జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి వినోద్ అగర్వాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్ కులాలపై జరిగిన దాడులు, అత్యాచారాల కేసుల విచారణను వేగవంతం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి డా. వినోద్ అగర్వాల్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కేసుల్లో బాధ్యులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాడులు, అత్యాచారాలకు గురైన ఎస్సీలకు ఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ట్రస్ట్ ద్వారా రూ.5 లక్షల వరకు సాయమందే అవకాశం ఉందని, దీనిని ఉపయోగించుకోవాలన్నారు. ఎస్సీలపై అత్యాచారాలు, ఉప ప్రణాళిక, రిజర్వేషన్ల అమలుపై గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విద్యాయోజన పథకం కింద విదేశాల్లో ఉన్నతవిద్యనభ్యసించేందుకు కేంద్రం అందించే సాయానికి సంబంధించి తల్లిదండ్రుల ఆదాయపరిమితిని రూ.2 లక్షల నుంచి 4.5 లక్షలకు పెంచాలని సూచించారు. రాష్ట్రస్థాయి ఎస్సీ కమిటీలను ఏర్పాటుచేయాలన్నారు.
అట్రాసిటీ కేసుల విచారణ వేగం పెంచండి
Published Fri, Feb 20 2015 3:37 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement
Advertisement