కూడా ఉండాలి. ఒకవేళ ఉద్గారాలు నిర్దిష్ట స్థాయి దాటితే వార్నింగ్ లైట్ల ద్వారా తక్షణం సర్విసుకు ఇవ్వాలనే సంకేతాలను డివైజ్ పంపుతుంది. -
అట్రాసిటీ కేసుల విచారణ వేగం పెంచండి
జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి వినోద్ అగర్వాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్ కులాలపై జరిగిన దాడులు, అత్యాచారాల కేసుల విచారణను వేగవంతం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి డా. వినోద్ అగర్వాల్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కేసుల్లో బాధ్యులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాడులు, అత్యాచారాలకు గురైన ఎస్సీలకు ఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ట్రస్ట్ ద్వారా రూ.5 లక్షల వరకు సాయమందే అవకాశం ఉందని, దీనిని ఉపయోగించుకోవాలన్నారు. ఎస్సీలపై అత్యాచారాలు, ఉప ప్రణాళిక, రిజర్వేషన్ల అమలుపై గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విద్యాయోజన పథకం కింద విదేశాల్లో ఉన్నతవిద్యనభ్యసించేందుకు కేంద్రం అందించే సాయానికి సంబంధించి తల్లిదండ్రుల ఆదాయపరిమితిని రూ.2 లక్షల నుంచి 4.5 లక్షలకు పెంచాలని సూచించారు. రాష్ట్రస్థాయి ఎస్సీ కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు.